NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Telugu Movies 2021: ఈ నాలుగు నెలల్లో హిట్ అయినా బ్రేక్ ఈవెన్ రాని సినిమాల లిస్టు చూసారా..!? షాక్ అవ్వడం గ్యారెంటీ..!

Telugu Movies 2021: కరోనా వైరస్ విజృంభించడంతో అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ ప్రకటించాయి.. దీంతో సినిమా థియేటర్లు మూత పడటంతో.. అన్ని సినిమాలు ఓటీటీ బాట పట్టాయి.. అయితే ఓటీటీ లో సినిమాలు హిట్ అవుతాయా అనే సందేహం లేకపోలేదు.. అయితే 2020 డిసెంబర్ లో వచ్చిన ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా హిట్ కొట్టి ఆ అనుమానాలకు ఫుల్ స్టాప్ పెట్టింది. ఆ తరువాత 2021 సంక్రాంతి కానుకగా విడుదలైన సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబట్టాయి.. ఫ్లాప్ టాక్ వచ్చిన అల్లుడు అదుర్స్, 30 రోజుల ప్రేమించడం ఎలా వంటి సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను సొంతం చేసుకొని పర్వాలేదు అనిపించాయి.. అయితే ఇక టాలీవుడ్ కోలుకున్నట్టే అని అంతా అనుకున్నారు.. కానీ కొన్ని సినిమాలు హిట్ టాక్ వచ్చినప్పటికీ బాక్సాఫీసు వద్ద బ్రేక్ ఈవెన్ కూడా రాలేదు.. హిట్ టాక్ వచ్చి బ్రేక్ ఈవెన్ రాని సినిమాలెంటో ఇప్పుడు తెలుసుకుందాం..!!

Telugu Movies 2021: hit talk but not reach the break even point
Telugu Movies 2021: hit talk but not reach the break even point

1. కపటదారి :

సుమంత్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 19న రిలీజ్ అయిన ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ సాధించలేక పోయింది.. దీంతో ఈ సినిమా కూడా సుమంత్ కెరీర్ లో మరో డిజాస్టర్ గా మిగిలిపోయింది.

Telugu Movies 2021: hit talk but not reach the break even point
Telugu Movies 2021: hit talk but not reach the break even point

2. చెక్ :

చంద్ర ఏలేటి దర్శకత్వంలో నితిన్, ప్రియా ప్రకాష్ వారియర్ జంటగా నటించిన చిత్రం చెక్.. ఈ సినిమా ఫిబ్రవరి 27న విడుదలైంది. ఈ చిత్రం కూడా పాజిటివ్ టాక్ వినిపించినా.. కమర్షియల్ గా సక్సెస్ కాలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ కూడా సాధించలేకపోయింది. నితిన్ కెరీర్ లో మరో డిజాస్టర్ గా నిలిచింది.

Telugu Movies 2021: hit talk but not reach the break even point
Telugu Movies 2021: hit talk but not reach the break even point

3. అక్షర :

నందిత శ్వేత ప్రధాన పాత్రలో రూపొందిన ఈ చిత్రం ఫిబ్రవరి 26న విడుదలైంది. విడుదలైనా ఒక వారం తరువాత ఏం థియేటర్లో కనపడలేదు. మొత్తానికి ఫ్లాప్ గా మిగిలిపోయింది.

Telugu Movies 2021: hit talk but not reach the break even point
Telugu Movies 2021: hit talk but not reach the break even point

4. ఎ1 ఎక్స్ ప్రెస్ :

డెన్నిస్ జీవన్ దర్శకత్వంలో సందీప్ కిషన్ 25వ సినిమాగా తెరకెక్కింది ఎ1 ఎక్స్ ప్రెస్.. ఈ చిత్రం మార్చి 5 న విడుదలైంది. ఈ సినిమా విడుదలైన మొదటి రోజే మంచి టాక్ వచ్చినప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ సాధించలేక పోయింది.. యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకున్నాడు సందీప్ కిషన్.

Telugu Movies 2021: hit talk but not reach the break even point
Telugu Movies 2021: hit talk but not reach the break even point

5. షాదీ ముబారక్ :

మొగలిరేకులు సీరియల్ నటించిన సాగర్ హీరోగా తెరకెక్కిన చిత్రమే షాది ముబారక్.. పద్మశ్రీ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 5 న విడుదలైంది. హిట్ టాక్ ను సంపాదించుకున్నప్పటికీ మంచి కలెక్షన్లు రాబట్టలేకపోయింది. సాగర్ కెరీర్లో డిజాస్టర్ గా మిగిలిపోయింది.

Telugu Movies 2021: hit talk but not reach the break even point
Telugu Movies 2021: hit talk but not reach the break even point

6. శ్రీకారం :

శర్వానంద్ హీరోగా కిషోర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా శ్రీకారం. మార్చి 11న విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ హిట్ కాలేకపోయింది.

Telugu Movies 2021: hit talk but not reach the break even point
Telugu Movies 2021: hit talk but not reach the break even point

7. రంగ్ దే :

నితిన్, కీర్తి సురేష్ జంటగా రూపొందిన సినిమా రంగ్ దే.. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 26న విడుదలై హిట్ టాక్ వచ్చినప్పటికీ బ్రేక్ ఈవెన్ సాధించలేక యావరేజ్ రిజల్ట్ తో సర్దుకు పోయింది.

Telugu Movies 2021: hit talk but not reach the break even point
Telugu Movies 2021: hit talk but not reach the break even point

8. అరణ్య :

రానా హీరోగా ప్రభు సాల్మన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అరణ్య.. ఈ సినిమా మార్చి 26న విడుదలైంది.. మంచి టాక్ వినిపించినప్పటికీ.. బ్రేక్ ఈవెన్ కూడా సాధించలేకపోయింది. మొత్తానికి డిజాస్టర్ గా మిగిలిపోయింది.

Telugu Movies 2021: hit talk but not reach the break even point
Telugu Movies 2021: hit talk but not reach the break even point

9. వైల్డ్ డాగ్ :

నాగార్జున హీరోగా ఆషిషోర్ సాల్మన్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా వైల్డ్ డాగ్.. ఏప్రిల్ 2 న విడుదలైన ఈ సినిమా హిట్ టాక్ వచ్చినా.. క్యాష్ చేసుకోలేకపోయింది. ఫైనల్ గా డిజాస్టర్ గా నిలిచింది.

Telugu Movies 2021: hit talk but not reach the break even point
Telugu Movies 2021: hit talk but not reach the break even point

10. వకీల్ సాబ్ :

పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ తో వచ్చిన సినిమా వకీల్ సాబ్.. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 9న విడుదలైంది. ఈ చిత్రానికి సూపర్ హిట్ టాక్ వచ్చింది. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా థియేటర్లు మూతపడడం, పొలిటికల్ ఇష్యూస్ కారణంగా సినిమా టికెట్ రేట్లు తగ్గించడం వంటివి ఈ చిత్రానికి బ్రేక్ ఈవెన్ రాకుండా చేశాయి. మొత్తానికి ఈ సినిమా అబౌవ్ యావరేజ్ గా నిలిచింది.

Related posts

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

Parthu Telugu OTT: డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి బిగ్ బాస్ బ్యూటీ సైకో థ్రిల్లర్.. 100% గూస్బమ్స్..!

Saranya Koduri

Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Nikhil Swayambhu: ఆ ఒకే ఒక ఫైట్ కోసం ఏకంగా అన్ని కోట్లు ఖర్చు చేసిన నిఖిల్ స్వయంభు టీం..!

Saranya Koduri

Murder In Mahim OTT: ఓటీటీలోకి వచ్చేయనున్న మరో క్రైమ్ మిస్టరీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..!

Saranya Koduri

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Karthika Deepam 2 May 7th 2024 Episode: కొత్త జీవితం మొదలు పెట్టిన దీప.. కార్తీక్ ని అనుమానిస్తున్న జ్యోత్స్న..!

Saranya Koduri