NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

కరోనా కొత్త వేరియంట్ విజృంభణ నేపథ్యంలో ఏపీ సర్కార్ కీలక ప్రకటన

చైనా, అమెరికా సహా పలు దేశాల్లో కరోనా కొత్త వేరియంట్ (బీఎఫ్ 7 సబ్ వేరియంట్) విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్రం వివిధ రాష్ట్రాలను అప్రమత్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏపి సర్కార్ తీసుకుంటున్న చర్యలపై వైద్య ఆరోగ్య శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. కరోనా వ్యాప్తి, కొత్త వేరియంట్ల విషయంలో ఏపి సర్కార్ అప్రమత్తంగా ఉందని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జె నివాస్ తెలిపారు. పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.

Omicron BF7

 

డిసెంబర్ నెలలో దాదాపు 30వేల కోవిడ్ పరీక్షలు చేయగా, 130 మాత్రమే పాజిటివ్ కేసులు వచ్చాయని కమిషనర్ జె నివాస్ చెప్పారు  ఈ 130 పాజిటివ్ కేసులు కూడా ఓమిక్రాన్ వేరియంట్లేనని ఆయన తెలిపారు. ఇతర వేరియంట్లు నమోదు కాలేదని చెప్పారు. కొత్త వేరియంట్లు వ్యాపించే అవకాశం ఉందని హెచ్చరికలు వస్తున్న నేపథ్యంలో అందుకు తగిన ముందస్తు చర్యలు చేపట్టినట్లు తెలిపారు నివాస్. రాష్ట్రంలో జీనోమ్ సీక్వెన్సింగ్ టెస్ట్ కు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. ఏపి వ్యాపితంగా 29 పరీక్షా కేంద్రాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.

చైనా నుండి వచ్చిన ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఎఫ్ 7 కేసులు భారత్ లోనూ వెలుగు చూసిన నేపథ్యంలో కేంద్రం కేంద్రం అన్ని రాష్ట్రాలను అలెర్ట్ చేసింది. ఆరు నెలల కాలంలో బీఎఫ్ 7 సబ్ వేరియంట్ కేసులు దేశంలో  నాలుగు నమోదు అయ్యాయి. గుజరాత్ మూడు, ఒడిశాలో ఒక ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఎఫ్ 7 కేసులు నమోదు అయ్యాయి. కేంద్రం హెచ్చరికల నేపథ్యంలో ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జె నివాస్ స్పందించారు. ఏపిలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ సరిపడా అందుబాటులో ఉన్నాయనీ, బెడ్లు సిద్దంగా ఉన్నాయని తెలిపారు. వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ ద్వారా నిరంతరం పర్యవేక్షణ ఉంటుందని చెప్పారు. ప్రభుత్వానికి ప్రజలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Related posts

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N