NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బ్యూటీ విత్ బ్రెయిన్ ..! నటాషా పూనమ్ వాలా ప్రత్యేకతలివే ..!

 

భవిష్యత్ తరాలను కాపాడుకునే పనిని “మనం కాకపోతే ఇంకెవరు చేస్తారు” అంటూ సేవ, మోడలింగ్, వ్యాపార రంగాలలో తనదైన ముద్ర వేసుకుంటున్న నటాషా..! అసలు ఎవరు ఈమె..?అనుకుంటున్నారా..? ఆమె సేవ విశేషాలతో పాటు.. తన కుటుంబ వివరాలు ఇలా..!

 

 

natasha poonamwala

మనదేశంలోని ధనవంతుల కుటుంబ జాబితాలో ముందు వరసలో ఉండేది సైరస్ పూనమ్ వాలాది. “వ్యాక్సిన్ కింగ్ ఆఫ్ ఇండియా” గా ఆయన్ని వ్యాపారవేత్తలు పిలుచుకుంటారు. “సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా” పిల్లలకు అవసరమైన వ్యాధి నిరోధక టీకాలు తయారీలో ప్రపంచంలోనే అగ్రగామి సంస్థ. ఈ సంస్థను నిర్వహించేది ఈ కుటంబమే.ఈ ఇంటి కోడలే నటాషా పూనమ్ వాలా. ఈ సంస్థకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా పనిచేస్తుంది. మొన్నటి వరకు వ్యాపార కుటుంబం గా మాత్రమే ముద్రపడిన కుటుంబం రంగం లోకి వెళ్ళడానికి కారణం మాత్రం గొప్పతనమే తన అత్తగారి పేరు మీద జ్ఞాపకార్థం ప్రారంభించిన ” విల్లుపూనామ్ వాలా పౌండేషన్” కి ఛైర్మెన్ గా బాధ్యతలు నిర్వహిస్తుంది.

natasha punamwala

బ్యూటీ విత్ బ్రెయిన్ :
నటాషాది భిన్నమైన వ్యక్తిత్వం. ఫ్యాషన్ ప్రపంచంలో తనదైన ముద్ర వేస్తూనే మరోపక్క విద్యా, వైద్య రంగాల్లో, పిల్లలపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా పోరాడుతోంది. “బ్యూటీ విత్ బ్రెయిన్” అనే మాటకు సరిగ్గా సరిపోతుంది. ఈమె పుట్టిపెరిగింది పూణేలో. ఒక న్యూ ఇయర్ పార్టీ లో సైరస్ వారసుడు అధాయ్ పూనమ్ వాలాను కలుసుకుంది. ఇద్దరి సేవ భావాలు ఒకటే కావడంతో వివాహంతో ఒకటయ్యారు. వీరికి ఇద్దరు పిల్లలు. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఏమాత్రం వెనకాడని తత్వం ఈమెది.పెళ్లయిన తర్వాత సీరమ్ ఇన్స్టిట్యూట్ లో చిన్నచిన్న విభాగాల్లో పని చేస్తూ వ్యాపార సూత్రాలను వంట పట్టించుకుంది. అత్యంత తక్కువ కాలంలోనే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హోదా అందిపుచ్చుకుంది. మరోపక్క అత్తగారి జ్ఞాపకార్థం కోసం ప్రారంభించిన విల్లు ఫౌండేషన్ కి చైర్పర్సన్ గా బాధ్యతలు తీసుకుంది. ఇందులో భాగంగానే ఏ ఆసరా లేని పేదల కోసం ఉచితంగా వైద్య విద్యా సౌకర్యాలు అందించడం మొదలుపెట్టింది. 24 గంటలు అందుబాటులో ఉండే ఆధునిక వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చింది. కార్పొరేట్ స్కూళ్ళకు దీటుగా స్కూలును నిర్మించి 50 వేల మంది పిల్లలకు ఉచితంగా విద్యను అందిస్తుంది. పరిశుభ్రమైన నీటిని అందించడం కోసం సౌరశక్తితో నీటి ఏటీఎంలకు శ్రీకారం చుట్టింది. వీటితో పాటు కాలుష్యం లేని నగరాలు తీర్చిదిద్దడానికి పర్యావరణంపై దృష్టిపెట్టి వెయ్యి ఎకరాల స్థలంలో పార్కుల నిర్మాణం చేపట్టింది. 100 కోట్లతో వేస్టేజ్ మేనేజ్మెంట్ పద్ధతులు తీసుకువచ్చి కాలుష్యానికి చెక్ పెడుతుంది.ఈమె సేవలో తనకి మెలిండా గేట్స్ ఆదర్శం అంటుంది.

 

natasha punamwala family

పిల్లలపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా బ్రిటన్ యువరాజు ప్రిన్స్ చార్లెస్ తో కలిసి మరో అడుగు ముందుకు వేసింది. చార్లెస్ ఆధ్వర్యంలో నడుస్తున్న “బ్రిటిష్ ఏషియన్ ట్రస్ట్” కి చిల్డ్రన్ ప్రొటక్షన్ ఫండ్ ఇండియాకు చైర్పర్సన్ గా నిర్వహణ బాధ్యతలను తీసుకుంది. ఎనిమిదేళ్ళ క్రితం చార్లెస్ భారతదేశంలో పర్యటించినప్పుడు మా వ్యాక్సిన్ తయారీ యూనిట్ ని చూడడానికి వచ్చారు. బ్రిటిష్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలకు మా సంస్థ నుంచే వ్యాక్సిన్లు వెళ్ళేవి. మేము చేస్తున్న పని నచ్చడంతో ఆయన సేవా సంస్థలు భారత్లో నిర్వహించే పనిని నాకు అప్పగించారని చెప్పిందామె. బాలలపై జరిగే హింసని అరికట్టడం, లైంగిక విద్య పై అవగాహన, మానసిక ఆరోగ్యం పై దృష్టి సారించడం వంటివి ఈ సంస్థ లక్ష్యాలు. ఇప్పటికే రాజస్థాన్ లో వివిధ రంగాల్లో బాలకార్మికులుగా వెల్లదీస్తున్న చిన్నారులకు విముక్తి కలిగించింది. నెదర్లాండ్స్ పిల్లల కోసం సైన్స్ పార్క్ ని నడుపుతుంది. ఒక మంచి పని మరో మంచి పని చేయడానికి కావాల్సిన ఆలోచన శక్తిని అందిస్తుంది. అది వ్యతిరేక ఆలోచన మనలోని శక్తిని హరిస్తుంది. అందుకే ఈ నిమిషం ఈ సంస్థలో హెచ్ఆర్ బాధ్యతలు చూస్తాను. మరో క్షణంలో పుణేలో ఉచితంగా కట్టిన స్కూల్లో చదువుతున్న పిల్లలతో కలిసి ఆడుకుంటాను. ప్రిన్స్ చార్లెస్ తో భోజనం చేస్తూ ఆర్గానిక్ ఆహారంపై చర్చిస్తాను.ఇవన్నీ నాలో శక్తిని నింపుతాయి. ఇందుకోసం రోజులో వేయ్యి సార్లు విమానం ఎక్కి దిగడానికైనా నేను సిద్ధమే అంటుంది నటాషా.

Related posts

AP Elections 2024: వైసీపీ అభ్యర్ధి వంగా గీత కార్యాలయాన్ని ముట్టడించిన ఓటర్లు .. ఎందుకో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..!

sharma somaraju

Bomb Threat: ఢిల్లీ ఎయిర్ పోర్టు, ఆసుపత్రులకు బాంబు బెదిరింపులు

sharma somaraju

ఆ మూడు రిజ‌న్లు… చింత‌మ‌నేని గెలుపును నిర్ణ‌యిస్తున్నాయా..?

IPL 2024: ఆర్సీబీ ప్లేయర్ల భార్య‌ల‌ను ఎప్పుడైనా చూశారా.. వారు ఏయే రంగాల్లో ఉన్నారో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

POK: పాక్ ఆక్రమిత కశ్మీర్ లో విధ్వంసం .. భద్రతా దళాలను తరిమితరిమి కొట్టిన ఆందోళనకారులు .. వీడియోస్ వైరల్

sharma somaraju

Ravi Teja: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బిగ్ హిట్ కొట్టిన ర‌వితేజ‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదంటే?

kavya N

Kona Venkat: సినీ రచయిత కోన వెంకట్ పై బాపట్లలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు.. ఎందుకంటే ..?

sharma somaraju

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

CM Revanth Reddy: విద్యార్ధులతో ఫుట్ బాల్ ఆడిన సీఎం రేవంత్ .. వీడియో వైరల్

sharma somaraju

Aparichithudu: మ‌ళ్లీ వ‌స్తున్న అప‌రిచితుడు.. ఎన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

జగన్ టీమ్‌లో ఈ పెద్ద లీడర్లు గెలవడం కష్టమేనా ?

విజయమ్మతో చివరి బాణం వదిలిన షర్మిల.. ?

మెగా ఫ్యామిలీని రెండు ముక్క‌లు చెక్క‌లు చేసిందెవ‌రు..?

అల్లు అర్జున్‌ ప్రచారం.. బాబుకి ఫ్రస్టేషన్ ..?

పిఠాపురానికి జ‌గ‌న్ సంచ‌ల‌న హామీ.. ప‌వ‌న్ కు చెక్ పెట్టిన‌ట్టేనా?