NewsOrbit
న్యూస్ సినిమా

Nikhil: నిఖిల్ కెరీర్ పెరగకపోవడానికి కారణాలు ఇవేనా..?

Nikhil: నిఖిల్..శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీడేస్ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవడంతో నిఖిల్ బాగా గుర్తింపు తెచ్చుకున్నాడు. మా అయ్య ప్రొద్దుటూర్ ఎమ్మెల్యే అంటూ మంచి కామెడి టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు. అప్పుతో కనెక్ట్ అయ్యే పాత్రలో నిఖిల్ యూత్‌తో పాటు కామన్ ఆడియన్స్‌ని బాగా అట్రాక్ట్ చేశాడు. హ్యాపీడేస్‌లో చూసిన అందరూ ఆ తర్వాత మంచి కమెడియన్ అవుతాడని చెప్పుకున్నారు. కానీ హీరో అవుతాడని ఊహించలేదు.

are these the reasons for nikhil career downfall
are these the reasons for nikhil career downfall

2008లో వచ్చిన సినిమా యువత. ఈ సినిమాతో నిఖిల్ సోలో హీరోగా ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్నాడు. పరశురాం ఈ సినిమాకి దర్శకుడు. నిఖిల్ హీరోగా అనగానే డివైడ్ కామెంట్స్ వచ్చాయి. హీరోగానా.. అని కొందరు సందేహాలను వ్యక్తం చేశారు. ఓ..నిఖిల్ హీరోగానా అని కొందరు ఎగ్జైట్ అయ్యారు. ఇక నిఖిల్ హీరోగా వచ్చిన యువత బాగానే ఆకట్టుకుంది. ఖచ్చితంగా మంచి సినిమాలు పడితే నిఖిల్ హీరోగా టాలీవుడ్‌లో సెటిల్ అవుతాడని అందరూ ఆకాంక్షించారు. ఈ సినిమా తర్వాత ఆలస్యం అమృతం..వీడు తేడా వంటి సినిమాలు వచ్చాయి. కానీ నిఖిల్‌కి ఈ రెండు సినిమాలు అంతగా సక్సెస్ ఇవ్వలేదు.

Nikhil: నిఖిల్ హీరోగా సెటిలవడం కష్టం..అని జాతకం చెప్పారు.

దాంతో అందరూ మళ్ళీ నిఖిల్ హీరోగా సెటిలవడం కష్టం..అని జాతకం చెప్పారు. కానీ 2013లో వచ్చిన స్వామి రారా సినిమా అద్భుతమైన కథ, కథనాలతో వచ్చి బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ సినిమాగా నిలిచింది. కలర్స్ స్వాతి ఇందులో హీరోయిన్‌గా నటించింది. నిఖిల్ సోలో హీరోగా అందుకున్న మొదటి సినిమా. ఇక ఆ తర్వాత ఏడాది వచ్చిన కార్తికేయ సినిమా నిఖిల్ కెరీర్‌లో ఓ మైల్ స్టోన్ సినిమాగా నిలిచింది. ఈ సినిమాతో నిఖిల్ కి అటు టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఇటు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు.

అంతేకాదు నిఖిల్‌కి విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగింది. ఈ సినిమా తర్వాత వచ్చిన సూర్య వర్సెస్ సూర్య కమర్షియల్ హిట్ కాకపోయినా మంచి ప్రయోగం అని నిఖిల్‌ని మెచ్చుకున్నారు. అయితే శంకరాభరణం సినిమా ఒప్పుకొని నిఖిల్ పెద్ద రాంగ్ స్టెప్ వేశాడు. ఈ సినిమా తర్వాత ఎక్కడికిపోతావు చిన్నవాడా యావరేజ్ హిట్‌గా నిలిచింది. ఇక కేశవ ఆశించినంతగా విజయాన్ని అందుకోలేకపోయింది. దాంతో నిఖిల్ యంగ్ హీరోలతో పోటీ పడలేకపోయాడు అని చెప్పుకున్నారు. కానీ కన్నడ సినిమా కిరాక్ పార్టీ రీమేక్‌తో మంచి హిట్ అందుకున్నాడు. మళ్ళీ కాస్త ఫాంలోకి వచ్చిన నిఖిల్ అర్జున్ సురవరం సినిమాతో హిట్ అందుకున్నాడు.

Nikhil: రెండు సినిమాలను ఓకే చేసి సెట్స్ మీదకి తీసుకువచ్చాడు.

ఈ సినిమా తర్వాత నిఖిల్ వరుసగా రెండు సినిమాలను ఒకే చేసి సెట్స్ మీదకి తీసుకువచ్చాడు. అందులో ఒకటి గీతా ఆర్ట్స్‌లో నిర్మిస్తున్న 18 పేజెస్. సుకుమార్ కూడా దీనికి సహ నిర్మాత. అలాగే మరోసారి చందు మొండేటి దర్శకత్వంలో కార్తికేయ2 చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తోంది. కరోనా వేవ్స్ కారణంగా ఆలస్యం అయింది. లేదంటే ఈ రెండు సినిమాలు గత ఏడాదే ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. అయితే నిఖిల్ కెరీర్ ప్రారంభం నుంచి పెరగకపోవడానికి కారణం తన సినిమాలు భారీ కమర్షియల్ హిట్స్‌గా నిలవకపోవడమే. ఇది ఆయన నటించిన సినిమాల రిజల్ట్ చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది.

Related posts

Pushpa Pushpa: “టీ” గ్లాస్ పట్టుకుని అల్లు అర్జున్ డాన్స్.. అదరగొట్టిన “పుష్ప 2” లిరికల్ సాంగ్..!!

sekhar

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N