NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Elections : నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో విజయం ఎవరి వైపు?

Elections :  ప్రస్తుతం దేశంలో నాలుగు రాష్ట్రాల ఎన్నికలే హాట్ టాపిక్. బిజెపి మళ్లీ దేశవ్యాప్తంగా సత్తా చాటుతోందా లేదా కాంగ్రెస్ పుంజుకుంటుందా…? ప్రాంతీయ పార్టీల ప్రభావం ఎలా ఉంటుంది అని చాలామంది ఎన్నో లెక్కలు మాట్లాడుతున్నారు. అయితే ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ నిర్వహించిన సర్వే ప్రకారం తాజా ఫలితాలు వచ్చేస్తాయి. ఇక తాజా ఎన్నికల అనంతరం బిజెపి పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుందో చూద్దాం. మిగిలిన పార్టీల భవిష్యత్తు ఇలా ఉండవచ్చని సర్వే ఇచ్చిన వివరాల్లోకి వెళ్తే…

 

Elections in four states times now survey
Elections in four states times now survey

Elections : తమిళనాడు

ఏపీ పొరుగు రాష్ట్రంలో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈసారి డీఎంకే-కాంగ్రెస్ మిత్రపక్షాలు బలంగా ఉన్నాయని… ఆ కూటమి విజయం సాధించవచ్చని అర్థం అవుతోంది. ఇక అధికార అన్నాడీఎంకే పై శశికల బయటకు వెళ్లిన తర్వాత ప్రజలకు వారి పై నమ్మకం కోల్పోయింది అని… దీంతో బీజేపీ అన్నాడీఎంకే మిత్రపక్షాలకు దారుణ పరాజయం ఖాయమని టైమ్స్ నౌ సర్వే వెల్లడించింది. కమలహాసన్ తో పాటు ఇతర పార్తీలకు పెద్దగా సీట్లు వచ్చే అవకాశం లేదని తేల్చి చెప్పింది. తాజా సర్వే ప్రకారం కాంగ్రెస్-డిఎంకె కూడికలు 173 నుండి 181 సీట్లలో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారట. ఇక అధికార పార్టీ విషయానికి వస్తే కేవలం నలభై నుండి యాభై మూడు స్థానాలు మాత్రమే వారు సొంతం చేసుకోవచ్చని చెబుతున్నారు,

కేరళ

150 అసెంబ్లీ స్థానాలున్న కేరళలో అనుకున్నట్లే వామపక్ష కూటమి మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని సర్వే తెలిపింది. పినరయ్ ప్రభుత్వం పైన ఎన్ని విమర్శలు ఉన్నప్పటికీ మళ్లీ వారే అధికారంలోకి వస్తారట. కాంగ్రెస్, ఇతర మిత్రపక్షాలకు అయిన యుటిఎఫ్ గతంతో పోలిస్తే ఎక్కువ సీట్లు రావచ్చని కానీ అధికారాన్ని సొంతం చేసుకునే అవకాశం ఏమాత్రం లేదని తేల్చారు. అయితే మార్జిన్ మాత్రం ఈ రెండింటి మధ్య చాలా తక్కువ ఉంది. ఎల్డీఫ్ 77 సీట్లు సొంతం చేసుకుంటే… ఇదే సమయంలో యూడీఎఫ్ 62 సీట్లకు పరిమితం అవుతుందని అంటున్నారు. ఇక్కడ ఇండిపెండెంట్లు, చిన్న పార్టీలు కీలకం కానున్నారు.

Elections : అస్సోం

ఇక్కడ అధికారపక్షంగా భారతీయ జనతా పార్టీ ఉంది. 126 అసెంబ్లీ స్థానాలున్న ఈ రాష్ట్రంలో బిజెపి తిరిగి అధికారం సొంతం చేసుకోబోతుందట. హోరాహోరీగా సాగబోయే ఎన్నికల్లో స్వల్ప అధిక్యతతో బిజెపి అధికారంలో ఉంటుందని సర్వే తెలియజేసింది. కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి గట్టిపోటీ ఇస్తుందని… అయితే ఫలితం మాత్రం ఎన్డీయేకే అనుకూలంగా ఉన్నట్లు తేల్చారు. కాంగ్రెస్ నేత్రత్వంలోని మహాజోత్ కూటమి 52 నుండి 60 స్థానాలు మధ్య గెలుచుకుంటే… ఎన్డీయే 65 నుండి 73 స్థానాలను సొంతం చేసుకోనుందని సర్వే పేర్కొంది

పుదుచ్చెర్రీ

ఈ చిన్న రాష్ట్రంలో 30 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించే అవకాశం ఉందని టైమ్స్ నౌ సర్వే తెలియజేసింది. ఎన్డీఏకు 19 నుండి 23 స్థానాల్లో వచ్చి అధికారం సాధిస్తే కాంగ్రెస్ డీఎంకే 7 నుంచి 11 స్థానాలను మాత్రమే పరిమితం కానున్నట్లు వెల్లడించారు. ఇక తుది ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి..!

Related posts

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు 

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju