NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Eye Problems: కంటి ఆరోగ్యానికి తీసుకోవాల్సిన ఆహారం ఇవే..!!

eye problems To check these foods

Eye Problems: జ్ఞానేంద్రియాలలో నయనం ఒకటి.. కంటి చూపు వలన మనం ప్రకృతి అందాలను చూడగలుగుతున్నాం.. నేటి ఆధునిక జీవన విధానంలో వయసు బేధం లేకుండా కంటి సమస్యలు తలెత్తుతున్నాయి.. ఎక్కువసేపు టీవీలు చూడటం ఫోన్లు వినియోగించడం వలన కంటి రెటీనా దెబ్బతిని కంటి సమస్యలు వస్తున్నాయి.. చూపు మందగిస్తుంది.. కళ్ళు లాగుతున్నట్లు ఉండడం కళ్ళు నొప్పి కంటి నుండి నీరు కారడం వంటి సమస్యలు తలెత్తుతాయి.. వీటిని మందులు తోనే కాకుండా మనం తినే ఆహార పదార్థాల వల్ల కూడా కంటి సమస్యలను నివారించవచ్చు.. చక్కటి కంటి ఆరోగ్యానికి తీసుకోవాల్సిన ఆహారం గురించి తెలుసుకుందాం..!!

Eye Problems: to check these food items
Eye Problems to check these food items

Eye Problems: మీరు తీసుకొనే డైట్ లో ఇవి తింటే కంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు..!!

కంటి ఆరోగ్యాన్ని క్యారెట్ మెరుగుపరుస్తుంది. నేత్రాలకు అవసరమైన విటమిన్ ఏ, బీటాకెరోటిన్ లు ఉన్నాయి. దీనిలో లభించే పొటాషియం, పీచు పదార్థాలు కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ప్రతి రోజు క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల దృష్టి పెరుగుతోంది. పాలకూర లో విటమిన్లు ఏ, సి, కె, మెగ్నీషియం, మాంగనీస్, ఐరన్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి కళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. కంటి చూపును మెరుగు పరుస్తాయి. ప్రతిరోజు పాలకూర జ్యూస్ ను తయారుచేసుకొని తాగితే కంటి ఆరోగ్యం మెరుగవుతుంది. బాదం లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్-డి కళ్ళకి చాలా అవసరం.

Eye Problems: to check these food items
Eye Problems to check these food items

ప్రతిరోజు నానబెట్టిన బాదం తింటే కంటి చూపు మెరుగవుతుంది. రోజు ఎండుద్రాక్షలను, బాదం పప్పులను నీటిలో నానబెట్టి పరగడుపున తింటే ఇది కళ్ళకు రక్షణను అందిస్తాయి. తేనె శరీర ఆరోగ్యానికే కాకుండా కంటి ఆరోగ్యాన్ని కూడా మెరుగు పరుస్తుంది. ప్రతిరోజు పరగడుపున తేనె లో ముంచిన ఉసిరికాయ లేదా తేనెతో కలిపిన ఉసిరికాయ జ్యూస్ ను తీసుకుంటే కంటి సంబంధిత సమస్యలు రాకుండా చేస్తుంది. కంటి సమస్యలతో బాధపడుతుంటే వాటి నుంచి వెంటనే ఉపశమనం కలిగిస్తుంది. రోజ్ వాటర్ కంటి సంబంధిత సమస్యలు చికిత్స లో ఉపయోగిస్తారు. దీనిbలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కండ్ల కలక, కంటి వాపు తగ్గించడానికి సహాయపడుతాయి. రోజ్ వాటర్ లో ముంచిన కాటన్ బాల్స్ ను కళ్ళు మూసి కళ్లపై పెట్టుకుంటే కళ్ళు చల్లగా ఉంటాయి. కంటిపై ఒత్తిడి తగ్గిస్తాయి. కళ్ళు ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి.

author avatar
bharani jella

Related posts

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju