NewsOrbit
న్యూస్

CHILD BORN: ఆ వ్యాధి తోనే వృద్ధురాలిగా జన్మించిన చిన్నారి.. అసలు మ్యాటర్ ఏమిటంటే …?

Share

CHILD BORN:కొన్నిసార్లు పుట్టిన పిల్లలు వింతగా పుడితే ఆ తల్లికి ఉండే భాదని మాటల్లో చెప్పలేం. ఎందుకంటే 9 నెలలు తన కడుపులో మోసి, అలా ఉండాలి, ఇలా ఉండాలని, భవిషత్తులో ఎలా ఉండాలి అనేది ఆ తల్లి గొప్పగా ఊహించుకుంటుంది. 9 నెలల తరువాత పుట్టిన బిడ్డ కేరింతలు కొడుతూ అరుస్తుంటే కడుపులో మోసిన 9 నెలల కష్టం కూడా మరిచిపోయి ఆ బిడ్డను చూస్తూ ఆనందంగా ఉంటుంది. అలాకాక బిడ్డ పుట్టడమే అనారోగ్యంగా జన్మిస్తే ఇక ఆ తల్లి తల్లడిల్లుతోంది. ఇప్పుడు ఇలాంటి సంఘటనే దక్షిణాఫ్రికాలో జరిగింది. ఓ మహిళకు శిశువు జన్మించింది. అయితే ఆ శిశువు వృద్దాప్య లక్షణాలతో ఉండడంతో అక్కడున్న ఎవరు ఏమి మాట్లాడలేకపోయారు. ఆ బిడ్డను చూసిన తల్లి కొంచెం కూడా స్పందించడం లేదు. ఆమె మానసిక పరిస్థితి బాగాలేకపోవడంతో స్పందించడం లేదు. అయితే పుట్టిన శిశువు తల్లి కంటే పెద్ద వయస్సు ఉన్నట్టు కనిపిస్తోంది. ఆ శిశువుని చూసిన అక్కడి స్థానికులు విచారం వ్యక్తం చేసారు. ప్రస్తుతం ఆ పాప ఫోటోలు సిసిల మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

BREAKING: ఎంసెట్ రిలీజ్ డేట్ ప్రకటించిన ఏపీ ప్రభుత్వం.. ఎప్పుడంటే..?

ఈ పాప దక్షిణాఫ్రికా తూర్పు కేప్ లోని లిబోడ్ కు చెందిన గ్రామంలో మానసిక వికలాంగురాలైన మహిళకు జూన్ లో జన్మించింది. ఈ చిన్నారి ఒక వ్యాధితో భాదపడుతోంది. అయితే ఇటువంటి వ్యాధి చాలా తక్కువ మందికి ఉంటుందట. పాప జన్మించినగానే ఎదో లోపం ఉందని పాప అమ్మమ్మ గుర్తించింది. వెంటనే పాప అమ్మమ్మ శిశువుని ఆసుపత్రికి తీసుకెళ్లి అన్ని పరీక్షలు చేయించింది. ఇది ప్రగతిశీల జన్యుపరమైన వ్యాధి అని వైద్యులు చెప్పారు. ఈ వ్యాధి ఎందుకు వచ్చింది అని అడగగా బిడ్డ తల్లి ఆరోగ్య స్థితి వల్లే వచ్చిందని తెలిపారు.
BREAKING: కూర బాలేదన్నాడని భర్త తల పగలగొట్టిన భార్య..!

తూర్పు కేప్ ప్రావిన్షియల్ లెజిస్లేచర్ సభ్యుడిగా ఉన్న సిఫోకాజి మణి లుసితి, ప్రొజిరియాతో జన్మించిన చిన్నారిని చూసి ఎవరు ఎగతాళి చేయొద్దని విజ్ఞప్తి చేసారు. వీలైతే సహాయం చేసి మద్దతుగా నిలవాలే కానీ వారిని ప్రశ్నలతో, మాటలతో హింసించవద్దని కోరారు.

Ycp Leader Arrest: 1200 కోట్ల చిట్ ఫండ్ స్కామ్..! ఆ వైసీపీ నేతను అరెస్టు చేసి తీసుకువెళ్లిన ఒడిశా సీఐడీ పోలీసులు..!!


Share

Related posts

Asmita sood random clicks

Gallery Desk

Mahesh: రిలీజ్ అయ్యే వరకు సర్కారు వారి పాట విషంలో మేకర్స్‌కు టెన్షన్ తప్పదా..?

GRK

పాత్ర నుంచి బయటకొచ్చిన జస్టిస్!! ఎందుకీ వ్యక్తిగత ఆరోపణలు

Comrade CHE