NewsOrbit
న్యూస్

ఏపీ కంటే పుదుచ్చేరి మేలు! గానగంధర్వుడి కి లభించిన అపారగౌరవం

తన పాటలతో దేశవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. ఆంధ్రప్రదేశ్ లోని పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన ఆ గాన గంధర్వుడు అంతర్జాతీయ ఖ్యాతిని అందుకున్నారు.

తింటే గారెలే తినాలి వింటే ఎస్పీ బాలసుబ్రమణ్యం పాటలువినాలి అన్న రేంజిలో ఆయన ప్రస్థానం సాగింది.నేపథ్య గాయకుడు గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్టుగా నటుడిగా సంగీత దర్శకుడిగా నిర్మాతగా బహుముఖ పాత్రలు సినిమారంగంలో పోషించిన ఎస్పీ బాలసుబ్రమణ్యం ఒక లెజెండ్ డనడంలో సందేహం లేదు లెజెండ్ అనడంలో సందేహం లేదు.ఇటీవలే తీవ్ర అస్వస్థతతో అందరికీ శాశ్వతంగా దూరం అయిపోయిన ఎస్పీ బాలసుబ్రమణ్యానికి అరుదైన పురస్కారం లభించింది.అయితే ఇది ఆయన పుట్టిపెరిగిన ఆంధ్రప్రదేశ్ లో కాదు.

సుదీర్ఘకాలం చెన్నైలోనే ఉండిపోయిన సుదీర్ఘకాలం చెన్నైలోనే ఉండిపోయిన ఆయన గౌరవార్థం పుదుచ్చేరిలోని ఓ బేకరీ.. బాలు చాక్లెట్ విగ్రహాన్ని తయారు చేసింది. ఆ విగ్రహానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జుకా చాక్లెట్ కేఫ్‌ చెఫ్ రాజేంద్రన్ ఈ విగ్రహాన్ని రూపొందించారు. చాక్లెట్‌తో నిర్మించిన ఈ విగ్రహం బరువు 339 కిలోలు మరియు ఎత్తు 5.8 అడుగులు. ఈ విగ్రహాన్ని రూపొందించడానికి తమకు 161 గంటల సమయం పట్టిందని కేఫ్ బృందం పేర్కొంది.

ప్రజల సందర్శనార్థం ఈ విగ్రహాన్ని జనవరి 3 వరకు అందుబాటులో ఉంచుతామని కేఫ్ నిర్వాహకులు తెలిపారు. ఆగస్టు 5న కరోనావైరస్ బారినపడిన బాలు.. ఆగస్టు 13న మరింత అనారోగ్యానికి గురయ్యారు. వైరస్ ప్రభావంతో ఆయన ఊపిరితిత్తుల చెడిపోవడంతో సెప్టెంబర్ 25న మరణించారు.పుదుచ్చేరి బేకరీ ఓనర్ స్ఫూర్తితో ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సహా ప్రముఖ సాంస్కృతిక సంస్థలు ఎస్పీ బాలసుబ్రమణ్యం స్మృతులను రాష్ట్రంలో నిలిపేలా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందనడంలో సందేహం లేదు!

 

Related posts

Barzan Majid: ఐరోపా మోస్ట్ వాంటెండ్ స్మగ్లర్ మజీద్ (స్కార్పియన్) అరెస్టు

sharma somaraju

Chiranjeevi-Balakrishna: చిరంజీవి రిజెక్ట్ చేసిన క‌థతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన బాల‌య్య‌.. ఇంత‌కీ ఏ సినిమా అంటే?

kavya N

లగడపాటి సర్వే రిపోర్ట్… ఆ పార్టీకి షాక్ తప్పదా… ?

G V Prakash Kumar: ఇండ‌స్ట్రీలో మ‌రో విడాకులు.. 11 ఏళ్ల వైవాహిక బంధానికి స్వ‌స్తి ప‌లికిన యువ హీరో!

kavya N

 Election 2024: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్ సమయం

sharma somaraju

Video Viral: పోలింగ్ కేంద్రం వద్ద ఓటరు చెంప చెళ్లు మనిపించిన ఎమ్మెల్యే .. తిరిగి అదే రీతిలో ఎమ్మెల్యేపై .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

పోలింగ్ డే ట్విస్ట్‌: వైసీపీకి మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా.. ?

ఏపీ పోలింగ్ రోజు వైసీపీకి ఇన్‌డైరెక్టుగా మ‌ద్ద‌తు ఇచ్చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్ ?

Supreme Court: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో ఊరట

sharma somaraju

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

ప్రశాంత్ కిషోర్ సర్వే…. జగన్‌కు ఎన్ని సీట్లు అంటే.. ?

ఏంద‌య్యా ఇది…BRSకు మెజారిటీ సీట్లు… ప్రధానిగా కేసీఆర్… ?

పోలింగ్ ముందు రోజు పిఠాపురం వైసీపీలో ర‌చ్చ రచ్చ‌.. చేతులెత్తేసిన వంగా గీత‌..?