NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ

మంత్రి ఇలాకాలో మాయదారి రోగం..! మాటల “మంత్రి” పని పట్టినట్టేనా..!?

 

ప్రతి మనిషికి నిరూపించుకోవాల్సిన టైం ఒకటి వస్తుంది…. ఆ సమయంలో తనను తాను హీరోగా ప్రొజెక్ట్ చేసుకుంటే, ఖచ్చితంగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించి అందరితో శభాష్ అనిపించుకుంటేనే అతడి భవిష్యత్తు బంగారంలా ఉంటుంది… కష్టకాలంలో చేతులెత్తేసి తూతూమంత్రంగా ఏదో నడిపిస్తే ఇక అంతే.. జనం కూడా అంతే వేగంగా ఆ మనిషిని మర్చిపోతారు.. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ఆళ్ల నాని సొంత నియోజకవర్గం ఏలూరులో ప్రస్తుతం జరుగుతున్న వైద్య విపరిణామాలు ఆయనకు పెద్ద సవాల్ విసురుతున్నాయి… ఈ సవాల్ లో ఆయన గెలుస్తారా ఓడుతారా అన్నది కొద్ది రోజుల్లోనే తేలిపోతుంది…. ప్రాథమికంగా అయితే ఆయన సంఘటన జరిగిన వెంటనే బాగానే స్పందించారు… గానీ యంత్రాంగాన్ని తన చెప్పుచేతల్లో తీసుకోలేకపోయారు. వైద్య వ్యవస్థను పరుగులెత్తించలేక పోయారు.

సీఎం వస్తే గాని అధికారులు కదలరా??

సీఎం తర్వాత అంతటి ప్రోటోకాల్ అంతటి శక్తి ఉపముఖ్యమంత్రి ఉంటుంది. అందులోనూ కీలకమైన వైద్య ఆరోగ్య శాఖ నిర్వర్తించే ఉపముఖ్యమంత్రిగా ఆళ్ల నాని అధికారుల్ని వ్యవస్థలన్నీ పరిగెత్తించే లేకపోయారు. ఒకేసారి సుమారు రెండు వందల మంది ఫిట్స్ వచ్చి పడిపోయినా వైద్య శాఖ మంత్రి సొంత నియోజకవర్గం అయినా ఏలూరు గురించి వైద్య శాఖ ఉన్నతాధికారులకు పట్టలేదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోమవారం పర్యటనకు వస్తున్నప్పుడు మాత్రమే ఆయన వెంట వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తోపాటు మిగిలిన అధికారులు పరిగెత్తుకు వచ్చారు.
* ఉపముఖ్యమంత్రిగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న ఆళ్ల నాని నియోజకవర్గంలో ఉన్నట్టుండి వింత వ్యాధి రావడం పెద్ద విషయం. దీనిపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మాత్రం అసలు పట్టించుకోలేదు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా జిల్లా ఆసుపత్రిలో విజిట్ చేస్తున్నప్పుడు ఆయన వెంట రాష్ట్ర స్థాయి అధికారులు ఎవరూ కనిపించలేదు. కేవలం జిల్లా అధికారులు జిల్లా ఆస్పత్రి సాధారణ వైద్యులు మాత్రమే ఆళ్ల నాని వెనక కనిపించారు.
** రాష్ట్ర స్థాయి అధికారులను తన ఆధీనంలో ఉంచుకోవటం లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గా నాని విఫలమైనట్లే. వైద్య ఆరోగ్య శాఖలో ఏం జరుగుతుందో కూడా నా నీకు సరిగా తెలిసినట్లు లేదు. కేవలం అక్కడ అధికారులు ఆడిందే ఆటగా సాగుతోంది. ఇది పలు విషయాల్లో స్పష్టమైంది. కోవిడ్ సమయంలోనూ కేవలం ఉపముఖ్యమంత్రిగా కొన్ని జిల్లాలు తిరిగిన ముఖ్యమంత్రి అక్కడి అధికారులతో సమీక్ష జరిపారు తప్పితే రాష్ట్ర స్థాయి అధికారుల వీటికి రాలేదు.
**నాని పేషీలోని కీలక అధికారులందరూ సీనియర్ లే. ఆళ్ల నాని ఇంటర్మీడియట్ మాత్రమే చదివారు. వైద్య విషయాలపైన ఆయనకు అవగాహన తక్కువ. దీంతో పేషీలోని అధికారులంతా ముఖ్యమంత్రి ఆదేశాల తో పాటు ఉన్నతాధికారుల ఆదేశాల మాత్రమే పాటిస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా కేవలం సంతకాలకు మాత్రమే పని పని చేస్తున్నారనేది పెద్ద విమర్శ.

ఏలూరులో ఏమంత గుడ్ నేమ్ లేదు నానీ..!!

నియోజకవర్గంలోనూ నాని మాటల వ్యక్తిగానే ఉంటారనేది ఆరోపణ. షాడో మంత్రిగా ఆయన కాలేజ్ మిత్రుడు జేపీ మొత్తం వెనక ఉండి నడిపిస్తారని, అధికారులు ఆయన శాసిస్తారు. నియోజకవర్గంలో ఏ పని కావాలన్నా మొదట జేపీని కలిస్తే చాలు అనేది ఏలూరులో ఇప్పుడు హాట్ టాపిక్. అధికారుల బదిలీలు మొదలుకొని వారికి ఇష్టమైన వారిని వేయించుకునే వరకు , అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ చేయించాలనే అన్ని విషయాలను షాడో మంత్రి చక్క పెడుతున్నారు. మొత్తంగా జేపీ ఏలూరు అడ్డాగా చేసుకున్నారు. జేపీ అన్నయ్య టిడిపిలో ఉంటూ జేపీ వైఎస్ఆర్సీపీలో ఆళ్ల నాని వెంట తిరుగుతూ మద్యం దుకాణాలు హోటళ్లు ఇతర అన్ని రకాల వ్యాపారాలు చేస్తూ కాసులు దండుకుంటున్నారు. వీరికి అధికారుల సపోర్ట్ వందకి వెయ్యి శాతం ఉంటుంది.
** జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో అవినీతి ఆరోపణలపై ఎన్నో ఆరోపణలు వచ్చినా అక్కడ పెద్దగా నాని దృష్టిపెట్టింది ఏమీ లేదు. కేవలం తన సామాజిక వర్గం వారికి మాత్రమే అండదండలు అందిస్తారని నానికి ఓ చెడ్డ పేరు ఉంది. దీనికి తగ్గట్టుగానే ఏలూరు పట్టణం లో ఉన్న అన్ని కీలకమైన శాఖ అధికారులు కాపు వర్గానికి చెందిన వారు కనిపిస్తారు. మిగిలిన సామాజిక వర్గాలను దగ్గర కూడా రానివ్వరు అనే పేరు ఉంది.


** 300 మంది వరకూ పిట్టల్లా రాలిపోతున్న ఆసుపత్రికి వస్తుంటే కేవలం సెలైన్ పెట్టి సాధారణ వైద్యం చేస్తున్నారు తప్పితే.. దాని లోని ప్రాథమిక లక్షణాలు, ఒక రోగి ఆ రోజు దినచర్య ను పూర్తిగా పరిశీలిస్తే కేసులో చాలా చిక్కుముళ్లు విడిపోతాయి. ఆళ్ల నాని ఎదుటే వైద్యులు దీనికి కారణం తెలీదు అంటూ చెప్పడం, ఆయన సైతం దాన్ని చాలా లైట్ గా తీసుకొని తగ్గిపోతుందిలే అంటూ బాధితులకు ఊరట నివ్వడం కనిపించింది.

ఏలూరులో సమస్యలు పట్టవా నానీ..!?

** ఉప ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో అన్ని సమస్యలు కనిపిస్తాయి. మున్సిపల్ ఆస్పత్రులు ఎక్కడ లేవు. జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి అవినీతి మయంగా మారింది. కట్టుకడితే 100.. ఇంజక్షన్ చేస్తే 50… వార్డు వరకు తీసుకు వెళితే 200… అంటూ రోగులను ఇక్కడి సిబ్బంది పీక్కు తింటున్నారు. ఇదంతా బహిరంగ రహస్యమే. మీడియాలోనూ అనేకసార్లు కథనాలు వచ్చాయి. అయినా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి పట్టించుకోరు.
** జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో కనీస సదుపాయాలు కరువే. బాత్రూములు దుర్వాసన వెదజల్లుతూ ఉన్న రెండు బాత్రూం లో కనీసం నిర్వహణ ఉండదు. ఆసుపత్రి లో అడుగు పెట్టిన కానించి అవినీతే. జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో ఇప్పటివరకు ఆళ్లనాని తీసుకొచ్చిన సంస్కరణలు సున్నా. ఆయన దీనిని కనీసం పట్టించుకున్న బాపతు లేదు.

elluru mystery incident

ఇంకెప్పుడు నాని??

రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆళ్లనాని మూడో సారి ఏకంగా ఉపముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి తర్వాత అంతటి ప్రాధాన్యం ఉన్న సీట్లో కూర్చున్న ఆళ్ల నాని దయవల్ల ఏలూరు స్వరూపం మారుతుందని అంతా భావించారు. అయితే అనుకున్నదొక్కటి అయింది ఒకటి అన్నట్లుగా… ఏలూరు పట్టణం మొత్తం అభివృద్ధిలో వెనకబడింది. రోడ్లు దగ్గర్నుంచి పారిశుద్ధ్యం తాగునీరు డ్రైనేజీలు అన్ని సమస్యలు ఉన్నాయి. ఏలూరు ఏ సమస్య తీరలేదు. రెండున్నర ఏళ్ల కు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేస్తానని జగన్ ముందుగానే చెప్పారు. ఇప్పటికే రెండు ఏళ్లు గడిచిపోతున్నాయి. మరో ఆరు నెలల్లో ఆళ్లనాని ఏలూరుకు చేసేదేమిటి అని ఇక్కడి జనం ప్రశ్నిస్తున్నారు. మంత్రి పదవిలోనే చేయలేని వాడు అది పోతే చేసేది ఏమిటంటే అంటూ నియోజకవర్గ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

author avatar
Special Bureau

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N