NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ

నేను ఎస్పీను అర్జెంటుగా డబ్బులు పంపు : ఫేస్బుక్ దందా షురూ

 

 

‘ నేను ప్రకాశం ఎస్పీ సిద్దార్ధ్ కౌశల్ ని. నాకు అర్జెంటుగా 15 వేలు కావాలి … రేపు మళ్లీ రిటర్న్ చేస్తా’ అంటూ ఫేస్ బుక్ మెసెంజర్ లో ఒక వ్యక్తికి సందేశం వచ్చింది. ఒక జిల్లా ఎస్పీ తన ఫేస్ బుక్ స్నేహితుణ్ని.. అందులో ముక్కుమొహం తెలియని వ్యక్తిని డబ్బులు అడగటం ఏంటి? అందులోను చీపుగా 15 వేల కోసం ఎందుకు ఇలా దిగజారిపోతారు? అనుకున్న అవతలి వ్యక్తి ఆ సందేశం పంపిన ప్రొఫైల్ చెక్ చేసారు. సేమ్ ఎస్పీ సిద్డర్ధ కౌశల్ చిత్రాలతో ఉన్న అకౌంట్ అది. ఏదేదో తేడాగా ఉందని భావించిన సదరు వ్యక్తి విషయాన్నీ ప్రకాశం జిల్లా పోలీసుల వద్దకు తీసుకువెళ్లారు. అది ఎస్పీ పేరుతో ఉన్న నకిలీ ఐడి అని తేలింది.

పతాక స్థాయికి బరితెగింపు

ఇదేమి కొత్త వ్యవహారం కాదు. కాకపోతే ఈ తరహా మోసం ఉన్నతాధికారుల అకౌంట్లను నకిలీవి తయారు చేసేవరకు వెళ్ళింది అంతే. ఒక పెద్ద ముఠా దీని వెనుక పని చేస్తున్నట్లు అర్ధం అవుతున్న కనీసం పోలీసులు దీని మీద ద్రుష్టి పెట్టడం లేదు. ఇప్పటికే వెలది మంది నాకిలా ఖాతాల బారిన పది వేళా రూపాయలు పోగుట్టుకున్నారు. చాలామందికి దీని మీద గొడవలు అయినా సందర్భాలు ఉన్నాయి. వందలాది ఫిర్యాదులు వస్తున్నా పోలీసులు దీని మీద చర్యలు తీసుకోవడం లేదు. ఇటీవల తిరుపతి, తూర్పు గోదావరి, గుంటూరు తో పాటు ఇతర ప్రాంతాల పోలి
సులు, జర్నలిస్ట్ లు, లాయర్, డాక్టర్ ల పేరుతో ఈ నాకిలా ఖాతాల హల్చల్ ఎక్కువగా ఉంది. ప్రముఖ వ్యక్తులు, వారి ప్రొఫైల్ చిత్రాలను నకిలీలు కాపీచేసి ఖాతాలు సృష్టిస్తున్నారు. డబ్బు డిమాండ్ చేస్తున్నారు. వెంటనే ఇచ్చేస్తామని చెప్పడంతో ఫేస్ బుక్ పరిచయస్తుల్లో కొందరు వారు నకిలివ్యక్తుల అకౌంట్ లలో డబ్బు వేసి. తర్వాత నిజాలు తెలిసి లబోదిబో అంటున్నారు. తెలిసిన వారి మధ్య గొడవలు వస్తున్నాయి.

పోలీసులు లైట్ తీసుకోవడం వెనుక… నకిలీ బాబుల ఆలోచన

నకిలీలు ఈ విషయం పెద్దది కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. విరివిగా బ్యాంకు అకౌంట్లకు సంబందించిన ఫోన్ నంబర్లు పదేపదే వేరేవి అనుసంధానం చేస్తూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు . అంటే వీరి నంబర్లు వెనువెంటనే డిస్ కనెక్ట్ అవుతున్నాయి. మనీ పంపిన తర్వాత ఆ నెంబర్ స్విచ్ ఆఫ్ అవుతుంది.
* నకిలీలు పెద్ద అమౌంట్ లను డిమాండ్ చేయడం లేదు . 2 వేలు మొదలుకొని సదరు అకౌంట్ దారుడి స్థాయి బట్టి 20 వేళా వరకు అడుగుతున్నారు. దింతో మోసపోయామని తెలుసుకున్నా దాన్ని పెద్దది చేసి. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు ఎక్కువమంది సాహసించడం లేదు. ఏది నేరగాళ్లకు వరం అవుతుంది.
* వేర్వేరు డివైస్ లనుంచి కేవలం మెసెంజర్ ద్వారా మాత్రమే నేరగాళ్లు చాట్ చేస్తున్నారు. దింతో వారి లొకేషన్, వారు ఎవరు అనేది కనుక్కోవడం కష్టం అవుతుంది. మెసెంజర్ ద్వారా ఎవరు అనేది కనుక్కోవడం కష్టం అయ్యే అవకాశం ఉండటాన్ని వారు గుర్తించే ఇలా భారీగా నకిలీ కథలు సృష్టించారు అనేది అర్ధం అవుతుంది.
* నకిలీ ముఠాలో ఇంగ్లీష్ ఎక్కువగా మాట్లాడుతున్నారు. దాన్ని కూడా ఫ్రీక్వెన్ట్ గ మాట్లాడలేకపోతున్నారు. అంటే ఇది ఉత్తరాది ముఠాలు చేస్తున్న సైబర్ నేరంగానే పోలీసులు ప్రాధమికంగా భావిస్తున్నారు. గతంలో ఎవరైనా ఇలా చేసారా అనేది కూపీ లాగితే ఫలితం వస్తుంది.
* పోలీస్ శాఖా తరఫున దీనిపై చైతన్యం తేవాలి. ఇప్పటికే వెలది బాధితులు చిన్న చిన్న అమౌంట్లు పోగుట్టుకున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని కనీసం అవగాహనా కార్యక్రమాలు పెడితే మంచిది. ఒక ఎస్పీ స్థాయి అధికారికి ఎలాంటి మోసం జరగటం గతంలో ఎప్పుడు లేదు. కాబట్టి ఈ విషయాన్నీ పోలీసులు సీరియస్ గ తీసుకుంటే దీని వెనుక ఉన్న ముఠా గుట్టు బయటకు రావొచ్చు.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju