NewsOrbit
Featured న్యూస్ రాజ‌కీయాలు

జేసీ కుటుంబం వైసీపీలోకి వస్తే..!? ఏం జరుగుతుందో ఊహించగలరా..!?

జేసీ కుటుంబం గురించి పరిచయం అక్కర్లేదు. ఇద్దరు అన్నదమ్ములు ఫైర్ బ్రాండ్లు. ఒకరు ఉన్నదీ ఉన్నట్టు సూటిగా చెప్పేస్తారు.., ఇంకొకరు సూటిగా చేసేస్తారు..! దశాబ్దాల తరబడి అనంత రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న జేసీ కుటుంబానికి ఇప్పుడు చిక్కులు వచ్చి పడ్డాయి. అనుకోని కష్టాల నుండి గట్టెక్కుతారా..? రాజీ పడి జగన్ కి జై కొడతారా..? అనేది కీలకంగా మారింది. వాళ్ళు వైసీపీలోకి వస్తారా..? లేదా..? వస్తే పరిస్థితులు ఎలా ఉంటాయి..!? అనేది చూద్దాం..!!

టీడీపీలో అనంత తీరు వేరు..!

అనంతలో టీడీపీకి కొన్ని స్థంభాలున్నాయి. ఎవరికీ వారి వర్గాలున్నాయి. ఒకరంటే ఒకరికి పడదు. కానీ కలిసినట్టు ఉంటారు. జేసీ కుటుంబం తీరు వేరు. పరిటాల కుటుంబానికి జేసీ కుటుంబానికి తరాల నుండి అగాధం ఉంది. మరోవైపు పయ్యావుల కేశవ్ ఈ ఇద్దరికీ భిన్నంగా మూడో వర్గం నడుపుతుంటారు. ఇవేమి పట్టనట్టు నందమూరి బాలకృష్ణ తన దారిలో తాను ఉంటారు. పరిటాల కుటుంబానికి అంటే పెద్దగా ప్రస్తుతం ఊడిపడుతున్న ఇబ్బందులేమీ లేవు. రాజకీయ ఇబ్బందులు తప్ప ఆర్ధిక, వ్యాపార, కేసుల ఇబ్బందులు లేవు. ఇప్పట్లో వచ్చే అవకాశం లేదు. కానీ జేసీ కుటుంబానికి మాత్రం ఇబ్బందులు చుట్టుముట్టాయి. వారసుల భవితవ్యం ప్రస్నార్ధకమైంది. ఆరుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచినా జేసీ దివాకర్ రెడ్డి తన కుమారుణ్ణి గెలిపించుకోలేకపోయారు. ఇటు జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా అంతే. తొలిసారి పోటీలోకి దిగిన కుమారుణ్ణి గెలిపించుకోలేకపోయారు. వారసులు ఓడిపోయారు. వ్యాపారాలు దెబ్బతిన్నాయి.

ఎన్నాళ్ళు ఇమడగలరు..!?

ఇప్పుడు అధికార పక్షం ఒత్తిళ్లు ఎక్కువగా ఈ సోదరులపై ఉన్నాయి. అటు ఆర్ధిక మూలాలపై దెబ్బ పడుతుంది. వ్యాపారాలు దెబ్బ తింటున్నాయి. ప్రభుత్వం కొరడా ఝులిపించి రూ. 100 కోట్ల ఫైన్ వేసేసింది. అటు ప్రభాకర్ రెడ్డి బస్సుల వ్యాపారం కూడా నష్టాల్లో ఉంది. అంటే రాజకీయంగానూ, ఆర్ధికంగానూ ఈ సోదరులు కష్టాల్లో ఉన్నారు. అన్నిటికీ మించి గత పాపలు ఇప్పుడు వీరిని వెంటాడుతున్నాయి. కేతిరెడ్డి పెద్దారెడ్డి కుటుంబానికి, జేసీ కుటుంబానికి వైరం దశాబ్దాల తరబడి ఉంది. ఇప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నారు, వీళ్ళు ప్రతిపక్షాల్లో, అచేతనంలో ఉన్నారు. అందుకే టార్గెట్ అయ్యారు. ఇలా ఎన్నాళ్ళు ఉండగలరు..? టీడీపీ ని, చంద్రబాబుని నమ్ముకుని జేసీ సోదరులు ఇదే పార్టీలో ఎన్నాళ్ళు ఉండగలరు..? అనేది పెద్ద ప్రశ్న. ఒకవేళ పార్టీ మారదాం అంటే జగన్ రానిస్తారా..? నమ్ముతారా..? అనేది మరో పెద్ద ప్రశ్న.

వైసీపీలోకి వస్తే ఏం జరుగుతుంది..!?

జేసీ సోదరులు ఒకవేళ వైసిపిలోకి వస్తే..! (వారి అనుచర వర్గాలు కోరుకుంటున్నాయి).. అనంతలో ఎటువంటి రాజకీయ మార్పులు జరుగుతాయి అనేది ఆసక్తికరం. ఇక్కడ పార్టీలో చేరడం వేరు., అధికార పార్టీలో చేరి పెత్తనం పొందడం వేరు. జేసీ సోదరులు అధికార పార్టీలోకి చేరి.. వాళ్ళకి ఇబ్బందులు రాకుండా చూసుకోవడం వరకు ఉపశమనం పొందగలుగుతయారు. ఒకవేళ జగన్ కరుణిస్తేనే… అలా కాకుండా పెత్తనం కూడా తీసుకుంటాం.., కొంతమందిపై అజమాయిషీ చేస్తాం అంటే మాత్రం కుదరదు. అదే జరిగితే తీవ్ర రాజకీయం, ఫ్యాక్షన్ యుద్ధాలు తప్పవు. అనంత అదుపు తప్పే వీలుంది. వీళ్ళ అనుచరులు రెచ్చిపోతారు. అది జగన్ కి బాగా తెలుసు. అందుకే జగన్ కూడా అనంత రాజకీలాను నిశితంగా గమనిస్తూ… నేతలను తన కనుసన్నల్లో ఉంచగలుగుతున్నారు..!!

Related posts

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N