NewsOrbit
న్యూస్

Brahmamgari Matam: బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి నియామక వ్యవహారం! మహాలక్ష్మమ్మ వర్సెస్ మఠాధిపతులుగా మారిన వైనం!!

Brahmamgari Matam: కాలజ్ఞాని వీర బ్రహ్మేంద్ర స్వామి మఠం నూతన పీఠాధిపతి నియామక వ్యవహారంలోమఠాధిపతులపై ఫిర్యాదులు, సంచలన ఆరోపణలు చోటుచేసుకున్నాయి.మఠం పీఠాధిపతి నియామకానికి సన్నాహాలు చేస్తున్న మఠాధిపతుల బృందంపైన ఫిర్యాదు చేస్తూ వీర భోగ వసంత వెంకటేశ్వర స్వామి రెండో భార్య మారుతి మహాలక్ష్మమ్మ ఆంధ్రప్రదేశ్ డీజీపీకి ఒక లేఖ రాసింది.ఈ నేపథ్యంలో విశ్వకర్మ పరిరక్షణ వేదిక అధ్యక్షుడు,శ్రీ శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి మీడియా సమావేశంలో వీర భోగ వసంత వెంకటేశ్వరస్వామి మరణంపైనే సంచలన ఆరోపణలు చేశారు.దీంతో పీఠాధిపతి నియామకం వ్యవహారం కొత్త మలుపు తిరిగింది.

Brahmamgari Matam Controversy
Brahmamgari Matam Controversy

Brahmamgari Matam: వివాదం ఏంటంటే?

ఇటీవల బ్రహ్మంగారి మఠం మఠాధిపతి వీర భోగ వసంత వెంకటేశ్వర స్వామి శివైక్యం చెందారు.నూతన మఠాధిపతిగా మరణించిన వేంకటేశ్వరస్వామి పెద్ద భార్య కుమారుడు వెంకటాద్రి స్వామిని నియమించాలని మఠాధిపతులు నిర్ణయించారు.ఇది మఠంలో అనుసరిస్తున్న సాంప్రదాయమని, వారసత్వానికి ప్రాధాన్యం ఉంటుందని వారు గతంలోనే తేల్చి చెప్పారు.అయితే వేంకటేశ్వరస్వామి రెండో భార్య మహలక్ష్మమ్మ తన కుమారుడిని పీఠాధిపతి చెయ్యాలని వాదిస్తున్నారు. ఈ మేరకు మరణించిన తన భర్త వీలునామా రాశారని ఆమె చెబుతున్నారు.అయితే మఠాధిపతులు ఇందుకు అంగీకరించడం లేదు.ధర్మశాస్త్రం ప్రకారం మఠాధిపతి ఎంపిక విషయంలో తొలి భార్య సంతానానికి వారసత్వం వర్తిస్తుందని,తొలి భార్యకు సంతానం లేనిపక్షంలోనే రెండవ భార్య సంతానానికి అవకాశముంటుందని శివస్వామి తేల్చి చెప్పారు.ఇక్కడ మొదటి భార్యకు సంతానం ఉన్నందున ,రెండో భార్య సంతానానికి అవకాశం ఉండదని, పైగా మఠాధిపతి నియామకానికి వీలునామాలు చెల్లవని ఆయన వివరించారు. మఠాధిపతుల బృందం అన్ని వర్గాల అభిప్రాయాలు సేకరించగా అందరూ కూడా తొలి భార్య కుమారుడు వెంకటాద్రి స్వామినే పీఠాధిపతిని చేయాలని సూచించారని శివస్వామి తెలిపారు.

రెండో భార్య అభ్యంతరం!డీజీపీకి ఫిర్యాదు

అయితే మఠాధిపతుల ప్రతిపాదనకుకి రెండో భార్య అభ్యతరం తెలిపింది. వీలునామా ప్రకారం తన కుమారుడినే పీఠాధిపతి చెయ్యాలని వాదించింది.కానీ ఇందుకు మఠాధిపతులు అంగీకరించకపోవడంతో ఆమె వారిపైనే ఫిర్యాదులు చేస్తూ డీజీపీకి ఒక లేఖ రాసింది.దీనిపై మండిపడ్డ శివస్వామి పలు సంచలన ఆరోపణలు చేశారు.

మఠాధిపతి మృతిపై శివస్వామి అనుమానాలు!

‍అసలు మఠాధిపతి వీరభోగ వసంత వెంకటేశ్వరస్వామి మృతిపైనే తమకు అనుమానాలున్నాయని శివస్వామి చెప్పారు.కుటుంబ పరమైన ఒత్తిళ్ల కారణంగానే ఆయన అనారోగ్యానికి గురై మరణించారని స్థానికులు సైతం చెబుతున్నారన్నారు.అంతేగాక మఠాధిపతి నివాసంలో పనిచేస్తున్న చంద్రావతమ్మ అనే మహిళ ఆయన మరణానంతరం కనిపించకుండా పోయిందని వెల్లడించారు.మఠానికి భక్తులు సమర్పించిన కానుకల విషయంలో కూడా అక్రమాలు జరిగినట్లు,అవి దుర్వినియోగమైనట్లు కూడా ఆరోపణలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.వీటన్నిటిపై పోలీసులు తక్షణమే విచారణ చేపట్టాలని శివస్వామి కోరారు. శివస్వామి ఆరోపణలన్నీ వీరభోగ వసంత వెంకటేశ్వరస్వామి రెండో భార్యను ఉద్దేశించి చేసినవిగానే చెప్పవచ్చు.ఇంకా ఈ వ్యవహారం ఎటువంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.

 

Related posts

Arvind Kejrival: సీఎం కేజ్రీవాల్ పీఎస్ బిభవ్ కుమార్ అరెస్టు .. కేజ్రీవాల్ ఏమన్నారంటే..?  

sharma somaraju

గన్నవరం ఎయిర్ పోర్టులో ఎన్ఆర్ఐ వైద్యుడు లోకేశ్ నిర్బంధం, విడుదల .. అసలు ఏమి జరిగిందంటే ..?

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆ బీఆర్ఎస్ నేతను ఎందుకు అరెస్టు చేయడం లేదు ?: బీజేపీ నేత రఘునందనరావు

sharma somaraju

Telangana EAPCET: ఈఏపీ సెట్ ఫలితాలు విడుదల – టాప్ టెన్ ర్యాంకర్లు వీరే

sharma somaraju

SIT: విచారణ ప్రారంభించిన సిట్ ..రాజకీయ నేతలు, అధికారుల్లో గుబులు

sharma somaraju

EC: పల్నాడు కలెక్టర్, మూడు జిల్లాలకు ఎస్పీలను నియమించిన ఈసీ

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధి కన్హయ్య కుమార్ పై దాడి .. దాడికి కారణం అదేనా..?

sharma somaraju

Siddhu Jonnalagadda: టిల్లు స్క్వేర్ స‌క్సెస్ తో భారీగా పెరిగిన సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ రెమ్యున‌రేష‌న్‌.. ఇప్పుడెన్ని కోట్లంటే..?

kavya N

Road Accident: పెళ్లి వేడుకలకు సిద్ధమవుతున్న వేళ ఘోర విషాదం .. వరుడు సహా అయిదుగురు దుర్మరణం

sharma somaraju

Serial Actor Chandrakanth: ప‌విత్ర‌తో ఐదేళ్లుగా స‌హ‌జీవ‌నం.. క‌ట్టుకున్న భార్య‌కు అన్యాయం.. చంద్రకాంత్ గురించి వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

Malla Reddy: స్థలాన్ని ఆక్రమించుకుంటున్నారంటూ మాజీ మంత్రి మల్లారెడ్డి ఫైర్ .. సుచిత్ర పరిధిలో ఉద్రిక్తత

sharma somaraju

Prasanna Vadanam: ఆహాలో అల‌రించ‌బోతున్న సుహాస్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ప్ర‌స‌న్న‌వ‌ద‌నం.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!

kavya N

వైసీపీ Vs టీడీపీ: ఈ ఐదే ఓట‌ర్ల‌ను తిక‌మ‌క పెట్టాయా ?

ఏపీ వార్‌: ఈ విధ్వంసం వెన‌క ఎక్క‌డ .. ఏం జ‌రిగింది ?

లోకేష్ కోసం.. మ‌రో ఐదేళ్లు వెయిట్ చేయాల్సిందేనా..!