NewsOrbit
జాతీయం న్యూస్

Hathras : యుపిలో మరో దారుణం..బాధితురాలి తండ్రిని తుపాకితో కాల్చిన నిందితుడు

Hathras : ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో నేరాలు, ఘోరాలు యదేశ్చగా జరుగుతున్నాయి. మహిళలపై లైంగిక దాడులు, అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. ఈ నేరాలపై కఠిన చట్టాలు ఉన్నప్పటికీ నిందితులు పేట్రేగిపోతున్నారు. నిందితులు జైలుకు వెళ్లి బెయిల్ పై వచ్చిన తరువాత బాధితులపై మళ్లీ దాడులకు తెగబడుతున్నారు. తాజాగా లైంగికదాడి కేసులో జైలుకు వెళ్లిన ఓ వ్యక్తి బెయిల్ పై బయటకు వచ్చిన తరువాత బాధితురాలి తండ్రిని కాల్చి చంపడం హత్రాస్ జిల్లాలో తీవ్ర కలకలాన్ని రేపింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి యోగి అదిత్యనాథ్ స్పందించారు.

Hathras : sex assault man out bail shoots survivor father
Hathras : sex assault man out bail shoots survivor father

వివరాల్లోకి వెళితే.. హత్రాస్ జిల్లాలో 2018లో ఓ బాలికపై గౌరవ్ శర్మ అనే వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై నాడు బాధితురాలి తండ్రి గౌరవ్ శర్మ పై పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. నెల రోజుల తరువాత గౌరవ్ శర్మ బెయిల్ పై బయటకు వచ్చాడు, గత కొద్ది రోజులుగా గౌరవ్ శర్మ కేసు ఉపసంహరించుకోవాలంటూ బాధిత కుటుంబంపై ఒత్తిడి తీసుకువస్తున్నాడు. దీనికి బాధితురాలి తండ్రి ఒప్పుకోకపోవడంతో అతన్ని హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు.

సోమవారం బాధితుడి కుటుంబం ఆలయానికి వెళ్లగా అక్కడికి నిందితుడు గౌరవ్ శర్మ, అతని భార్య, అత్త వచ్చారు. అప్పటికే కేసు వ్యవహారంపై వివాదం నడుస్తుండగా వీరి మధ్య వాగ్వివాదం జరిగింది. ఈ తరుణంలో గౌరవ్ శర్మ తనతో తెచ్చుకున్న తుపాకీతో బాధితురాలి తండ్రిని కాల్చేశాడు. తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో పడిపోయిన తండ్రిని బాదితురాలు వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆసుపత్రి వద్ద తండ్రి చనిపోవడంతో బాధితురాలు బిగ్గరా కేకులు వేస్తూ రోధించింది. నిందితులపై పోలీసులు కఠినంగా శిక్షించాలని వేడుకుంది. బాధితురాలు రోధించడం చూపరుల హృదయాలను కలచివేసింది. గౌరవ్ శర్మ తనను లైంగికంగా వేధించాడనీ అతనిపై కేసు పెట్టి అరెస్టు చేసినందుకు కక్షకట్టి తన తండ్రిని హత్య చేశాడని ఆ యువతి వెల్లడించింది.

ఆ యువతి రోధిస్తూ వివరాలు చెబుతుండగా కొందరు యువకులు తమ సెల్ ఫోన్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో వైరల్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో యోగి ఆదిత్యనాథ్ సర్కార్ పై యుపి కాంగ్రెస్ విరుచుకుపడింది. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, లైంగిక దాడులు పెరిగిపోతున్నాయని మండిపడ్డారు. ఇప్పటికైనా యోగి నిద్రమేల్కోని బాదితురాలి వ్యధ వినాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని కాంగ్రెస్ డిమాండ్ చేశారు. నిందితుడిని పట్టుకునే ప్రయత్నం చేస్తారా లేక బాధితురాలిపైనే నిందలు వేస్తారా అంటూ కాంగ్రెస్ ఘాటు వ్యాఖ్యలు చేసింది.  కాగా పోలీసులు గౌరవ్ శర్మ కుటుంబ సభ్యుడు ఒకరిని అరెస్టు చేశారు. నిందితులందరిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని, జాతీయ భద్రతా చట్టాన్ని అమలు చేయాలంటూ సీఎం యోగి అదిత్యనాథ్ అధికారులను ఆదేశించారు.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju