Parents : పెద్ద తప్పు:
మనిషి గా పుట్టిన తర్వాత మనకు కొన్ని ధర్మాలు ఉంటాయి. వాటిలో ప్రధానమైనది వృద్ధాప్యం లో ఉన్న తల్లిదండ్రులను కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ, పసి పాపల్లాగా చూసుకోవడన అనేది మన ధర్మం. అలాంటి ధర్మాన్ని నిర్వర్తించక పోవడం కన్నా పెద్ద తప్పు మరొకటి ఉండదు. చేసే ప్రతి పనికి ఫలితం అనేది కచ్చితంగా మనం అనుభవిస్తాం.అది మంచి అయినా చెడు అయినా తప్పించుకోలేము. భార్యకి,తల్లిదండ్రులకు మధ్య కొన్ని గొడవలు రావడం సహజం.
Parents : గొడవలు అనేవి:
పిల్లలతోనే గొడవలు వస్తుంటాయి. అలాంటిది కోడలితో రావడం అనేది కొత్తేమీ కాదు. ఏ బంధాలలో అయినా కూడా గొడవలు అనేవి చాలా సహజం వాటిని కారణంగా తల్లిదండ్రులను పట్టించుకోకపోవడం అనేది అస్సలు మంచి పద్ధతి కాదు. మన తల్లిదండ్రులు మనకి ఎంత ముఖ్యమో , మన భార్యకి లేదా భర్తకి వాళ్ల తల్లిదండ్రులు కూడా అంతేకదా. వారు లేకపోతే భార్య లేదు భర్త లేడు. ఈ జన్మలో అత్తమామలు గత జన్మలో తల్లిదండ్రులు అని అంటారు. కాబట్టి వాళ్ళని వేరుగా చూడకండి. ఇద్దరి తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకుంటూ పిల్లలకి మంచి రోల్ మోడల్స్ అవ్వండి. జన్మనిచ్చి కంటికి రెప్పలా కాపాడి ప్రయోజకులను చేసిన తల్లిదండ్రుల ను కూడా మనం చేసుకోకపోతే ఎంత ఎత్తు ఎదిగిన ,ఎన్ని సాధించిన వ్యర్ధమే అని మరువకండి. ఇక ఆర్థిక పరమైన విషయాలకి వస్తే తల్లిదండ్రుల ఆరోగ్య సమస్యలకి కొంత డబ్బు ఖర్చు అవుతుంది. మన కోసం వాళ్ళు ఎంత కష్టపడ్డారో ఆలోచించండి. వాళ్ల కష్టం వలెనే ఈరోజు మనం డబ్బు సంపాదించే స్థాయికి ఎదిగాము. కాబట్టి వాళ్ల మందుల కోసం ఆరోగ్యం కోసం ఖర్చు చేయడానికి ఆలోచించకండి. ఈ రోజుల్లో వారిని పట్టించుకునే తీరిక ఎక్కడిది అనే కారణం తో తల్లిదండ్రులని పట్టించుకోవాదం మనకండి.
ప్రేమతో నిండిన మజిలీ:
మన విలాసాలకు ఫంక్షన్ కి టైం ఉన్నప్పుడు తల్లిదండ్రులు చూసుకోవడానికి కాస్త టైం ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. దానికోసం కాస్త ప్లాన్ చేసుకోవడం అనేది అవసరం. ఏ కారణం ఉన్న కూడా మీ తల్లిదండ్రులను పట్టించుకోకుండా వదిలేయకండి. ఇది మన కనీస ధర్మం. ఓపికున్నంత కాలం అనేక రకాల బాధలకు గురైన మన తల్లిదండ్రులకు వృద్దాప్యాన్ని ప్రేమతో నిండిన మజిలీగా మలుద్దాం