NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Chandra babu: జిల్లాల పునర్విభజనపై చంద్రబాబు సంచలన కామెంట్స్..

Chandra babu: రాష్ట్రంలో జగన్మోహనరెడ్డి సర్కార్ 13 జిల్లాలను 26 జిల్లాలుగా మార్పు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. జిల్లాల పునర్విభజన పై మిశ్రమ స్పందన వస్తోంది. పలు ప్రాంతాల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతుండగా తమ ప్రాంతాలకు అన్యాయం జరిగిందంటూ ఆయా ప్రాంతాల్లో ఆందోళనలు, నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంటరీ నియోజకవర్గాల ప్రాతిపదిన జిల్లాల ఏర్పాటుకు చర్యలు చేపట్టినప్పటికీ పలు జిల్లాల్లో పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రాలను జిల్లా కేంద్రాలుగా ప్రకటించకుండా వేరే ప్రాంతాలను జిల్లా కేంద్రాలుగా ప్రకటించడంతో ఆ ప్రాంతాల నుండి వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.

Chandrababu comments on district bifurcation
Chandra Babu comments on district bifurcation

 

Chandra babu: అభినందన ర్యాలీలు, నిరసనలు

ప్రభుత్వ ఉద్యోగులకు జీతాల చెల్లింపే ఇబ్బందికర పరిస్థితి ఉన్న ప్రస్తుత తరుణంలో జిల్లాల విభజన ఏమిటన్న వాదన కూడా వినబడుతోంది. రేపు ఉగాది నుండి కొత్తగా ఏర్పాటు కానున్న 13 జిల్లాల్లో జిల్లా కేంద్ర కార్యాలయాలు ఏర్పాటు, అద్దెలు చెల్లింపు, జిల్లా అధికారుల వేతనాల చెల్లింపు ప్రభుత్వ ఖజానాకు మరి కొంత భారం కానున్నది. కొత్త జిల్లాల ప్రతిపాదనలపై వైసీపీ శ్రేణుల ఆధ్వర్యంలో అభినందన ర్యాలీలు నిర్వహించారు. జిల్లాల విభజనపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందిస్తూ కొత్త జిల్లాల ఏర్పాటు రాజకీయ లబ్దికోసం కాకుండా ప్రజల ఆక్షాంక్షలకు అనుగుణంగా చేయాలని అన్నారు.

ఎన్టీఆర్ పేరుతో ఉన్న 14 పథకాలను ఈ ప్రభుత్వం రద్దు చేసింది

ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా జిల్లాల పునర్విభజన జరగడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు చంద్రబాబు. దివంగత ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ పేరును విజయవాడ జిల్లాకు పెట్టడంపై చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్టీఆర్ పేరుతో ఉన్న 14 పథకాలను ఈ ప్రభుత్వం రద్దు చేసిందని గుర్తు చేస్తూ ఇప్పుడు ప్రభుత్వం ఎన్టీఆర్ పై గౌరవం ఉన్నట్లు ఆయన పేరుతో కొత్త జిల్లాను ఏర్పాటు చేస్తున్నట్లు చెబుతూ గొప్పలు చెప్పుకుంటోందని విమర్శించారు.

Related posts

 Election 2024: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్ సమయం

sharma somaraju

Video Viral: పోలింగ్ కేంద్రం వద్ద ఓటరు చెంప చెళ్లు మనిపించిన ఎమ్మెల్యే .. తిరిగి అదే రీతిలో ఎమ్మెల్యేపై .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

పోలింగ్ డే ట్విస్ట్‌: వైసీపీకి మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా.. ?

ఏపీ పోలింగ్ రోజు వైసీపీకి ఇన్‌డైరెక్టుగా మ‌ద్ద‌తు ఇచ్చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్ ?

Supreme Court: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో ఊరట

sharma somaraju

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

ప్రశాంత్ కిషోర్ సర్వే…. జగన్‌కు ఎన్ని సీట్లు అంటే.. ?

ఏంద‌య్యా ఇది…BRSకు మెజారిటీ సీట్లు… ప్రధానిగా కేసీఆర్… ?

పోలింగ్ ముందు రోజు పిఠాపురం వైసీపీలో ర‌చ్చ రచ్చ‌.. చేతులెత్తేసిన వంగా గీత‌..?

పవన్ కళ్యాణ్‌ను ఓడించేందుకు జగన్ కొత్త స్కెచ్.. రివీల్ అయ్యిందిగా..?

ఏపీ బీజేపీ ఆశ‌ల‌న్నీ వీళ్ల‌పైనే.. ఏం చేస్తారో…?

ఏపీలో ఈ జిల్లాలే డిసైడింగ్ ఫ్యాక్ట‌ర్‌.. ఇక్క‌డి జ‌నాలు తిన్న‌ది మ‌రిచిపోరు…!

PM Modi: రికార్డు స్థాయిలో ప్రజలు పోలింగ్ లో పాల్గొనాలి .. మోడీ

sharma somaraju