NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

ముఖానికి రంగు వేసుకునే కమల్ హాసన్ కు… రంగులు మార్చే రాజకీయం చూపించిన కమలం

తమిళ్ నాడు రాష్ట్రంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే హీరోలకి, హీరోయిన్లకి ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. వారిని నిజజీవిత హీరోలగానే భావిస్తూ ప్రజలంతా పట్టం కడతారు. అలా ఎంతో మంది తమ రాజకీయ జీవితాలను దిగ్విజయంగా కొనసాగించిన చరిత్ర ఉంది. మరి వారందరూ ఎదుర్కొన్న ఆటుపోట్లు కమల్ హాసన్ కు కూడా మొదలయ్యాయి.

 

బాగా కష్టపడుతున్నాడు కమల్…

వివరాల్లోకి వెళితే… కమల్ హాసన్ ఎంఎన్ఎం పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. వాస్తవానికి రజనీకాంత్ తో పోలిస్తే తన రాజకీయ రంగ ప్రవేశంపై కమల్ హాసన్ చాలా సీరియస్గా వర్కవుట్ చేస్తున్నాడు. చాలా రోజుల ముందు పార్టీని స్థాపించిన కమల్ రాబోయే అసెంబ్లీ ఎన్నికలు లక్ష్యంగా అందుకు తగ్గ కార్యాచరణను మొదలు పెట్టేసాడు. ఇలాంటి సమయంలో అతనికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఎంఎన్ఎం పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణాచలం తాజాగా కమల్ హాసన్ కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు. అతను బిజెపిలో చేరడం పెద్ద సంచలనం అయిపోయింది.

నా మాట వినలేదు…

కమల్ రెండవ దశ ప్రచారంలో ఉన్న సమయంలో ఒక్కసారిగా అరుణాచలం పార్టీ విడి బీజేపీలో చేరడం తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. బీజేపీ కార్యాలయంలో కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ సమక్షంలో ఈ తతంగం అంతా జరిగింది. అరుణాచలం పార్టీ కండువా కప్పుకుంటూ… బిజెపితో నూతన వ్యవసాయ చట్టాలకు మద్దతు ఇవ్వాలని తాను కోరినట్లు… అయితే పవన్ రాజకీయ ప్రయోజనాల కోసం వాటిని వ్యతిరేకించారని ఆయన విమర్శించారు. ఈ కారణం చూపి అతను బీజేపీలో చేరి పోయాడు. కమల్ హాసన్ పార్టీలో అరుణాచలం కీలక నేత. అతనికి ఎప్పటినుండో కమల్ కు మంచి సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు అరుణాచలం వెళ్లిపోవడం కమల్ హాసన్ కు గట్టి ఎదురుదెబ్బ అనే చెప్పాలి.

హ్యాండిల్ చేస్తే గ్రేట్…

ఇకపోతే దక్షిణ రాష్ట్రాల పై పట్టు సాధించేందుకు మూకుమ్మడిగా పావులు కదుపుతున్న బీజేపీ ఢిల్లీ హై కమాండ్ కు ఇది తమిళనాడు రాష్ట్రంలో గొప్ప ముందడుగు అని చెప్పాలి. అరుణాచలం వెళ్లిపోవడంతో ఏం ఎన్ ఏం పార్టీ వర్గాల్లో కలకలం మొదలైంది. కమల్ తొలిసారి ప్రచారంలో ఉన్నప్పుడు ఇటువంటి వాటిని హ్యాండిల్ చేయడంలో ఎంత మాత్రం పరిణితి ప్రదర్శిస్తాడు అన్నది కీలకం. మరి వారు అధికార ప్రతిపక్ష పార్టీలను వదిలేసి కమల్ హాసన్ పై దృష్టి పెట్టడం వెనుక వ్యూహం ఏమిటో ఇంకా తెలియాల్సి ఉంది.

Related posts

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju