NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

వైఎస్ ప్రేమగా చేసిన పనిని క్యాన్సిల్ చేసిన ఏపి ప్రభుత్వం ? జగనూ ఇదెక్కడి న్యాయం?

వైఎస్ జగన్మోహనరెడ్డి ys jagan mohan reddy ముఖ్యమంత్రి cm గా బాధ్యతలు చేపట్టిన తరువాత అనేక కీలక నిర్ణయాలను తీసుకున్న సంగతి తెలిసిందే. ఓ పక్క సంక్షేమ రథాన్ని పరుగులు పెట్టిస్తూనే మరో పక్క అభివృద్ధి వైపు దృష్టి సారిస్తున్నారు. ఈ క్రమంలోనే
పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానుల ఏర్పాటుకు జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే విశాఖలో అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములపై దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. టీడీపీ నేతల ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా గతంలో ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని అనుభవిస్తున్న వారి జాబితాపైనా దృష్టి పెట్టారు.

The Jagan government took back the L&T lands in Visakhapatnam

టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన భూముల కేటాయింపులను రద్దు చేయడమే కాక తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హాయంలో జరిగిన భూ కేటాయింపులపైనా జగన్ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ క్రమంలో విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ అధారిటీ (వీఎంఆర్డీయే) పరిధిలో ఓ ప్రముఖ సంస్థకు వైఎస్ఆర్ హయాంలో వేలం ద్వారా కేటాయించిన సుమారు 40 ఎకరాల భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సదరు భూములను స్వాధీనం చేసుకోవాలంటూ మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి వై శ్రీలక్ష్మి శుక్రవారం విఎంఆర్డీయే కమిషనర్ కు ఉత్తర్వులు జారీ చేశారు.

వివరాల్లోకి వెళితే..ఎల్ అండ్ టీ విజన్ వెంచర్స్ సంస్థ కొమ్మాాది లోని 39.89 ఎకరాలను వైఎస్ఆర్ హయాంలో వేలం ద్వారా పాడుకుంది. ఎకరం రూ.1.53 కోట్లకు సొంతం చేసుకుంది. అయితే నిబంధనల ప్రకారం చెల్లించాల్సిన మొత్తంలో ఆ సంస్థ కొంత మాత్రమే చెల్లించి మిగిలిన సొమ్ము ఇంత వరకూ జమ చేయలేదు. వైఎస్ఆర్ తరువాత వచ్చిన ప్రభుత్వాలు ఆ బకాయిలపై దృష్టి పెట్టలేదు. దీంతో ఆ సంస్థ ప్రభుత్వానికి చెల్లించాల్సిన మొత్తం గత ఏడాది డిసెంబర్ 31 నాటికి రూ.88.73 కోట్లకు చేరుకుంది. ఈ బకాయిలు చెల్లించాలని జారీ చేసిన నోటీసులకు సంస్థ నుండి సమాధానం రాలేదు.

ఇప్పుడు విశాఖ పరిపాలనా రాజధానిగా డిక్లేర్ అవుతుండటంతో ఆ భూముల విలువ విపరీతంగా పెరిగింది. ప్రస్తుతం ఈ భూములు ఎకరం రూ. ఆరు కోట్లకు పైగా పలుకుతున్నాయి. ఈ లెక్కన పాత ధరల ప్రకారం ఆ సంస్థకు భూములను కేటాయించినట్లైయితే ప్రభుత్వానికి రూ.99 కోట్ల మేర నష్టం వాటిల్లుతుందని అధికారులు గుర్తించారు. అంతే కాకుండా ఏంతో విలువైన భూములను చాలా తక్కువ ధరలకు కేటాయించడంపైనా పలు ఫిర్యాదులు అందాయని ప్రభుత్వం జారీ చేసిన జీవోలో పేర్కొంది. ఈ భూముల కేటాయింపును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం.. ఇప్పటికే ఆ సంస్థ చెల్లించిన మొత్తాన్ని సాధారణ వడ్డీతో తిరిగి ఇచ్చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు విఎంఆర్డీయేను ప్రభుత్వం ఆదేశించింది.

Related posts

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !