NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Jagananna Vidya Deevena: ఆ అంశాలపై ప్రభుత్వం వెనక్కు తగ్గేది లే..!!

Jagananna Vidya Deevena: జగనన్న విద్యాదీవెన నిధులను విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో కాకుండా కళాశాలల యాజమాన్యాల ఖాతాల్లో జమ చేయాలని ఇటీవల హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. అదే విధంగా ఇంటర్ ఆన్ లైన్ అడ్మిషన్ల విధానంను హైకోర్టు రద్దు చేసింది. అయితే ఈ రెండింటి విషయాల్లో ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో ఉంది. వీటిపై హైకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ap cm ys jagan review on Jagananna Vidya Deevena issue
ap cm ys jagan review on Jagananna Vidya Deevena issue

ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి మంగళవారం విద్యాశాఖలో నాడు – నేడు, ఫౌండేషన్ స్కూళ్లపై సమక్ష జరిపారు. నూతన విద్యావిధానం అమలుపై అన్ని రకాలుగా సిద్ధం కావాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. కనీసం మూడవ తరగతి నుండి సబ్జెక్ట్ ల వారీగా ఉపాధ్యాయులు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అన్ని రకాల పాఠశాలలు సీబీఎస్ఈ అఫిలియేషన్ ఉండేలా చర్యలు తీసుకోవాలనీ, ఐసీఎస్ఈ అఫిలియేషన్ మీద కూడా దృష్టి పెట్టాలని సీఎం స్పష్టం చేశారు. వచ్చే ఏడాది స్కూళ్లకు వెళ్లే నాటికి విద్యాకానుక అందించాలనీ, విద్యాకానుక కింద ఇచ్చే వస్తువులు నాణ్యతగా ఉండాలని సీఎం జగన్ ఆదేశించారు. ఇదే సందర్భంలో జగనన్న విద్యాదీవెన, ఇంటర్ ఆన్ లైన్ అడ్మిషన్ల విధానంపై హైకోర్టు తీర్పుపై సమీక్ష జరిపారు. అనంతరం ప్రభుత్వ నిర్ణయాలను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.

జగనన్న విద్యాదీవెన విషయంలో హైకోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ వేయాలని సమావేశంలో సీఎం నిర్ణయించినట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం, పారదర్శకత కోసమే సీఎం జగన్ ఆదేశాల మేరకు తల్లుల ఖాతాలో నగదును జమ చేసే విధానాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. విద్యార్థుల తల్లుల ఖాతాలో నగదు జమ చేయడం వల్ల కలిగే లబ్ది తెలియజేస్తూ జగనన్న విద్యాదీవెన ను యథాతధంగా అమలు చేయాలని రివ్యూ పిటిషన్ లో కోర్టును కోరతామన్నారు. ఇక హైకోర్టు ఆదేశాల మేరకే ఇంటర్ ఆన్ లైన్ అడ్మిషన్లు చేస్తున్నామనీ, దీన్ని నిలుపుదల చేయాలని కోర్టు ఇచ్చిన ఆదేశాలు తమకు ఇంకా అందలేదన్నారు. ఆన్ లైన్ అడ్మిషన్ల విధానం అమలు వెనుక ఉద్దేశం, ప్రయోజనాలను వివరిస్తూ ఈ విధానాన్ని అమలుకు అవకాశం ఇవ్వాలని హైకోర్టును కోరతామని చెప్పారు మంత్రి సురేష్.

 

Related posts

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N