NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP CM YS Jagan: ఏపిలో నూతన విద్యావిధానంపై సీఎం జగన్ సమీక్ష..! కీ పాయింట్స్ ఇవే..!!

AP CM YS Jagan review meeting education department

AP CM YS Jagan: ఏపిలో నూతన విద్యావిద్యానంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. కొత్త విద్యావిధానంలో ఆరు రకాలుగా పాఠశాలలను వర్గీకరణ చేయనున్నట్లు సీఎం జగన్ తెలిపారు. పీపీ – 1 నుండి 12వ తరగతి వరకు ఆరు రకాలుగా వర్గీకరణ ఉంటుందని వివరించారు. వర్గీకరణతో 14 వేల పాఠశాలలు అదనంగా అవసరమని అధికారులు ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ కు తెలియజేశారు.

AP CM YS Jagan review meeting education department
AP CM YS Jagan review meeting education department

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ పాఠశాలల్లో విద్యార్థుల నిష్పత్తికి తగినట్లుగా ఉపాధ్యాయులు ఉండాలన్నారు. ఉపాధ్యాయుల అనుభవం, భోదనలో వారికి ఉన్న నైపుణ్యాన్ని వినియోగించుకోవాలన్నారు. ఈ నెల 16న పశ్చిమ గోదావరి జిల్లా లో విద్యాకానుక ప్రారంభం కానుందని తెలిపారు. విద్యార్థుల సంఖ్యకు తగినట్లుగా ఉపాధ్యాయులను ఉంచడంపై తయారు చేసిన ప్రతిపాదనలను అధికారులు సీఎంకి వివరించారు. మూడవ తరగతి నుండి నిపుణులైన ఉపాధ్యాయుల ద్వారా విద్యాబోధన జరగాలన్నారు. ప్రపంచ స్థాయి పోటీకి తగినట్లుగా విద్యార్థులు తయారవుతారని చెప్పారు. ఇంగ్లీషు మీడియంలో బోధన అందుతుందని, తెలుగును తప్పనిసరి సబ్జెక్ట్ గా బోధించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.

నూతన విద్యా విధానం, నాడు – నేడు కోసం రూ.16వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. నూతన విద్యా విధానంపై అందరిలోనూ అవగాహన తేవాలని, నూతన విద్యా విధానం ఉద్దేశాలను వివరంగా తెలియజేయాలని సీఎం అధికారులకు సూచించారు. కలెక్టర్ లు, జెసీలు, డీఈఓలు, పీడీలకు అవగాహన కల్పించాలన్నారు. అమ్మఒడి, ఇంగ్లీషు మీడియం, నాడు – నేడు వల్ల క్షేత్రస్థాయిలో గణనీయమైన ఫలితాలు వస్తున్నాయని అధికారులు సీఎం జగన్ కు వివరించారు. సమావేశంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, విద్యాశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Related posts

Arvind Kejriwal: దేశంలో అధికారంలోకి వచ్చేది ఇండియా కూటమి ప్రభుత్వమే .. అరవింద్ కేజ్రీవాల్

sharma somaraju

AP Elections 2024: వైసీపీ అభ్యర్ధి వంగా గీత కార్యాలయాన్ని ముట్టడించిన ఓటర్లు .. ఎందుకో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..!

sharma somaraju

Bomb Threat: ఢిల్లీ ఎయిర్ పోర్టు, ఆసుపత్రులకు బాంబు బెదిరింపులు

sharma somaraju

ఆ మూడు రిజ‌న్లు… చింత‌మ‌నేని గెలుపును నిర్ణ‌యిస్తున్నాయా..?

IPL 2024: ఆర్సీబీ ప్లేయర్ల భార్య‌ల‌ను ఎప్పుడైనా చూశారా.. వారు ఏయే రంగాల్లో ఉన్నారో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

POK: పాక్ ఆక్రమిత కశ్మీర్ లో విధ్వంసం .. భద్రతా దళాలను తరిమితరిమి కొట్టిన ఆందోళనకారులు .. వీడియోస్ వైరల్

sharma somaraju

Ravi Teja: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బిగ్ హిట్ కొట్టిన ర‌వితేజ‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదంటే?

kavya N

Kona Venkat: సినీ రచయిత కోన వెంకట్ పై బాపట్లలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు.. ఎందుకంటే ..?

sharma somaraju

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

CM Revanth Reddy: విద్యార్ధులతో ఫుట్ బాల్ ఆడిన సీఎం రేవంత్ .. వీడియో వైరల్

sharma somaraju

Aparichithudu: మ‌ళ్లీ వ‌స్తున్న అప‌రిచితుడు.. ఎన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

జగన్ టీమ్‌లో ఈ పెద్ద లీడర్లు గెలవడం కష్టమేనా ?

విజయమ్మతో చివరి బాణం వదిలిన షర్మిల.. ?

మెగా ఫ్యామిలీని రెండు ముక్క‌లు చెక్క‌లు చేసిందెవ‌రు..?

అల్లు అర్జున్‌ ప్రచారం.. బాబుకి ఫ్రస్టేషన్ ..?