NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

KCR : నిరుద్యోగుల‌కు కేసీఆర్ స‌ర్కారు చెప్పే గుడ్ న్యూస్ ఏంటో తెలుసా?

KCR : తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ సార‌థ్యంలోని రాష్ట్ర ప్ర‌భుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. గ‌త కొద్దికాలంగా ఊరిస్తున్న వాటికి రూపం ద‌క్క‌నుంద‌ని తేలింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆర్థికమంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ.. త్వరలోనే 50 వేల ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్టు ప్రకటించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకే ఉద్యోగుల వయోపరిమితి పెంచుతున్నామన్న ఆయన.. వయోపరిమితి పెంపు ప్రభావం ఖాళీల భర్తీపై పడబోదని స్పష్టం చేశారు. ఆర్థిక‌మంత్రి హ‌రీశ్ రావు ప్ర‌క‌ట‌న నిరుద్యోగుల‌కు భారీ గుడ్ న్యూస్ అని అంటున్నారు.

ఎప్పుడు యాభై వేల కొలువులంటే….

తెలంగాణ రాష్ట్రంలో వెంటనే 50 వేల ఖాళీలు భర్తీ చేస్తామని ఆర్థిక మంత్రి హ‌రీశ్ రావు వెల్లడించారు. దీనిపై ఇప్పటికే సీఎం కేసీఆర్ ఆదేశాలిచ్చారని.. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ త్వరలో విడుదల చేస్తామన్నారు. ఈ నేప‌థ్యంలో త్వ‌ర‌లో, చెప్పాలంటే ఏప్రిల్ మాసంలో ఒక్క నోటిఫికేష‌న్ అయిన రావొచ్చున‌ని నిరుద్యోగులు అంచ‌నా వేస్తున్నారు.

నిరుద్యోగులు నిరాశ ప‌డ‌కుండా….

హాట్ టాపిక్ గా మారిన ఉద్యోగుల ప‌ద‌వీ విర‌మ‌ణ అంశంపై హ‌రీశ్ రావు క్లారిటీ ఇచ్చారు. ఉద్యోగుల అనుభవాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఉపయోగించుకుంటుందన్న హరీష్‌రావు.. వయసు పెరిగే కొద్ది.. వారి మరింత అనుభవంతో పనిచేస్తారని తెలిపారు.. ఇక, ఉద్యోగుల జీవన ప్రమాణాలు కూడా పెరిగి.. జీవిత కాలం కూడా పెరిగిందని.. ఇది కూడా ఒక కారణంగా చెప్పుకొచ్చారు.. అందరి సంప్రదింపులతోనే ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చిందని మంత్రి హరీష్ రావు తెలిపారు.

 

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju