NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

జగన్ కి తలనొప్పే..! మంత్రి చుట్టూ బిగుస్తున్న వివాదం..!!

 

మంత్రి జయరాం కుమారుడు ఈఏస్ఐ కేసులో ఏ 14గా ఉన్న కార్తీక్ నుండి బెంజ్ కారు బహుమతి తీసుకున్నాడు అనే వివాదం మంత్రి చుట్టూ బిగుస్తోంది. జగన్ కు తలనొప్పి వ్యవహరంగా కూడా మారింది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజు నుండి అవినీతిని సహించబోననీ, అవినీతికి వ్యతిరేకంగా పోరాడాలనీ పిలుపునిచ్చిన జగన్మోహనరెడ్డికి తన కేబినెట్ లోని మంత్రిపై తీవ్రమైన ఆరోపణలు రావడం, దానికి సాక్షాలు కూడా బయటకు వస్తుండటంతో చిక్కులు తప్పడం లేదు. ఈ వివాదంపై మంత్రి జయరాం ఇచ్చిన వివరణ కూడా సంతృప్తికరంగా లేకపోవడంతో వైసీపీలో కూడా కొత్త అనుమానాలకు తావు ఇస్తోంది.

ఆరోపణలు బలపెడుతున్న టీడీపీ

అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి జయరాంను మంత్రివర్గం నుండి భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ టీఎన్ టీయూసి ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్ వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈఎస్ఐ స్కామ్ లో మంత్రి గుమ్మనూరు జయరాం కుమారుడిని రక్షించేందుకు అచ్చెన్నాయుడిని ఆధారాలు లేకపోయినా అరెస్టు చేశారనీ టీ ఎన్ టీ యు సీ రాష్ట్ర అధ్యక్షుడు రఘురామరాజు ఆరోపించారు. తక్షణమే ప్రభుత్వం మంత్రి జయరాం కుమారుడిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని లేకుంటే అన్ని కార్మిక సంఘాలను కలుపుకుని రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేపడతామని ఆయన హెచ్చరించారు.

మరో పక్క కర్నూలు జిల్లా ఆలూరు మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ..మంత్రి జయరాంకు సవాల్ విసిరారు. కార్మిక మంత్రి జయరాం అక్రమాలను ఆధారాలతో నిరూపిస్తాం.. రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధమా అని సవాల్ విసిరారు. ఈ మేరకు ప్రత్రికా ప్రకటన విడుదల చేస్తూ మంత్రి జయరాంకు సంబంధించి అక్రమాలు ఒక్కటొక్కటిగా బయటపడుతున్నా సీఎం జగన్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. మొన్న పేకాట, నిన్న భూముల కొనుగోలు, తాజాగా బెంజ్ కారు ఇలా రోజుకు ఒక అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయన్నారు. సీఎం జగన్ కు చిత్తశుద్ధి ఉంటే జయరాంను మంత్రివర్గం నుండి భర్తరఫ్ చేసి ఏసిబి లేదా సిబి సిఐడీ ద్వారా కేసు నమోదు చేసి దర్యాప్తును జరిపించాలని డిమాండ్ చేశారు సుజాతమ్మ. ఈఎస్ఐ స్కామ్ లో ఏ 14గా ఉన్న తెలుకపల్లి కార్తీక్ పేరుపై ఉన్న బెంజ్ కారును మంత్రి కుమారుడు ఎమ్మెల్యే స్టిక్కర్ వేసుకొని తిరిగింది నిజమా కాదా సమాధానం చెప్పాలని మంత్రి జయరాంను కోరారు. అక్రమ వ్యవహారాలపై తాము హైకోర్టులో పిల్ కూడా వేయనున్నట్లు మాజీ ఎమ్మెల్యే సుజాతమ్మ పేర్కొన్నారు.

 

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju