NewsOrbit
Featured న్యూస్ రాజ‌కీయాలు

అధికార మదమెక్కి..! కళ్ళు నెత్తికెక్కి..!! ఇంట్లో బాలుడు ఉండగా కూల్చివేత..!!

శిరోముండనాలు.. దళితులపై దాడులు.., మాస్కు లేదని పోలీసుల చితక్కొట్టుడు.., ఇవన్నీ ఈ ప్రభుత్వానికి తలవంపులే..! సీఎం జగన్ పాలనలో చెరిగిపోని మచ్చలే..! తాజాగా ప్రభుత్వం సిగ్గుపడాల్సిన మరో సంఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. అధికారులకు కళ్ళు నెత్తికెక్కి.., అధికార మదమెక్కి.., సాటి మనుషులే బాధితులు అనే ఇంగితాన్ని మర్చిపోయి.. ఓ పిల్లాడిని తీవ్రంగా గాయపర్చారు. ఓ తల్లి చేయి విరిచారు. ఓ కుటుంబాన్ని రోడ్డున పడేసారు. కొన్ని ఇళ్లను నేలమట్టం చేశారు. గ్రామస్థుల ఆగ్రహాలకు కారకులయ్యారు..!!

ఓ వైపు చర్చలు.. మరోవైపు కూల్చివేతలు..!!

అనంతపురం జిల్లా తాడిమర్రి మండలం మర్రిమాకులపల్లి చిత్రావతి జలాశయం ముంపు గ్రామాల్లో ఒకటి. ఈ గ్రామస్థులు తమకు ప్రభుత్వం ఇస్తున్న పరిహారం సరిపోదని.., పెంచాలంటూ కొద్ది కాలంగా నిరసనలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం కొందరు అధికారులు ఈ గ్రామానికి చర్చలకు వచ్చారు. వస్తూనే జేసీబీలు తీసుకువచ్చారు. పరిహారం కోసం గ్రామపెద్దలతో ధర్మవరం ఆర్దీవో మధుసూధన్ చర్చలు జరుపుతున్నారు. ఇరు వర్గాల్లో ఓ రాజీ సూత్రం రావడం లేదు. ఎవరి మాట వారిదే అయి ఉంది… ఈ క్రమంలోనే కొందరు క్షేత్రస్థాయి అధికారులు అత్యత్సాహంతో గ్రామస్థులను భయపెట్టడానికి జేసీబీలతో ఇళ్ల కూల్చివేత మొదలు పెట్టారు. ఓ ఇంట్లో నాగచైతన్య అనే అయిదేళ్ల బాలుడు, తల్లితో సహా ఉండగా… ఈ ఇంటిని కూల్చేశారు. ఈ గోడ శిథిలాలు ఆ ఇద్దరిపై పడ్డాయి. బాలుడి తలకు తీవ్రంగా గాయాలవ్వగా.., ఆ తల్లి పర్వతమ్మకి చేయి విరిగింది.

కట్టలు తెంచుకున్న ఆగ్రహం..!!

ఈ ఘటనతో గ్రామస్థుల ఆగ్రహం ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది. జేసీబీపైనా, ఆ అధికారులపైనా రాళ్లు రువ్వారు. ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు కూడా అదుపు చేయలేకపోయారు. ఈ ఘటనతో ఉలిక్కిపడ్డ ఆర్దీవో మధుసూదన్ ఒక్కసారిగా గ్రామస్థులకు క్షమాపణలు చెప్పి, బాలున్ని ఆసుపత్రికి పంపించారు. ఆ మహిళకి చేతికి చికిత్స చేయించారు. బాలుడికి మాత్రం తలకు పెద్ద గాయం కావడంతో మెరుగైన చికిత్స కోసం సిఫార్సు చేసారు. గాయాలతో కోలుకుంటే కోలుకోవచ్చు.. కానీ ఆ కుటుంబాల రోదనలకు.., ఆ కూలిన ఇళ్లకు బాధ్యత ఎవరిది..!? ఈ ఘటన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. కళ్లెదుటే సాక్ష్యాలున్నాయి. బాధితులున్నారు. బాధ్యులున్నారు. ఇక్కడ అధికారుల నిర్లక్ష్యం మాత్రం కచ్చితంగా అధికార మదమే. కళ్ళు నెత్తికెక్కడమే. బాధ్యతా రాహిత్యమే. ప్రభుత్వం ఈ సంఘటనను సీరియస్ గా తీసుకుంటుందా..? అధికారులను, బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకుంటుందా..? లేదా తేలిగ్గా తీసుకుని సమర్ధించుకుంటుందా..? రాజకీయం చేసి, రంగులు వేస్తుందా..? అనేది చూడాలి..!!

 

Related posts

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N