NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bomb: ఖాళీగా ఉండి బాంబు తయారుచేసి పోలీసులకు ఇచ్చాడు..! ఆతర్వాత

Six Marriages Case in Hyderabad:

Bomb: బాంబ్ Bomb: కరోనా చేసిన గాయంతో ఓ యువకుడికి ఉపాధి లేక ఆదాయం కోల్పోయాడు. ఏంచేయాలో తెలీక యూట్యూబ్ వీడియోలు చూసి చేసిన పని అతనితో ఊచలు లెక్కపెట్టిస్తోంది. ఇంతకీ ఆ యువకుడు చేసిన పని.. ‘బాంబు తయారు చేయడం’. మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో జరిగిందీ ఘటన. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ‘నాగ్ పూర్ కు చెందిన రాహుల్ పగారే అనే 25 ఏళ్ల యువకుడు ఓ సెలూన్ షాపులో పని చేసేవాడు. తల్లిదండ్రులు ఇటివలే మరణించారు. ముగ్గురు అక్క చెల్లెళ్లకు పెళ్లిళ్లు అయ్యాయి. దీంతో రాహుల్ ఒంటరి అయ్యాడు. లాక్ డౌన్ కారణంగా ఉపాధి పోయింది. ఏం చేయాలో తెలీలేదు. చివరికి ఓ బాంబు చేయాలని సంకల్పించాడు’.

man went to police station with bomb
man went to police station with bomb

‘యూట్యూబ్ వీడియోలు చూశాడు. పనికిరాని పాత వస్తువులతో ఓ బాంబు తయారు చేశాడు. కానీ.. ఏం చేయాలో తెలీక.. బాంబు తీసుకుని నందన్ వన్ పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. తనకు బాంబు దొరికిందని చెప్పి ఓ బ్యాగ్ ఇచ్చాడు. సమీపంలోని కేడీకే కాలేజ్ వద్ద దొరికందని చెప్పాడు. ఎస్ఐ మహ్మద్ షేక్ అతను చెప్పిన మాటలు నమ్మలేదు. నిర్మానుష్య ప్రాంతంలో బాంబు దొరకడం కట్టుకథలా అనిపించింది. దీంతో తమదైన శైలిలో విచారించారు. దీంతో ఆ బాంబును యూట్యూబ్ వీడియోలు చూసి తానే తయారు చేశానని ఒప్పుకున్నాడు. ఆ బాంబు పేలుతుందని కూడా తెలిపాడు. స్పందించిన పోలీసులు వెంటనే బాంబ్ స్కాడ్ ని పిలిపించి టెస్ట్ చేయించారు’.

Read More: Lovers: 11 ఏళ్లుగా ప్రేమికుల రహస్య కాపురం..! ఒకే గదిలో.. అదే ఇంట్లో.. ఫ్యామిలీకి తెలీకుండా

‘పరిశీలించిన బృందం.. ఆ బాంబ్ లో డిటోనేటర్ గానీ.. జిలెటిన్ స్టిక్స్ కానీ లేవని తేల్చారు. ఫైర్ క్రాకర్స్ పేలడానికి ఉపయోగించే గన్ పౌడర్, పెట్రోల్ ను ఓ ప్లాస్టీక్ డబ్బాలో పెట్టాడు. పాత చైనీస్ మొబైల్ లోని బ్యాటరీని ఉపయోగించాడు. చైనా బొమ్మను లైట్ వెలిగించేందుకు ట్రై చేశాడు. ఇది పేలిపోయే బాంబ్ కాదు. తన సోదరి మొబైల్ లో వీడియోలు చూసి తయారు చేశాడు. అయినా.. పోలీసులు అప్రమత్తమై.. ఇంటిలిజెన్స్ డిపార్ట్ మెంట్ ని, స్టేట్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ని అప్రమత్తం చేసింది. కోర్టు పగారేని రెండు రోజులు పోలీసు కస్టడీకి ఇచ్చింది. ప్రస్తుతం విచారణ జరుగుతోంది’ అని తెలిపారు.

 

author avatar
Muraliak

Related posts

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N