భారతదేశంలో ఈ మధ్య వెబ్ సిరీస్ ల జోరు ఎక్కువైంది. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్, డిస్నీ హాట్ స్టార్, జీ 5 వేటికవే పోటీపడుతూ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. డిస్నీ హాట్ స్టార్ లో టాప్ రేటింగ్ ఉన్న క్రిమినల్ జస్టిస్ వెబ్ సిరీస్ కు కొనసాగింపుగా రెండవ సీజన్ బిహైండ్ ది క్లోజ్డ్ డోర్స్ తాజాగా విడుదలైంది. మరి మొదటి సీజన్ కు వచ్చిన ఆదరణ రెండో సీజన్ కు వస్తుందో లేదో చూద్దాం…
కథ :
అను (కీర్తి) కి సమాజంలో బాగా పేరున్న టాప్ ముంబై లాయర్ బిక్రమ్(జిష్షు సెంగుప్తా) తో పెళ్లి అవుతుంది. అయితే బయట ఎంతో గౌరవింపబడే వ్యక్తి గా చలామణి అయ్యే ఆమె భర్త అంత మంచివాడు కాదని అతని లో ఎన్నో చెడు గుణాలు ఉన్నాయని ఆమెకు తెలుసుకునేందుకు ఎంతో సమయం పట్టదు. ఇక వీరిద్దరి మధ్య జరిగే వాదన మధ్య పొరపాటున ఆమె ఆమె భర్త కడుపులోనికి కత్తి దూస్తుంది. అతను చనిపోయిన తర్వాత వారి కూతురు రియా తండ్రి హత్య జరిగిన తర్వాత జరిగిన పరిణామాలను ఎదుర్కొంటుంది. ఆమెనే అనుమానిస్తూ ఉంటారు పోలీసులు. ఇక వేరే దారి లేక అను తను చేసిన తప్పును ఒప్పుకొని లొంగిపోతుంది ఇక ఆమెకు శిక్ష విధించడం ఒకటే బాకీ ఉంది. ఇటువంటి ఓపెన్ అండ్ షట్ కేసు లో మాధవ్ మిశ్రా (పంకజ్ త్రిపాఠి) అనే లాయర్ ఎంటర్ అవుతాడు. తనకు ఉండే పర్సనల్ ప్రాబ్లమ్స్ నుండి తనను తాను మానసికంగా మళ్ళించుకునేందుకు ఈ కేసు తీసుకుంటాడు. అక్కడి నుండి అసలు నేను ఈ కేసు నుండి బయట పడలేను అని కుంగిపోయి ఎటువంటి నమ్మకం లేని స్థితిలో ఆమెను కేసు నుండి ఎలా తప్పిస్తాడు అన్నది మిగిలిన కథ.
ప్లస్ లు
ప్రధాన నటీనటుల పర్ఫార్మెన్స్
స్త్రీ సమస్యల పై విశ్లేషణ చేసే తీరు
అను క్యారెక్టరైజేషన్
మైనస్ లు
సాగదీసిన ఎపిసోడ్లు
స్లో గా రన్ అయ్యే షో
స్క్రీన్ ప్లే
ట్రైలర్ లోనే అర్థమైపోయిన కథ
విశ్లేషణ :
ఒక మర్డర్ కేసును, కోర్టు రూమ్ డ్రామాను గా చిత్రీకరించడం మామూలే. అయితే ఇందులో కొన్ని అదిరిపోయే సన్నివేశాలు, కంటెంట్ వల్ల క్రిమినల్ జస్టిస్ మొదటి భాగం బాగా క్లిక్ అయింది. అయితే రెండవ భాగంలో మరింత గంటలు స్క్రీన్ అయ్యేందుకు ఆస్కారం లేకపోయినా షో సాగదీసిన తీరు ప్రేక్షకులకు విసుగు తెప్పిస్తుంది. క్యారెక్టర్ పై న ఎన్నో ఆశలు పెట్టుకున్న వారికి చివరికి నిరాశే మిగులుతుంది. ఇక కోర్టు రూమ్ డ్రామా సన్నివేశాలు ఆసక్తికరంగా ఉన్నాయి. అలాగే ఆడవారి మనోభావాలు, వారి ప్రవర్తన సమాజంలో జరిగే విషయాలు వారిపై ప్రభావం చూపించే తీరుని కళ్లకు కట్టినట్టు చూపించారు, ఈ విషయం మాత్రం రెండవ భాగానికి హైలైట్ అని చెప్పాలి. మొదటి సీజన్ తో పోలిస్తే రెండవ సీజన్ చాలా ఆసక్తిగా సాగుతుంది మహిళా ప్రేక్షకులకు నచ్చవచ్చు కానీ మొదటి సీజన్ చూసి భారీ అంచనాలు పెట్టుకున్న వారు తీవ్రంగా నిరాశ చెందుతారు.