NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

ర్యాంకు ఉన్నా రిజల్ట్ లేదు..! “బాబు.., జగనూ” తలదించుకోవాల్సిందే..!!

 

అనగనగా ఒ ఆసుపత్రి. కొత్తగా కట్టారు. ఆ ఆసుపత్రి ఐదేళ్లలో విపరీతమైన పేరు ప్రఖ్యాతులు సంపాదించింది. దేశం మొత్తం మీద ఎప్పుడు ర్యాంకులు ప్రకటించినా ఈ హాస్పిటల్ టాప్ లో ఉంటుంది. పత్రికల్లో, మీడియాలో విపరీతమైన పబ్లిసిటీ వస్తుంది.ఆ ఆసుపత్రి యాజమాన్యం కూడా మేము గొప్ప, మేము గొప్ప అని చెప్పుకుంటుంది. దేశంలో కూడా ఈ హాస్పిటల్ నెంబర్ వన్ ఎలా? ఇక్కడ ఫలితాలేంటి అనేంతగా ఆశ్చర్యపోతారు. తీరా చూస్తే ఆ హాస్పిటల్ కి వెల్లిన పేషెంట్స్ ఎవ్వరు బతకరు. ఆ హాస్పిటల్ కి పేషెంట్స్ రావడానికే భయపడతారు. కానీ ర్యాంక్ లు మాత్రం అలాగే వస్తాయి. ఇది కధ. ఈ కథనే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే ర్యాంక్ కు ఆపాదించుకుంటే.. ప్రతి సంవత్సరం మొదటి ర్యాంకులు వస్తాయి. ఆ ర్యాంక్ ల వచ్చిన ఫలితాలు ఏమిటి? ఎన్ని పరిశ్రమలు వచ్చాయి? ఎంత మందికి ఉద్యోగాలు వచ్చాయి? ఎన్ని కోట్ల పెట్టుబడులు వచ్చాయి? అనేది మాత్రం శూన్యమే. ఇలా ఉన్నప్పుడు ఎన్ని ర్యాంక్ లు వస్తే ఏం లాభం. ఏమి జగన్..! ఏమి చంద్రబాబు..!! దీనికి సమాధానం చెప్పగలరా?.

అసలు విషయం ఏమిటంటే..?

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (సులభతరమైన వాణిజ్య విధానం) దీనిలో ఏపీ ప్రభుత్వం మొదటి స్థానంలో నిలిచింది. ఇది కొత్త కాదు. గడిచిన నాలుగు సంవత్సరాలు కూడా ఫస్ట్ ర్యాంక్ నిలబెట్టుకుంది. ఇది వైసిపి గొప్పతనమే అని వైసిపి నాయకులు చెప్పుకుంటున్నారు. ఇది తెలుగు దేశం పార్టీ గొప్పతనం, ఇది చంద్రబాబు నాయుడు ముందు చూపు చలవ అని ఆ పార్టీ నాయకులు కొట్టుకుంటున్నారు. ఇరు పార్టీ లు వాదులాడుకుంటున్నాయి. రాజకీయం చేసుకుంటున్నాయి. తమ పక్షాన వేసుకుంటున్నాయి. కరెక్టే. కానీ వరుసగా నాలుగేళ్ల పాటు మెదటి ర్యాంక్ సాధించిన రాష్ట్రంలో ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు రావాలి? ఎంత మంచికి ఉద్యోగాలు రావాలి? కానీ అవేమి ఫలితం క్షేత్రస్థాయిలో కనిపించడం లేదు. అనుకున్న ప్రాజెక్టులు, పరిశ్రమలు ఏవి కూడా ముందడుగు పడటం లేదు. కానీ ఎందుకో ఈ ర్యాంక్ లు. ర్యాంక్ లు అన్నీ రాజకీయం, ప్రగల్భాలకే తప్ప పరిశ్రమలకు, ఉద్యోగాలకు, స్వయం ఉపాధి కి మాత్రం ఉపయోగపడడం లేదు.

సరే రాజకీయానికే వద్దాం.. వైసీపీకి ఏమి సంబంధం..!

సరే కాసేపు ఈ ర్యాంక్ ను మనం రాజకీయంగా చూద్దాం. ఇది నిజంగా వైఎస్ఆర్సీపీ గొప్పతనం అనుకుంటే తరువాత రెండు మూడు సంవత్సరాల పాటు కంటిన్యూగా ఫస్ట్ ర్యాంక్ రావాలి. కానీ ప్రస్తుతానికి మాత్రం ఈ గొప్పతనాన్ని చంద్రబాబు నాయుడు, టిడిపికే వదిలేయాలి. 2015 లో రెండవ ర్యాంక్ లో ఉండి 2016, 17, 18 లో వరుసగా మొదటి ర్యాంక్ లోనే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది. 2019 లో కూడా నాటి విధానాలే అమలు చేయడం వలన ఇప్పుడు కూడా మొదటి ర్యాంకులో నిలిచింది. కాబట్టి రాజకీయంగా దీన్ని తీసుకోవాలంటే వైసీపీ పాత్ర ఏమి లేదు. వందలో 95 శాతం వాటా తెలుగుదేశం పార్టీ ప్రభావమే ఉంటుంది. చంద్రబాబు చలవే ఉంటుంది. అందుకే రాజకీయాలను పక్కనపెట్టి దీని ఫలితం ఏమి వచ్చింది అని ఆరా తీస్తే మాత్రం తెలుగుదేశం పార్టీ చేసిందేమీ లేదు వైసీపీ కూడా చేస్తున్నది ఏమీ లేదు. ఈ ర్యాంక్ లు వచ్చాయని పత్రికల్లో ప్రకటనలు ఇచ్చుకోవడం, మీడియా సమావేశాలు పెట్టి బాకా ఊదుకోవడం, సొంత డబ్బా కొట్టుకోవడం తప్పితే “మాకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాము, రండి బిజినెస్ లు పెట్టండి” అని ఏ ఒక్కరిని ఆహ్వానించడం లేదు. ఇదంతా ఎందుకు గుజరాత్ లాంటి రాష్ట్రం ప్రతి సంవత్సరం పదవ స్థానంలో ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంటుంది. కానీ పరిశ్రమల ఏర్పాటు లో చూస్తే గుజరాత్ మొదటి ప్లేస్ లో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ చివరి స్థానంలో ఉంటుంది. తెలంగాణలో కూడా అదే పరిస్థితి. ఇలా ఏ రాష్ట్రం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంక్ లు పట్టించుకొక ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిల్చుంటుంది అనే వాస్తవాన్ని ఈ ముఖ్య మంత్రులు, రాజకీయ నాయకులు పట్టించుకునే వరకు ఈ ర్యాంక్ ల గోల ఇలాగే ఉంటుంది.

Related posts

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju