Sonu Sood – Narendra Modi: ఏడాదిలో ఎంత మార్పు..!? సినీ విలన్ హీరో అయ్యారు.. రాజకీయ హీరో దేశానికి విలన్ అయ్యారు..!!

Sonu Sood - Narendra Modi: Villain turned as Hero.. Political hero now Villain
Share

Sonu Sood – Narendra Modi: మనిషిని నడిపించేది రెండే కాలం, డబ్బు.. దీనిలో కూడా డబ్బు ఉన్నా కాలం బాగుంటేనే మనిషి బాగున్నట్టు.., లేకపోతే ఎంత డబ్బు ఉన్నా వృథానే..! అందుకే డబ్బు కంటే మనిషిని నడిపించేది, నిలబెట్టేది కాలం మాత్రమే..! కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు.. మారుతూ ఉంటుంది. తద్వారా మనుషుల భక్తులకు మార్చేస్తూ ఉంటుంది.. చిన్నోల్లని పెద్దోల్లుగా (వయసులో)., పెద్దోళ్ళని చిన్నోళ్లుగా (పరపతిలో) మార్చేస్తూ గేమ్ ఆడుతుంటుంది..! అందుకు గడిచిన ఏడాది కాలమే మంచి ఉదాహరణ. సరిగ్గా గత ఏడాది మార్చి నుండి ఈ ఏడాది మే మధ్యలో దేశంలో ఓ పెద్ద రాజకీయ నేత విలన్ గా మారిపోయారు. సోషల్ మీడియా అతన్ని విపరీతంగా తిట్టుకుంటుంది..! గత ఏడాది నాటికి దేశం మొత్తం తెలియని ఓ సాధారణ సినీ విలన్ ఇప్పుడు దేశం మొత్తం ఆరాధించే హీరో అయిపోయారు..! ఆ ఇద్దరు గురించి కొంచెం లోతుగా చెప్పుకుందాం…

Sonu Sood - Narendra Modi: Villain turned as Hero.. Political hero now Villain
Sonu Sood – Narendra Modi: Villain turned as Hero.. Political hero now Villain

Sonu Sood – Narendra Modi: నరేంద్ర మోడీకి గడ్డుకాలం..!

మోడీ అంటే దేశం మొత్తం హీరో. 2011 నుండి 2019 వరకు దేశంలో యువత, సోషల్ మీడియా మొత్తాన్ని మోడీ శాసించారు. ఆయన ఏం చెప్తే దేశం అదే చేసింది. సర్జికల్ స్ట్రైక్స్ కి జేజేలు పలికింది.. జీఎస్టీ కట్టమంటే కట్టింది.. నోట్లు రద్దు చేస్తామంటే కష్టాన్ని ఎదుర్కొంది.., ఆర్టికల్ 370కి మద్దతిచ్చింది.. చివరికి కరోనా ఆరంభంలో కంచాలు కొట్టమంటే కొట్టింది. దీపాలు పెట్టమంటే పెట్టింది. అలా నరేంద్ర మోడీ ఏం చెప్తే దేశం అదే చేసింది. అటువంటి మోడీకి కొన్ని నెలలుగా గడ్డు కాలం వచ్చేసింది. ప్రస్తుతం ఆయన ఓ విలన్. దేశం మీడియా దృష్టిలో.., దేశం యువత దృష్టిలో.., దేశం సోషల్ మీడియా దృష్టిలో.. నరేంద్ర మోడీ అంటే ఒక విలన్.. దేశాన్ని బాగుంచేయలేని ఓ అసమర్ధుడు.. కరోనా కట్టడి చేయకుండా రాజకీయాలు చూసుకున్న ఓ పచ్చి అవకాశవాది..! అంతగా మోడీకి వ్యతిరేకంగా సోషల్ మీడియా భగ్గుమంటుంది.. ఇది మోడీకే నష్టం తప్ప బీజేపీకి కానేకాదు. బీజేపీలో మోడీ కాకపోతే అమిత్ షా నో.., నడ్డానో.., యోగీ లాంటి వాళ్ళు ఆ స్థానానికి వచ్చేస్తారు. కానీ మోడీ శకం మాత్రం ముగుస్తుంది. ప్రపంచ మీడియా కూడా మోడీని దంచికొటుంది. ఈయన మనిషే కాదు ఆంటూ దారుణ వ్యాఖ్యలు చేస్తుంది..! ఈ విషయాన్నీ కాసేపు పక్కన పెడితే..

Sonu Sood - Narendra Modi: Villain turned as Hero.. Political hero now Villain
Sonu Sood – Narendra Modi: Villain turned as Hero.. Political hero now Villain

సోనూ సూద్ ఓ రియల్ హీరో..!!

సోనూ సూద్ అంటే 2020 ఏప్రిల్ వరకు ఓ నటుడు.. విలన్ వేషాలు వేస్తుంటాడు అని మాత్రం దేశానికి తెలుసు. కానీ అతనిలో ఓ పెద్ద మానవతావాది ఉన్నాడని.., త్యాగం, సాయం అనేదానికి హద్దు ఉండదని.., ఇవ్వడానికి.. ఆపదలో ఉన్నవారిని ఆదుకోడానికి పరిమితులు ఉండవని సోనూ నిరూపించారు. ఏడాది కాలంలో అతని ట్విట్టర్ ఫాలోయర్ల సంఖ్య ఎన్నో రెట్లు పెరిగింది. గత ఏడాది మే నాటికి 15 లక్షలు మాత్రమే ఉన్న ఫాలోయర్ల సంఖ్య ప్రస్తుతం 68 లక్షలకు చేరింది. గూగుల్ లో అతనే ట్రేండింగ్ టాపిక్. గూగుల్ లో సోనూ మంచితనం గురించే చర్చ. మొత్తం 130 కోట్ల వాకు ఆస్తులున్న సోనూ…ఈ ఏడాది కాలంలో సుమారుగా 25 కోట్లు వరకు దాతృత్వానికి ఇచ్చేసి ఉంటారని ఒక అంచనా.. ఇంకా ఇవ్వడానికి సిద్ధమే. తాజాగా ఫ్రాన్స్ నుండి మన దేశానికి ఆక్సిజన్ తెప్పించి కావాల్సిన రాష్ట్రాలకు ఇస్తానంటూ ప్రకటించారు. ఆయన పిలుపునిస్తే దేశంలోని 20 శాతం యువ జనాభా అతని సైన్యంగా ఉండేందుకు సిద్ధంగా ఉంది. అతను అడిగితే తనకు సాయంగా నిలబడేందుకు ఎంతో మంది సెలబ్రెటీలు సిద్ధంగా ఉన్నారు. సచిన్, ముకేశ్ అంబానీ, ధోనీ, విరాట్ కోహ్లీ, షారుఖ్, సల్మాన్ లాంటి ఎంతో మంది ప్రముఖుల కంటే సోనూ సూద్ ఇప్పుడు ఓ ఉన్నత శిఖరం స్థాయిలో నిలబడ్డారు.

* సోషల్ మీడియాలో రెస్పాన్స్.. వివిధ వర్గాల అంచనాలు.., యువత సర్వే నివేదికలు ఏం తీసుకున్న సోనూ ఇప్పటికిప్పుడు రాజకీయాల్లోకి వస్తే దేశం అతనికి అండగా ఉండేందుకు సిద్ధంగా ఉంది. గూగుల్, పేస్ బుక్ వంటి అనేక సోషల్ మీడియా వేదికల్లో, అంతర్జాతీయ మీడియాల్లో సైతం సోనూ గురించి సానుకూల చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇదే సమయంలో ప్రధాని మోడీ గురించి అత్యంత నెగిటివ్ గా ప్రచారం జరుగుతూనే ఉంది..! కాలం అంటే ఇదే. కాలం మనిషిని దించుతుంది. ఎక్కిస్తుంది. కాలంతో పాటూ మంచిని చూపించుకుంటే సోనూలా ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకోవచ్చు..!


Share

Related posts

మాకొద్ది న్యాయం మాకొద్ది జడ్జి : హై కోర్టు జడ్జిలపై జగన్ తిరుగుబాటు

Special Bureau

శిరోముండనం కేసులో కొత్త ట్విస్ట్..!!

somaraju sharma

అభ్యర్థిని ఒప్పించడానికి ఆపసోపాలు : టీడీపీ లో నిస్తేజం

Special Bureau