NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Sharmila Party: షర్మిల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ శిష్యురాలు ప్రియ ! అన్నకు మాదిరి చెల్లెలికి వర్కవుట్ అయ్యేనా?

YS Sharmila Party: రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ గత ఏపి అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైసీపీ అధినేత, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి కోసం పని చేసిన సంగతి తెలిసిందే. జగన్ సోదరి వైఎస్ షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీని త్వరలో ఆవిర్భావం చేస్తున్న నేపథ్యంలో షర్మిల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ టీమ్ సభ్యురాలు ప్రియను నియమించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణలో రాజకీయ కార్యక్రమాలను నిర్వహిస్తున్న వైఎస్ షర్మిల ఈ నెల 8వ తేదీన   తెలంగాణలో రాజన్న రాజ్యం స్థాపనే లక్ష్యంగా వైఎస్ఆర్ టీపీ పేరుతో పార్టీ ప్రకటన చేయనున్నారు.

YS Sharmila Party political strategist priya
YS Sharmila Party political strategist priya

Read More: Uttarakhand Crisis: ఉత్తరాఖండ్ సీఎం తీరత్ సింగ్ రావత్ రాజీనామా..! ఎందుకంటే..?

షర్మిల పార్టీ వ్యూహకర్తగా ఎంపిక చేసుకున్న ప్రశాంత్ కిషోర్ (పీకే) టీమ్ సభ్యురాలు ప్రియ తమిళనాడు కు చెందిన డీఎంకే ఎమ్మెల్యే రాజేంద్రన్ కుమార్తె. పీకే టీమ్ లో సీనియర్ గా ఉన్న ప్రియ శుక్రవారం తన టీమ్ తో సహా లోటస్ పాండ్ లో షర్మిలను కలిసి వైఎస్ఆర్ టీపీ కోసం పని చేసేందుకు ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. పీకే వ్యూహ రచనతో ఏపిలో వైఎస్ జగన్మోహనరెడ్డి నేతృత్వంలోని వైసీపీ గతంలో ఎన్నడూ ఏ రాజకీయ పార్టీ సాధించని విధంగా 151 అసెంబ్లీ స్థానాలు కైవశం చేసుకున్న విషయం తెలిసిందే.

 

కాగా ఇటీవల కాలం వరకూ తెలంగాణలో అధికార టీఎస్ఆర్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీ ఎదుగుతుండగా వైఎస్ఆర్ టీపీ పేరతో వైఎస్ షర్మిల రాజకీయ పార్టీ ఏర్పాటు, దానికి తోడు ఫైర్ బ్రాండ్ నేత రేవంత్ రెడ్డికి పీసీసీ పగ్గాలు చేబూనిన నేపథ్యంలో చతుర్ముఖ పోటీ అనివార్యమవుతోంది. తెలంగాణ లో రెడ్డి సామాజికవర్గంతో పాటు దివంగత నేత వైఎస్ఆర్ అభిమానులు గుండు గుత్తాగా వైఎస్ షర్మిల వైపు వెళతారు అనుకుంటున్న తరుణంలో రేవంత్ రెడ్డికి పీసీసీ అధ్యక్షుడుగా నియమితులు కావడంతో సీన్ కొంత వరకు మారింది. వైఎస్ఆర్ కు వీరవిధేయులైన కొండా సురేఖ దంపతులు వైఎస్ షర్మిలకు జై కొట్టకుండా రేవంత్ రెడ్డికి మద్దతు పలికారు. ఈ పరిణామంతో వైఎస్ఆర్ అభిమానులు అంతా షర్మిల వెంట నడుస్తారు అని చెప్పలేని పరిస్థితి. తెలంగాణలో జరిగే చతుర్ముఖ పోటీలో పీకే శిష్యురాలు ప్రియ రాజకీయ వ్యూహాలు షర్మిల పార్టీకి ఎంత వరకు వర్క్ అవుట్ అవుతాయా వేచి చూడాలి.

Related posts

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !