NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

కొత్త శకానికి నాంది..! మేడ్ ఇన్ ఇండియా ఎలక్ట్రిక్ కార్..!

 

పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత..! రోజురోజుకీ వాయు కాలుష్యం పెరుగుతుంది.. ఎలక్ట్రిక్ వాహనాలు కొనేందుకు కేంద్ర ప్రభుత్వం వాటి రాయితీ అందిస్తుంది..తిరుపతిలో కూడా ఎలక్ట్రిక్ బస్ లు తిరగనున్నాయి.. రెండు తెలుగు రాష్ట్రాలలో చార్జింగ్ స్టేషన్ ఏర్పాటుచేస్తున్నాయి.. ఇప్పుడు భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు గిరాకీ గణనీయంగా పెరుగుతోంది.. బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్టప్ కంపెనీ ప్రవైగ్ డైనమిక్స్ ఓ సరికొత్త ఎలక్ట్రిక్ కారును తయారు చేసింది. ‘ప్రవైగ్ ఎక్స్‌టింక్షన్ ఎమ్‌కె1’ ఎలక్ట్రిక్ కారును పూర్తిగా భారతదేశంలోనే తయారు చేశారు.. ! పూర్తి వివరాలు ఇలా..

ప్రవైగ్ ఎక్స్‌టింక్షన్ ఎమ్‌కె1 ఎలక్ట్రిక్ కారును పూర్తిగా ఫ్యూచరిస్టిక్ డిజైన్‌తో అంతర్జాతీయ మార్కెట్లలో లభించే ఆల్ట్రా లగ్జరీ కార్ల మాదిరిగా డిజైన్ చేశారు. భారత మార్కెట్లో ఈ ఎలక్ట్రిక్ కారు చాలా పరిమిత సంఖ్యలో మాత్రమే లభ్యం కానుంది. ప్రవైగ్ డైనమిక్స్ ఏటా 250 యూనిట్లను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. మరికొద్ది రోజుల్లోనే ఈ కారు ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది..ఇది భారత మార్కెట్లో గేమ్-ఛేంజర్ మోడల్‌గా మారనుంది.. ఈ కారును ముందుగా ఢిల్లీ, బెంగుళూరు నగరాల్లో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ కారుని అమ్మకానికే కాకుండా లీజింగ్/రెంటింగ్ కూడా వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానుంది. దీనివలన కస్టమర్లు ఈ ఖరీదైన కారుని వినియోగించుకునే అవకాశం కలుగుతుంది.

ప్రత్యేకతలు :
ఈ ఎలక్ట్రిక్ కారు సన్నని ఎల్‌ఈడి స్ట్రిప్‌తో అనుసంధానించబడిన ఎల్‌ఈడి హెడ్‌ల్యాంప్‌లను కలిగి ఉంది. ఈ ఎలక్ట్రిక్ కారులో స్టైలిష్ ఎల్ఈడి టెయిల్ లైట్లతో పాటు స్టైలిష్ వీల్స్ కూడా ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ కారు చూడటానికి చాలా స్టైలిష్‌గా, మంచి ఫ్యూచరిస్టిక్ లుక్‌లో కనిపిస్తుంది. 96 కిలోవాట్ల లిథియం-అయాన్ బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉంది. దీని ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 201 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి, 2400 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తిచేస్తోంది. ఈ కారు కేవలం 5.4 సెకన్లలోనే గంటకు గరిష్టంగా 0 – 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది. గరిష్ట వేగం గంటకు 196 కిలోమీటర్లు. ఇది పూర్తి ఛార్జీపై గరిష్టంగా 504 కిలోమీటర్ల రేంజ్‌ను కలిగి ఉంది. అంతేకాకుండా ఫాస్ట్ ఛార్జింగ్ సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. దీని సాయంతో కేవలం 30 నిమిషాల్లోనే 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు.

Related posts

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N