NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

YS Sharmila : వైఎస్ షర్మిల కు పొంచి ఉన్న కరోనా ముప్పు

YS Sharmila new party name leak

YS Sharmila :  వైయస్ షర్మిల తెలంగాణలో సొంత పార్టీ పెట్టినప్పటి నుండి తనదైన శైలిలో దూసుకుపోతోంది. ఖమ్మం జిల్లాలోని ఒక కీలకమైన నియోజకవర్గం నుండి పోటీ చేస్తానని ప్రకటించిన షర్మిల ఇప్పుడు ఖమ్మం హెడ్ క్వాటర్స్ లో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు నిర్ణయించుకుంది. ఏప్రిల్ 9వ తేదీన దీనిని భారీ స్థాయిలో నిర్వహించేందుకు కావలసిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. జిల్లా చరిత్రలోనే కనీవినీ ఎరుగని విధంగా ఈ బహిరంగ సభ జరగాలని…. ఇక్కడి నుండి తన రాజకీయ ప్రచారాన్ని మరింత ఘనంగా ముందుకు తీసుకెళ్లాలని ఆమె అనుకుంటున్నారు.

 

YS Sharmila has covid threat
YS Sharmila has covid threat

కనీసం లక్ష మందికి తక్కువ లేకుండా జనం హాజరయ్యే ఏర్పాట్లు కూడా జరగాలని తన మద్దతుదారులకు ఆమె గట్టిగానే సందేశం పంపారు. అయితే తెలంగాణలో ఇప్పుడు ఒక్కసారిగా కరోనా వైరస్ ఊపందుకుంది. రోజుకి ఐదు వందలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లోనే 14 మంది చనిపోయారు. ఒక్కసారిగా వందలాది కరోనా కేసులు వెలుగు చూడడంతో రాష్ట్ర ప్రభుత్వం దీనిని సీరియస్ గా తీసుకుంది. ఇప్పటికే విద్యాసంస్థలన్నింటినీ తెలంగాణలో మూసివేశారు. రానున్న రోజుల్లో పరిస్థితి మరింత తీవ్రంగా తయారయ్యే అవకాశం ఉంది.

ఇక లాక్ డౌన్ మాత్రం విధించే పరిస్థితి లేదని ప్రభుత్వం కన్ఫర్మ్ చేసింది. థియేటర్లు కూడా అలాగే కొనసాగుతాయి కానీ ఇటువంటి భారీ బహిరంగ సభకు మాత్రం పర్మిషన్ దొరక్కపోవచ్చు. అసీ కాకుండా నైట్ కర్ఫ్యూ విధించాలని కూడా తెలంగాణ ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఇప్పుడు ఏప్రిల్ 9వ తేదీన ఖమ్మంలో బహిరంగ సభ నిర్వహణకు ఇదే షర్మిలకు అడ్డుపడవచ్చు అని కొంతమంది అంటున్నారు.

కరోనా వైరస్ ప్రమాదం పెరిగితే మాత్రం బహిరంగ సభకు ఎట్టిపరిస్థితుల్లో అనుమతులు ఇచ్చే అవకాశం ఉండదని… ఇచ్చిన వాటిని రద్దు చేస్తారు అని చెప్పవచ్చు. ఇప్పటికే బహిరంగ సభకు లోటస్పాండ్ వర్గాలు అనుమతులు కోరారు. గ్రౌండ్ మున్సిపల్ డిపార్ట్మెంట్ నుండి అయితే అనుమతులు ఇచ్చారు కానీ పోలీసులు మాత్రం ఈ నేపథ్యంలో షరతులు విధించారు.మాస్క్ లు, శానిటైజర్లు తప్పనిసరి అని చెప్పారు. కానీ అన్నీ అధికారుల నుండి అనుమతులు రావడం మాత్రం కష్టమే.

Related posts

జూన్ 1 వ‌ర‌కు పాల‌న ఎవ‌రిది? చంద్ర‌బాబే అన్నీనా?

ఏపీ చ‌రిత్ర‌లోనే ఇవ‌న్నీ తొలిసారి.. మీరు గ‌మ‌నించారా ?

నాడు గెలిపించి.. నేడు ఓడించేందుకు.. పీకే ప్లాన్‌లో కొత్త ట్విస్ట్ ఇదే..?

ఏపీలో ఇలాంటి ఎన్నిక‌లు ఫ‌స్ట్ టైమ్‌… అదిరిపోయే ట్విస్టులు ఇవే…?

కూట‌మి పార్టీల్లో ఎందుకీ డౌట్‌… ఎందుకింత టెన్ష‌న్‌..?

Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు .. ఏపీ ఆధీనంలోని భవనాల స్వాధీనానికి ఆదేశం

sharma somaraju

Allagadda: మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అనుచరుడిపై హత్యాయత్నం .. కారుతో ఢీకొట్టి మరణాయుధాలతో దాడి .. వీడియో వైరల్

sharma somaraju

EC: ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్ .. సీఎస్, డీజీపీలకు సమన్లు

sharma somaraju

ఏపీలో రికార్డు స్థాయి పోలింగ్ .. అధికారిక లెక్క ప్రకారం 81.76 శాతం

sharma somaraju

జ‌గ‌న్ ఫుల్ రిలాక్స్ అయిపోయారుగా… ఏం చేస్తున్నారో చూడండి..?

Tadipatri: జేసీ అనుచరుడిపై హత్యాయత్నం .. తాడిపత్రిలో ఉద్రిక్తత

sharma somaraju

పోలింగ్ అయ్యాక జ‌గ‌న్‌కు ఆ త‌ప్పు అర్థ‌మైందా… అర‌ర్రే అన్నా లాభం లేదే..?

ఏపీ ఎన్నిక‌ల్లో ఎక్క‌డ‌.. ఎవ‌రు గెలుస్తారు..?

ఎన్నిక‌లు ముగిశాయి.. చంద్ర‌బాబు, ప‌వ‌న్‌కు పెద్ద టెన్ష‌న్ ప‌ట్టుకుందే…?

జ‌గ‌న్ కోసం… జ‌గ‌న్ వెంటే… ఆ ఓట‌రే వైసీపీకీ ప్ల‌స్ అయ్యాడా…!