Sonam kapoor : హిందీ చిత్ర పరిశ్రమ నుంచి చాలా మంది హీరోయిన్స్ ఇప్పటికే సౌత్ సినిమా ఇండస్ట్రీలకి వచ్చి బాగానే పాపులారిటీని సాధిస్తున్నారు. గతంలో సుస్మితా సేన్, టబు లాంటి వాళ్ళు వచ్చి తెలుగులో సూపర్ హిట్ సినిమాలలో నటించారు. కానీ అప్పట్లో ఎక్కువగా తమిళ, కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వారే ఉన్నారు. కానీ ఇప్పుడు సినిమాల రేంజ్ పెరిగిపోయింది. అందరు హీరోలు పాన్ ఇండియన్ సినిమాలని భారీ బడ్జెట్ సినిమాలను ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సినిమా కథ దగ్గర్నుంచి ప్రతీ విషయంలో పాన్ ఇండియన్ స్టాండర్డ్స్ ఉండాలని చూసుకుంటున్నారు.
అందుకే ఎక్కువగా ఇప్పుడు తెలుగు, తమిళంలో రూపొందుతున్న సినిమాలలో బాలీవుడ్ హీరోయిన్స్ ఉండాలని మేకర్స్ భావిస్తున్నారు. అందుకే భారీ రెమ్యునరేషన్ ఇచ్చి హిందీ ఇండస్ట్రీలో స్టార్స్ గా వెలుగుతున్న వారిని తమ సినిమాలలో లాక్ చేసుకుంటున్నారు. తెలుగులో పరిచయం అయినా బాలీవుడ్ లో స్టార్ గా వెలుగుతోంది కియారా అద్వానీ. ఈమెను మళ్ళీ టాలీవుడ్ కి తెచ్చే ప్రయత్నాలు సాగుతున్నాయి. బాలీవుడ్ బ్యూటీ అయినా అక్కడ కంటే టాలీవుడ్ లోనే ఎక్కువ సినిమాలు చేస్తూ పాన్ ఇండియన్ రేంజ్ లో హీరోయిన్ గా పాపులర్ అయింది పూజా హెగ్డే.
Sonam kapoor : సోనం కపూర్ ఇక్కడ ఎంట్రీ ఇవ్వాలనుకుంది.. కానీ కుదరలేదు.
నాగ్ అశ్విన్ ప్రభాస్ తో ఒక సైన్స్ ఫిక్షన్ చేయనున్న విషయం అందరికీ తెలిసిందే. సి అశ్వనీ దత్ భారీ బడ్జెట్ కేటాయించి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ అలాగే బాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ దీపిక పడుకోణ్ ని తీసుకున్నారు. 20 కోట్ల రెమ్యునరేషన్ ఇస్తున్నట్టు టాక్ ఉంది. ఈ క్రమంలో అనిల్ కపూర్ కూతురు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనం కపూర్ ఇప్పుడు తెలుగు సినిమా లేదా తమిళ సినిమాలలో నటించే అవకాశాల కోసం వెయిట్ చేస్తోంది. ఈ రెండు సినిమా ఇండస్ట్రీస్ నుంచి పిలుపొస్తే సినిమాకి సైన్ చేయడానికి ఆసక్తిగా ఉందట. ఇంతక ముందు సోనం కపూర్ ఇక్కడ ఎంట్రీ ఇవ్వాలనుకుంది.. కానీ కుదరలేదు.