NewsOrbit
5th ఎస్టేట్ Featured న్యూస్

వచ్చేస్తుంది కాషాయ ఛానెల్..! టీవీ-9 రవి ప్రకాష్ కి నీడ దొరికిందోచ్..!!

పూలు అమ్మిన చోట కట్టెలు అమ్మడం బాధాకరమే కదా..!
భవంతులు అనుభవించిన చోట… నీడ కోసం పాకులాడడం అంటే బాధే కదా..!
ఇంకొంచెం పచ్చిగా చెప్పుకోవాలంటే..
దర్జాగా దందాలు సాగించిన చోట దండం పెట్టి దండుకోవడం అంటే కష్టమే కదా..!? ఇప్పుడు టీవీ-9 రవి ప్రకాష్ పరిస్థితి అలాగే మారింది. ఒక పెద్ద ఛానెల్ లో సీఈవోగా పని చేసిన ఆయన ఓ కొత్త ఛానెల్ లో ఎడిటర్ ఇన్ చీఫ్ గా అడుగు పెట్టనున్నారు. నాటి వెలుగు కోల్పోయినందుకు బాధపడాలో.., ఏదో దొరికిందిలే అంటూ సంతోష పడాలో తెలియని స్థితిలో దూరుతున్నారు. తెలుగు నాట ఓ కొత్త (పాతదే కానీ కొత్త హంగులుతో) ఛానెల్ అవతరించబోతుంది. ఈ ఛానెల్ కి రెండు పెద్ద విశేషాలు ఉన్నాయి. అవేమిటో చెప్పుకుందాం..!!

మొదటి సత్కార్యం..! రవిప్రకాష్ కి నీడ..!!

తెలుగు మీడియాలో రవి ప్రకాష్ ఒక సంచలనం. న్యూస్ కోసం ఒక ప్రత్యేక ఛానెల్ ఉంటుందని.., రాజకీయాల్లో, కులాల్లో వేలు పెట్టి కెలికేస్తుందని.., పైకి మెరుగైన సమాజం అని చెప్పుకుంటూ చీకట్లో చెత్త కార్యక్రమాలు చేస్తుందని.., యజమానిని తొక్కేసి ఓ ఉద్యోగి హవా చాటుతారని.., కేవలం 8 % వాటాతో ఓ సీఈఓ దందాయనం కొనసాగిస్తారని టీవీ-9(రవి ప్రకాష్) వచ్చే వరకు బయట జనాలకు తెలియదు. మొత్తానికి శ్రీనిరాజు ఆ టీవీని అమ్ముకున్నాక.., కొత్త యాజమాన్యం దగ్గర కూడా తన హవా చాటాలి అనుకున్న రవి ప్రకాష్ బొక్కబోర్లా పడి, బలవంతంగా నెత్తివేయబడ్డారు. కొన్ని పోరాటాలు చేసి.., ఆరోపణలు చేసి.., కేసులు వేసి.., చివరికి ఓ మీడియా నీడ కోసం పాకులాడి, పాకులాడి ఓడిపోయారు. ఏ ఛానెల్ లోనూ మళ్ళీ ఎంటర్ కాలేకపోయారు. కొందరు ఆయన్ను రానీయలేదు, కొందరి దగ్గర బేరాలు బెడిసికొట్టాయి. ఆ రవి ప్రకాష్ ఇన్నాళ్లకు ఓ మీడియాలో చేరబోతున్నారు. అదే రాజ్ న్యూస్. ఓ ఫక్తు తమిళ న్యూస్ ఛానెల్. రాజ్ న్యూస్ నెట్వర్క్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ యాజమాన్యం మొత్తం తమిళులే. తెలుగులో ఎన్నాళ్లు నుండో ఉన్నప్పటికీ ఇప్పుడు ఓ పెద్ద రాజకీయ పెట్టుబడి అండతో పునరుజ్జీవం పోసుకోనుంది. ఈ ఛానెల్ లోకి రవి ప్రకాష్ దూరుతున్నారు. ఏడాదికి పైగా ఛానెల్ నీడ కోసం ప్రయత్నిస్తున్న ఆయన చీఫ్ ఎడిటర్ హోదాలో రాజ్ న్యూస్ లో చేరనున్నారు. మరో విశేషం ఏమిటంటే..!!

కాషాయానికి కష్టాలు తీరినట్టే..!!

టీవీ-9 తెలంగాణలో పూర్తిగా పింక్ పూసుకుంది. ఏపీలో ఎవరిస్తే వారికి జై కొడుతోంది. టీవీ-5, ఈటీవీ, ఏబీఎన్ లు పచ్చగా మెరిసిపోతున్నాయి. సాక్షి బ్లూ కలర్ లో వెలిగిపోతోంది. ఎన్టీవి, హెచ్ఎంటీవీలు అవసరానికి తగ్గట్టు గొడుగు పడుతున్నాయి. నీడలో బతుకుతున్నాయి. మరి కాషాయ రంగు ఉన్న ఛానెల్ ఏది..? అంటే సమాధానమే లేదు. తెలంగాణలో వీ 6 ఉన్నప్పటికీ అది అంతగా సరిపోవట్లేదు. పూర్తిగా కాషాయ రంగు పూసుకోవట్లేదు. ఏపీలో వెలుగు చాటట్లేదు.

అందుకే కాషాయానికి అర్జంటుగా ఒక ఛానెల్ కావాలి. కాషాయ కళ్ళద్దాలు పెట్టుకుని వార్తలు చెప్పాలి, డిబేట్లు చేయాలి. సందు దొరికిన ప్రతీ చోట కాషాయాన్ని పూసేయ్యాలి. వారికి నార్త్ లో చాలా మీడియా సంస్థలు తోడున్నాయి. కానీ దక్షిణాన సరైన చానెళ్లు లేవు. మనం పైన చెప్పుకున్న రాజ్ న్యూస్ తమిళనాడు, కర్ణాటకలో కాషాయాన్ని నింపుకుంది. సదరు రాజ్ న్యూస్.., రవి ప్రకాష్ సారథ్యంలో కొత్తగా తెలుగు మీడియాలోకి అడుగు పెట్టేయనుంది. మరి కాసుకోవల్సింది కాషాయాభిమానులు.., తట్టుకోవాల్సింది వార్తాభిమానులు. రెడీ గా ఉండండి..!!

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju