NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ ప్ర‌పంచం

Russia Ukraine War: చర్చలు విఫలం – ఈయూలో సభ్యత్వంకు ఉక్రెయిన్ డిమాండ్ .. 36దేశాల విమానాలపై రష్యా నిషేదం..

Russia Ukraine War: రష్యా – ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో రెండు దేశాల మధ్య నిర్వహించిన చర్చలు విఫలమైయ్యాయి.. అయిదు రోజులుగా ఉక్రెయిన్ పై రష్యా భీకరపోరు సాగిస్తుండగా ఉక్రెయిన్ కూడా తగ్గేదే లే అన్నట్లు దాడులను ఎదుర్కొంటోంది. ఈ తరుణంలో యుద్ధానికి స్వస్తి పలికేందుకు బెలారస్ వేదికగా జరిగిన చర్చల్లో ఇరు దేశాలు తమ తమ వాదనలకే కట్టుబడ్డాయి. ప్రత్యర్ధి వర్గం చేసిన ప్రతిపాదనలను ఇరు దేశాలు పరిగణలోకి తీసుకున్న దాఖలాలు కనబడలేదు. ఈ కారణంగా గంటల తరబడి సాగిన చర్చలు సింగిల్ తీర్మానం కూడా లేకుండానే ముగిశాయి. యుద్ధం మొదలైన రెండో రోజునే ఉక్రెయిన్ తో తాము చర్చలకు సిద్ధం అంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రతిపాదన చేయడం, బెలారస్ వేదికగా ఉక్రెయిన్ చర్చలకు సిద్ధమైతే తమ దేశ ప్రతినిధి బృందాన్ని పంపుతామని వెల్లడించిన సంగతి తెలిసిందే.

Russia Ukraine War peace talks failed
Russia Ukraine War peace talks failed

Russia Ukraine War: మూడు గంటలకు పైగా చర్చలు జరిగినా..

రష్యా మిత్రదేశంగా ఉన్న బెలారస్ లో చర్చలకు తొలుత ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ విముఖత వ్యక్తం చేసినా తరువాత చర్చలకు ఓకే చెప్పారు. ఈ నేపథ్యంలో బెలారస్ లో నేడు మొదలైన చర్చలకు ఉక్రెయిన్ నుండి ఆరుగురు, రష్యా నుండి అయిదుగురు విదేశాంగ ప్రతినిధులతో కూడిన బృందాలు కూర్చున్నాయి. దాదాపు మూడు గంటలకు పైగా చర్చలు జరిగినా ఏ ఒక్క తీర్మానం లేకుండానే రెండు దేశాలు చర్చలను ముగించాయి. ప్రపంచ దేశాలన్నీ శాంతియుత పరిష్కారం కోరుకుంటున్న తరుణంలో చర్చలకు రెండు దేశాలు అంగీకరించడంతో సమస్య పరిష్కారం అవుతుందని భావించారు. చర్చలు ఫలప్రదం అయి యుద్ధం ముగిస్తే ఉక్రెయిన్ ప్రజలతో పాటు ప్రపంచ దేశాలు కూడా ఊపిరిపీల్చుకునే అవకాశం లభించేది.

Russia Ukraine War: ఈయూలో సభ్యత్వంకు జెలెన్ స్కీ డిమాండ్

ఇదిలా ఉంటే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ కొత్త డిమాండ్ ను తెరపైకి తీసుకువచ్చారు. తమకు యూరోపియన్ యూనియన్ (ఈయూ)లో సభ్యత్వం ఇవ్వాలని డిమాండ్ చేశారు. యూరోపియన్లందరితో కలిసి ఉండాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఇది మా న్యాయమైన హక్కు, ఇది సాధ్యమవుతుందని భావిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. మరో పక్క ఉక్రెయిన్ అండగా యూరోపియన్ యూనియన్ దేశాలు నిలవాలని నిర్ణయించుకోవడంతో పాటు యుద్ద విమానాలు పంపాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.

36 దేశాల విమానాలపై రష్యా నిషేదం

మరో పక్క రష్యా పాశ్చాత్య దేశాల హెచ్చరికలను ఏ మాత్రం ఖాతరు చేయడం లేదు. అమెరికాతో పాటు యూరోపియన్ యూనియన్, నాటో కూటమి దేశాలు రష్యాపై ఆర్ధికరమైన ఆంక్షలు విధించిన నేపథ్యంలో కాస్తంత తగ్గినట్లే కనిపించినా తాజాగా అధినేత పుతిన్ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. తమ దేశంపై ఆంక్షలు విధించిన దేశాల్లోని మెజార్టీ దేశాల విమానాలు రష్యా గగనతలంపై ఎగరకుండా నిషేదం విధించారు. రష్యా 36 దేశాల విమానాలపై నిషేదం విధించింది. రష్యా నిషేదం విధించిన దేశాల్లో బ్రిటన్, జర్మనీ, ఆస్ట్రియా, ఆల్బేనియం, బెల్జియం, బల్గేరియా, హాంగేరీ, డెన్మార్క్, ఐర్లాండ్, స్పెయిన్, ఇటలీ, కెనడా, లాధ్వియా, లిథువేనియా, అక్సెంబర్గ్, రోమేనియా, ఫిన్లాండ్, ఫ్రాన్స్, క్రోయేషియా, స్వీడన్, ఎస్టోనియా తదితర దేశాలు ఉన్నాయి.

Related posts

Arvind Kejriwal: దేశంలో అధికారంలోకి వచ్చేది ఇండియా కూటమి ప్రభుత్వమే .. అరవింద్ కేజ్రీవాల్

sharma somaraju

AP Elections 2024: వైసీపీ అభ్యర్ధి వంగా గీత కార్యాలయాన్ని ముట్టడించిన ఓటర్లు .. ఎందుకో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..!

sharma somaraju

Bomb Threat: ఢిల్లీ ఎయిర్ పోర్టు, ఆసుపత్రులకు బాంబు బెదిరింపులు

sharma somaraju

ఆ మూడు రిజ‌న్లు… చింత‌మ‌నేని గెలుపును నిర్ణ‌యిస్తున్నాయా..?

IPL 2024: ఆర్సీబీ ప్లేయర్ల భార్య‌ల‌ను ఎప్పుడైనా చూశారా.. వారు ఏయే రంగాల్లో ఉన్నారో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

POK: పాక్ ఆక్రమిత కశ్మీర్ లో విధ్వంసం .. భద్రతా దళాలను తరిమితరిమి కొట్టిన ఆందోళనకారులు .. వీడియోస్ వైరల్

sharma somaraju

Ravi Teja: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బిగ్ హిట్ కొట్టిన ర‌వితేజ‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదంటే?

kavya N

Kona Venkat: సినీ రచయిత కోన వెంకట్ పై బాపట్లలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు.. ఎందుకంటే ..?

sharma somaraju

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

CM Revanth Reddy: విద్యార్ధులతో ఫుట్ బాల్ ఆడిన సీఎం రేవంత్ .. వీడియో వైరల్

sharma somaraju

Aparichithudu: మ‌ళ్లీ వ‌స్తున్న అప‌రిచితుడు.. ఎన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

జగన్ టీమ్‌లో ఈ పెద్ద లీడర్లు గెలవడం కష్టమేనా ?

విజయమ్మతో చివరి బాణం వదిలిన షర్మిల.. ?

మెగా ఫ్యామిలీని రెండు ముక్క‌లు చెక్క‌లు చేసిందెవ‌రు..?

అల్లు అర్జున్‌ ప్రచారం.. బాబుకి ఫ్రస్టేషన్ ..?