ట్రెండింగ్ న్యూస్ సినిమా

Peanut Diamond: పీనట్ డైమండ్ ట్రైలర్ విడుదల చేసిన క్రిష్ జాగర్లమూడి..!!

Share

Peanut Diamond: అభినవ్ సర్దార్ పటేల్, రామ్ కార్తీక్, చాందిని తమిళ రసన్, చెర్రీ అగర్వాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం “పీనట్ డైమండ్”.. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాతో వెంకటేష్ అపర్ణ దర్శకుడిగా పరిచయమవుతున్నారు.. తాజాగా ఈ సినిమా టీజర్ ను ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి విడుదల చేశారు..!! క్రిష్ ఈ టీజర్ ను విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది, ఈ పీనట్ డైమండ్ టీం అందరికీ ఆల్ ద బెస్ట్ అంటూ రిలీజ్ చేశారు..!!

Peanut Diamond: Trailer released by Krish Jagarlamudi
Peanut Diamond: Trailer released by Krish Jagarlamudi

Read More: Paris: ఈ సొరంగ మ్యూజియం చూడటానికి గట్స్ ఉండాలి.. సందర్శించడానికి మీరు సిద్ధమా..

త్రేతాయుగంలో మంచి చెడు అనేవి రామ, రావణల రూపంలో ఒకే ప్రపంచంలో ఉంది. ద్వాపరయుగంలో పాండవులు, కౌరవుల రూపంలో ఓకే కుటుంబంలో ఉంది. కానీ ఈ కలియుగంలో లంక లాంటి ఇల్లు ఇంటి చుట్టూ కాపలాదారులు పది తలల రావణుడికి ఉన్న శక్తి, సామర్థ్యాలు ఆ బలరామరాజుకి ఉన్నాయి. వాడు రావణాసుదు అయితే నేను అసురుడిని మించిన అసురుడినిరా.. సూరినిరా.. అంటూ ఈ ట్రైలర్ ప్రారంభమవుతోంది.. మీ సమస్యకు పరిష్కారం 30 ఏళ్ల క్రితం ఒక మనిషి మెదడులో ఆలోచన రూపంలో వచ్చింది అంటూ శుభలేఖ సుధాకర్ చెప్పిన డైలాగ్ అందర్నీ ఆకట్టుకుంటోంది. డైమండ్ ని తయారు చేయాలనే ఆలోచన వాడికి ఆ రోజే మొదలైంది అంటూ ఈ ట్రైలర్ ముగుస్తుంది.. ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామా ట్రైలర్ విశేషంగా ఆకట్టుకుంటోంది ట్రైలర్ తోనే ఈ సినిమా కథ చెప్పకనే చెబుతోంది.. ఏ ఎస్పీ మీడియా హౌస్ జీవి ఐడియాస్ బ్యానర్లపై అభినవ్ సర్దార్ వెంకటేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు.


Share

Related posts

ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది దేవుడికి కానుకగా ఏమి ఇచ్చాడో తెలుసా ..

bharani jella

ప్రభాస్ ఇలా చేయడం ఎంతవరకూ కరెక్ట్ అని మెంటలెక్కిపోతున్నారట ..?

GRK

Athulya Ravi Holi Images

Gallery Desk