NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

పాత్ర నుంచి బయటకొచ్చిన జస్టిస్!! ఎందుకీ వ్యక్తిగత ఆరోపణలు

 

 

జస్టిస్ రాకేష్ కుమార్ స్పందన ఎందుకు అంత ఆవేదనతో నిండుకుంది… ఓ కేసు విచారణ సందర్భంగా లేదా ఓ ఈ కేసును కొట్టి వేస్తున్న సందర్భంగా న్యాయమూర్తి చెప్పే విషయాలు ఆ కేసుకు రిలేటెడ్ గా ఉండాలి… అలాగే భవిష్యత్తులో ఆ కేసు ఓ మైలురాయిగా నిలిచి అలాంటి కేసులకు ఓ మార్గదర్శకం వహించాలి… మరి రాకేష్ కుమార్ ఎందుకు వ్యక్తిగత దూషణ వైపు వెళ్లారు… నేరుగా ప్రభుత్వంపై ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి పై ఎందుకు ఆయనకు అంత అక్కసు… న్యాయ వ్యవస్థను న్యాయ సూత్రాలను లోబడి తాను మాట్లాడుతున్నానని చెబుతూనే… దాని పరిధికి మించి ఇష్టానుసారం వ్యాఖ్యలు చేయడం దేనికి సంకేతం..?? ఓ న్యాయమూర్తిగా అందరికీ అజాతశత్రువు గా ఉండాల్సిన రాజేష్కుమార్ ఎందుకు ఓ సైడ్ తీసుకొని మాట్లాడుతున్నారు. ఆయన నోరు విప్పితే ఎందుకు న్యాయవ్యవస్థను రక్షిస్తుందని నేనే అత్యంత శుద్ధమైన వ్యక్తి అని చెప్పుకోవడం లో ఉన్న ఆవేశం ఎందుకు?? జస్టిస్ రాకేష్ కుమార్ ఈ నెలాఖరున పదవీ విరమణ చేయనున్న సమయంలో ఆయన పూర్తిగా టీడీపీ వకాల్తా పుచ్చుకున్న ట్లు మాట్లాడడం ఎంతవరకు సమంజసం అన్నది న్యాయనిపుణులకే అంతుబట్టని ప్రశ్న.

** మిషన్ బిల్డ్ ఏపీ పథకం మీద కొన్ని అంశాలను లభిస్తూ కొందరు హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. సుమారు పదిమంది వరకు ప్రభుత్వ భూములు అమ్ముకొని మిషన్ బిల్డ్ ఏపీ నిర్వహించడం సరికాదంటూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు జస్టిస్ రాకేష్ కుమార్, కృష్ణా రావు ధర్మాసనం ముందుకు వచ్చింది. ఇప్పటికే పలు కేసుల్లో ఏపీ ప్రభుత్వం తీరు మీద పలు ఆరోపణలు చేశారని విమర్శలు ఎదుర్కొంటున్న రాకేష్ కుమార్ ఈ కేసు విచారణను నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం హైకోర్టులో విచారణ నుంచి రాకేష్ కుమార్ ను తప్పించాలని ఆయన ముందే పిటిషన్ వేసింది. సుప్రీంకోర్టు సూచనల మేరకు ఆ కేసు తాలూకా విషయాల్లో న్యాయమూర్తిని ఎందుకు తప్పించాలి అనేదానిమీద ప్రభుత్వం ఖచ్చితంగా అఫిడవిట్ దాఖలు చేయాలి… అప్పుడే విట్ అంటే నామ పత్రం.. ప్రమాణపత్రం. కోర్టుల ముందు నిజం ఒప్పుకొని మేము చెబుతున్నది అంత నిజం అని చెప్పడం అన్నమాట.
** ఇప్పుడు ఈ అఫిడవిట్ విషయంలోనే రాకేష్ కుమార్ తనమీద తానే కేసు నుంచి తప్పించాలని విచారణ చేసుకున్న కేసులో అఫిడవిట్లు తప్పుగా పేర్కొన్నారు. అఫిడవిట్ లో పేర్కొన్న కొన్ని అంశాలు వ్యాఖ్యలు తన చేయలేదంటూ చెప్పుకొచ్చారు. తాను చేయని వ్యాఖ్యలను అఫిడవిట్లో పొందుపరిచారు అని ఏకంగా ఎస్ ప్రవీణ్ కుమార్ పై కేసు నమోదు ఆదేశించారు.
** ఇక్కడ గుర్తించాల్సింది ఒక్కటే… కోర్టుల్లో మీడియాకు ఎలాంటి అనుమతులు ఉండవు. అక్కడ మీడియా ఉన్నది తక్కువే. కేవలం న్యాయవాదులు, కోర్టు సిబ్బంది చెప్పే కొన్ని అంశాల ఆధారంగా మీడియా కథనాలు ఉంటాయి. ఇప్పుడు ఐ ఎస్ ప్రవీణ్ కుమార్ సైతం మీడియాలో వచ్చిన కథనాలను మాత్రమే అఫిడవిట్ లో పేర్కొన్నారు. ఇందుకు ప్రత్యేకమైన సాక్ష్యాలు ఆధారాలు ఆయన పొందుపరచలేదు.. దాదాపు అవి ఉండవు కూడా… ఇప్పుడు రాకేష్ కుమార్ తాను పత్రికల్లో వచ్చిన మాటలను అనలేదని చెబుతున్నారు… అంటే ఇప్పుడు తప్పు ఎవరిది??ఐఏఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ దా?? లేక జస్టిస్ అని మాటలను అన్నట్లు ప్రచురించిన పత్రికలదా?? రాకేష్ కుమార్ ఎవరి మీద కేసులు పెట్టాలని చెప్పాలి.. అనని మాటలు అన్నట్లు రాసిన పత్రికల మీద కదా…. ఇది లాజిక్ కదా!!

అవన్ని ఎందుకు??

**మిషన్ ఏపీ బిల్డ్ కేసులో జస్టిస్ రాకేష్ కుమార్ ను తప్పించాలని ప్రభుత్వం వాదించిన కేసును కొట్టివేస్తూ జస్టిస్ రాకేష్ కుమార్ పెద్ద ఉపోద్ఘాతం ఇచ్చారు… ఇవన్నీ వ్యక్తిగత అధికార పార్టీ మీద ఓ టిడిపి నాయకుడు వ్యాఖ్యానించినట్లుగా ఉందనేది న్యాయనిపుణుల అభిప్రాయం. ఓ న్యాయమూర్తి ఓ కేసు విషయమై చెబుతున్నప్పుడు అది ఖచ్చితంగా భవిష్యత్తుకు ఉపయోగపడాలి. అయితే జస్టిస్ రాకేష్ కుమార్ మంగళవారం మిషన్ ఏపీ బిల్ పథకంలో పిటిషన్ను కొట్టివేస్తూ చేసిన ప్రసంగం అంతా ఆయన వ్యక్తిగత అభిప్రాయాలు వ్యక్తిగత విషయాలు చెప్పినట్లుగా ఉన్నట్టుంది… దీంతోపాటు 151 మంది ఎమ్మెల్యేలు ఎన్నుకున్న ప్రభుత్వం పై సీఎం పై అనుచిత వ్యాఖ్యలు… ఖైదీ నెంబరు చెబుతూ జగన్ మీద చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.. మిషన్ ఏపీ బిల్ పథకం మీద రాకేష్ కుమార్ ను తప్పకుండా అంశానికి ఆయన ఈ కేసు విషయంలో చేసిన వ్యాఖ్యలకు ఎక్కడా పొంతన దొరకడం లేదని న్యాయనిపుణులు అభిప్రాయం.
** ఇటు వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు మాత్రం జస్టిస్ రాకేష్ కుమార్ కు ఇచ్చిన పాత్రకు ఆయన సరిగ్గా పోషించుకుంటూ పాత్ర నుంచి బయటకు వచ్చి.. నిజ రూపాన్ని చివరలో అందరికీ తెలిసిపోయేలా చేశారని వ్యాఖ్యానిస్తున్నారు.

Related posts

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N