Prabhas: ఇటీవల “కల్కి” నుంచి విడుదలైన అమితాబ్ అశ్వత్థామ ప్రోమోకు విపరీతమైన స్పందన వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చిత్రయూనిట్ తాజాగా తెలుగు ప్రోమోను విడుదల చేసింది. ‘ద్వాపరయుగం నుంచి దశావతారం కోసం ఎదురు చూస్తున్నా.. ద్రోణాచార్యుడి పుత్రుడిని, నా పేరు అశ్వత్థామ’ అని అమితాబ్ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటోంది. ఇప్పటికే గ్లింప్స్ అమితాబ్ యంగ్ లుక్ కూ ప్రశంసలు వెల్లువెత్తాయి. మే నెలలో ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ప్రభాస్ కెరియర్ లో దాదాపు 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో “కల్కి” నిర్మించడం జరిగింది. ఇదే ప్రభాస్ కెరీర్ మొత్తంలో హైయెస్ట్ బడ్జెట్ మూవీ.
ఈ సినిమాలో కమల్ హాసన్ విలన్ పాత్రలో నటించడం జరిగింది. దీపికా పదుకొనే, దిశాపటాని.. వంటి వారు కూడా కీలక పాత్రలు చేయడం జరిగింది. సూపర్ హీరోస్ నేపథ్యంలో.. ఈ సినిమాని దర్శకుడు నాగ్ అశ్విన్ చిత్రీకరించడం జరిగిందట. ఇప్పటివరకు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఎవరు ఉపయోగించని ఆయుధాలను.. ఈ సినిమాలో ఉపయోగించారట. వాటి కోసం ప్రత్యేకమైన డిజైన్లు సినిమా ప్రారంభం ముందు చేయడం జరిగిందట. “కల్కి” కచ్చితంగా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ స్థాయిని పెంచే సినిమా అని.. మేకర్స్ అంటున్నారు. వరుస పరాజయాలలో ఉన్న ప్రభాస్ గత ఏడాది “సలార్” సినిమాతో విజయాన్ని అందుకున్నారు.
దీంతో ఇప్పుడు “కల్కి” సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకోవడం జరిగింది. ప్రస్తుతం కల్కి మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. మే నెల నుండి సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు స్టార్ట్ కాబోతున్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ నీ చాలా వైవిధ్యంగా నాగ్ అశ్విన్ చూపించడం జరిగింది. ప్రపంచస్థాయిలో భారతీయ చలనచిత్ర రంగం యొక్క సినిమాలు సత్తా చాటుతున్నాయి. దీంతో.. సూపర్ హీరోస్ నేపథ్యంలో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో… “కల్కి” చిత్రీకరించడం జరిగిందంట. కచ్చితంగా ప్రభాస్ కెరియర్ లో “బాహుబలి” మాదిరిగా… ఈ సినిమా ఉండబోతుందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.
The legendary @SrBachchan as Immortal 'ASHWATTHAMA' from #Kalki2898AD.
Here’s the Telugu version promo : https://t.co/bnnEnQZeEB@ikamalhaasan #Prabhas @deepikapadukone @nagashwin7@DishPatani @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD pic.twitter.com/d6kzEfrOy4
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) April 25, 2024