NewsOrbit
టెక్నాలజీ న్యూస్

ఈ కోర్స్ నేర్చుకుంటే ఇక తిరుగుండదు..

 

 

ఇటీవల దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాల కారణంగా  ఫోర్సినిక్ సైన్స్ నిపుణులకు డిమాండ్ ఎక్కువగా ఉంది. హింసాత్మక చర్యలవలన అఘాయిత్యాలూ,అత్యాచారాలూ,దురాగతాలూ జరుగుతున్నాయి. అదే సమయంలో సైనిక శక్తిని కావాలనే గల్లంతు చేయడం, మానవ హననం, బతికుండానే పూడ్చిపెట్టడం, విచక్షణారహితంగా కావాలనే శరీరంపై కొన్ని భాగాల్ని గాయపరచడం, సజీవ దహనం చేయడం అనేకం జరుగుతూ ఉంటాయి. ఒక మనిషిని శిక్షించాలన్నా, రక్షించాలన్నా అతనిపై ఆరోపించబడిన నేరాన్ని న్యాయ , వైద్య సాంకేతికపరమైన పరిధుల్లో నిర్ణయింపగలిగే శాస్త్ర విజ్ఞానం కావాలి’అని ఫ్రెంచ్ మెడికో లీగలిస్ట్ డా పి.సి.హెచ్.బి. బ్రోనార్‌డెల్  అన్నాడు.

 

 

ఆ రీతిగా నేర పరిశోధన శాస్త్రం అన్ని ముఖ్యదేశాలలోనూ తన ప్రాధాన్యత సంతరించుకుంది. 20వ శతాబ్దంలో దీని ఆవశ్యకత ఎక్కువగా ఉంది. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ కోర్సుల్లో చేరి భవిష్యత్తుకు బాటలు వేసుకోవచ్చు.ప్రపంచ వ్యాప్తంగా ఈ ఫోరన్సిక్ సైన్సు పోలీసు శాఖలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఒక్కోసారి అది హత్యా, ఆత్మహత్యా, ప్రమాదమా – దానికిగల పూర్వాపరాలను అంచనా వేస్తుంది. కొన్నిసార్లు రుజువుల్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. వేషభాషలూ, పుట్టుపూర్వోత్తరాలు అధ్యయనం చేస్తుంది. అంతేగాకుండా మానవుని పురోగతి, శరీర ఒడ్డూ, పొడుగులూ వారి పూర్వీకుల చరిత్రల గురించిచెబుతుంది.ప్రపంచంలో  ఒకర్నొకరు పోలి ఉంటారు. ఆ సూక్ష్మ వైరుధ్యాలను. నేర పరిశోధనలో వేలిముద్రలూ, నేరం జరిగిన ప్రదేశంలో లభ్యమైన ఆధారాలూ సేకరించి, నేర నిర్థారణకు న్యాయవాదులకు సరైన మార్గం చూపుతుంది.

 

 

అవకాశాలు ఇక్కడ : ప్రభుత్వ, ప్రైవేటు ఏజెన్సీలు, ఆసుపత్రులు, లాబరేటరీల్లో  ఉద్యోగాలు లభిస్తాయి. ఎంచుకున్న స్పెషలైజేషన్ పై అవకాశాలు ఆధారపడి ఉంటాయి. కొన్ని కార్పొరేట్ సంస్థలు ఫోర్స్ నిపుణులను డాక్యుమెంట్ రైటర్లు గా నియమించుకుంటున్నాయి. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఇంటెలిజెన్స్ బ్యూరో, పోలీస్ శాఖలో ఉద్యోగాలు ఉంటాయి. యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్, డిజాస్టర్ మేనేజ్మెంట్, సైబర్ క్రైమ్, ఇన్వెస్టిగేషన్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అండ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ తదితర విభాగాల్లో కొలువులు పొందవచ్చు.

ఫోరెన్సిక్ సైన్స్ ఆసక్తి ఉన్న విద్యార్థులు ఇంటర్లో మ్యాథ్స్,సైన్స్ విద్యార్థులు బిఏస్సీలో దీన్ని ఒక సబ్జెక్టుగా చదువుకోవచ్చు. అయితే తక్కువ సంఖ్యలో ఈ కోర్సును అందిస్తున్నాయి.  కోర్సులు చదివిన వారు పీజీ ఫోరెన్సిక్ సైన్స్ కోర్సులో చేరవచ్చు. జాతీయ స్థాయిలో కొన్ని ప్రత్యేకమైన సంస్థలు ఉన్నాయి. పీజీ అనంతరం పి హెచ్ డి లో చేరవచ్చు స్పెషలైజేషన్లు సైతం ఉన్నాయి. ఎమ్మెస్సీ డిజిటల్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, ఎమ్మెస్సీ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ అండ్ యాంటీ టెర్రరిజం, ఎంబీఏ ఫైనాన్స్ , ఎంబీఏ సైబర్, ఎంటెక్ సైబర్ సెక్యూరిటీ అండ్ ఇన్సిడెంట్ రెస్పాన్స్, పిజి డిప్లమా  ఫోరెన్సిక్ టాక్సీకాలాజీ, ఫోరెన్సిక్ డాక్యుమెంట్ ఎగ్జామినేషన్, ఫోరెన్సిక్ ఫింగర్ ప్రింట్ సైన్స్, ఫోరెన్సిక్ క్రిమినలాజీ,  ఫోరెన్సిక్ మేనేజ్మెంట్, ఫోరెన్సిక్ అకౌంటింగ్, ఫోరెన్సిక్ నర్సింగ్ తదితర కోర్సులు ఉన్నాయి. అభ్యర్థులు వారి ఆసక్తి మేరకు తమకు అనువైన కోర్సులో చేరవచ్చు.

Related posts

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju