NewsOrbit
న్యూస్

AP Rains Update: తిరుమల తెరుచుకుంది.. కానీ వర్షం బెడద ఉంది..!!

AP Rains Update: Tirumala Okay.. but Roads Flooding High

AP Rains Update: మూడు రోజులుగా భారీ వర్షాలు, వరదల కారణంగా చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాలో అతలాకుతలమైన విషయం తెలిసిందే. ఈరోజు వర్షాలు కాస్త ఉపశమనాన్ని ఇచ్చాయి. అయితే పూర్తిస్థాయి తగ్గలేదు. తిరుమలలో ఘాటు రోడ్లు ఓపెన్ చేశారు, రాకపోకలకు ఇబ్బంది లేనప్పటికి… దారుల్లో అడ్డుగా చెట్లు, రాళ్లు ఉన్నాయి. శుభ్రం చేయిస్తున్నారు. ఆ జిల్లాల్లో వర్షాలు, తాజా పరిస్థితి ఎలా ఉందంటే..!?

* నెల్లూరు దగ్గర్లో నేషనల్ హైవే మీద ఉన్నటువంటి ఒక బ్రిడ్జి విరిగిపోయింది.! ప్రస్తుతం చెన్నై/నెల్లూరు వైపు వెళ్ళడానికి దారి లేదు. మరో హైవేలో నెల్లూరు/చెన్నై వైపు వెళ్లేటటువంటి అన్ని గూడ్స్ వెహికల్స్ ను ఎక్కడికక్కడ ఆపు చేయాలని అధికారులు సూచించారు. పార్కింగ్ ఏరియా లో, డాబా హోటల్స్ వద్ద – ఎక్కడ వీలుంటే అక్కడ వాటిని పార్క్ చేసుకుంటున్నారు. అలాగే నెల్లూరు చెన్నై వైపు వెళ్లేటటువంటి అన్ని ప్యాసింజర్ (ప్రయాణికులను చేరవేసే) వాహనాల వారికి ( కార్లు బస్సులు వంటివి) ఈ విషయం తెలిపి, వారిని అటు వెళ్లవద్దని చెప్పి, ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తున్నారు.

AP Rains Update: Tirumala Okay.. but Roads Flooding High
AP Rains Update: Tirumala Okay.. but Roads Flooding High

* శ్రీశైలం ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతుంది. వరద ప్రవాహం భారీగా వస్తుండటం శ్రీశైలం ప్రాజెక్ట్‌ లోకి భారీగా వరద  నీరు వచ్చి చేరుతుంది. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో, అవుట్ ఫ్లో 81,293 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులుగా ఉండగా, ప్రస్తుతం 856 అడుగులుగా ఉంది. శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది.

* తుంగభద్ర జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతుంది. దీంతో అధికారులు తుంగభద్ర 20 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. తుంగభద్ర ఇన్‌ఫ్లో 82,440 క్యూసెక్కులుగా ఉండగా, ఔట్‌ఫ్లో 1,52,224 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటినిల్వ 100.855 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 100.701 టీఎంసీలుగా ఉంది. తుంగభద్ర పూర్తిస్థాయి నీటిమట్టం 1,633 అడుగులుగా కాగా ప్రస్తుతం 1,632.96 అడుగులుగా ఉంది.

* తెరుచుకున్న రెండు ఘాట్ రోడ్లు. తిరుమలకు రాకపోకలు యథాతథంగా జరుగుతున్నాయి. ఈరోజు ఉదయం 10 గంటలకు ఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనాల ట్రైల్ వేశారు. ఎలాంటి ఇబ్బంది వాహన దారులకు తలెత్తకుండా ఉంటే సాయంత్రం నుంచి ఘాట్ రోడ్డులోను ద్విచక్ర వాహనాల అనుమతి ఇచ్చారు. అలిపిరి, శ్రీవారి మెట్లు కాలిబాట మార్గాలు మాత్రం మూసి ఉంచారు. వరద ఉధృతితో మెట్లు కొట్టుకు పోవడంతో టీటీడీ మరమ్మతులు ప్రారంభించింది. మరో రెండు, మూడు రోజులు పెట్టె వీలుంది.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju