NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Cm Kcr: సీఎం కేసీఆర్.. మీకిది తగునా..? ప్రతిసారీ హైకోర్టు ఆదేశించాలా..?

telangana high court serious on government

Cm Kcr: సీఎం కేసీఆర్ Cm Kcr  ప్రస్తుతం దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ప్రతిరోజు 3 లక్షలకు పైగా కేసులు, వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి. రాష్ట్రాలన్నీ కుదేలైపోతున్నాయి. పరిస్థితులను కంట్రోల్ చేయడంలో ప్రభుత్వాలు నిమగ్నమయ్యాయి. టెస్టులు, ఆసుపత్రుల నిర్వహణ, బెడ్లు, ఆక్సిజన్ సిలిండర్లు. లాక్ డౌన్, కర్ఫ్యూ, ప్రజల బాధలు.. ఇలా అనేక సమస్యలతో సతమతమైపోతున్నాయి. కేంద్రం కూడా దేశంలో పరిస్థితికి ఉక్కిరిబిక్కిరి అయిపోతోంది. ఇదంతా ఒకెత్తయితే.. తెలంగాణలో పరిస్థితి మరొక ఎత్తు. రాష్ట్రంలోని పరిస్థితులపై హైకోర్టు తీవ్రంగా పరిగణిస్తోంది. ప్రభుత్వం ఇస్తున్న సమాధానాలతో సంతృప్తి చెందట్లేదు. గతేడాది నుంచీ ఇప్పటివరకూ ఇదే పరిస్థితి.

telangana high court serious on government
telangana high court serious on government

తెలంగాణలో కరోనా ఉధృతి ఎక్కువగా ఉందని సోషల్ మీడియాలో నెటిజన్లు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం కరోనా కేసులను తక్కువ చేసి చూపిస్తోందనే కామెంట్లు చేస్తూన్నారు. హైకోర్టు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నోసార్లు చీవాట్లు పెట్టింది. ఓదశలో హైకోర్టు వ్యాఖ్యలు తమను బాధిస్తున్నాయని సీఎం కేసీఆర్ వద్ద అధికారులు వాపోయారనే వార్తలు కూడా గతేడాది వచ్చాయి. ఇంత జరుగుతున్నా ఇప్పటికూ ప్రభుత్వ తీరుపై హైకోర్టు అసహనం వ్యక్తం చేస్తూనే ఉంది. మీరు పట్టించుకుంటారా.. మేమే ఆదేశాలివ్వాలా? అని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మలిదశ విచారణలోనూ ఇదే తంతు. నిజానికి రాష్ట్రంలోని పరిస్థితులను బట్టి ప్రభుత్వమే నిర్ణయాలు తీసుకుంటుంది. కానీ.. ఇక్కడ హైకోర్టు పలు ఆదేశాలు, సూచనలు ఇస్తేనే తప్ప ప్రభుత్వం ముందుకు కదలడం లేదని చెప్పాలి.

లాక్ డౌన్, కర్ఫ్యూపై ఆలోచించండి. ఆర్టీపీసీఆర్ టెస్టు రిపోర్టులు త్వరగా ఇవ్వండి. రోజుకు లక్ష టెస్టులు చేయండి. జిల్లాలో టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేయండి. కరోనాపై నిపుణుల కమిటీ వేయండి. ఆసుపత్రుల వద్ద పోలీసు సహాయ కేంద్రాలు పెట్టండి. పోలీసులకు ప్రత్యేక అధికారాలు ఇవ్వండి. ఫంక్షన్లు, పార్కులు, ధియేటర్లపై ఆంక్షలు విధించండి, శుభకార్యాలు 200, అంత్యక్రియల్లో 50 మంది పాల్గొనే చూడాలి.. అంటూ అదేశాలు సూచనలు నిన్న చేసింది హైకోర్టు. హైకోర్టుతో ఈ విషయాలు చెప్పించుకోకుండా యంత్రాంగాన్ని పరుగులు పెట్టించగల దిట్ట. కానీ.. గతేడాది నుంచీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు, సూచనలు ఇవ్వడం.. ప్రభుత్వం ఇచ్చే సమాధానాలపై ఆగ్రహం వ్యక్తం చేయడమే జరుగుతోంది. కరోనా నుంచి కోలుకున్న కేసీఆర్ మరి ఏం చేస్తారో చూడాలి.

 

Related posts

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు 

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju