NewsOrbit
జాతీయం న్యూస్

కోవిడ్ ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఎఫ్ 7 కేసులు భారత్ లో నాలుగు వెలుగు చూశాయి

చైనా, అమెరికాతో సహా పలు దేశాల్లో వేగంగా విస్తరిస్తూ తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్న కోవిడ్ ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఎఫ్ 7 కేసులు భారత్ లో ఇంతకు ముందే నాలుగు వెలుగు చూశాయి. జూలై, సెప్టెంబర్ తర్వాత నవంబర్ నెలలో భారత్ లో బీఎఫ్ 7 కేసులు నమోదైయినట్లు సమాాచారం. గూజరాత్ లో మూడు, ఒడిశాలో ఒక కేసు నమోదు అయ్యాయని తెలుస్తొంది. అత్యంత వేగంగా ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే లక్షణం ఉన్న బీఎఫ్‌.7 సబ్‌ వేరియంట్‌ తొలుత చైనాలో వెలుగు చూసింది.

covid virus

 

ఈ వేరియంట్ చాలా వేగంగా అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, బెల్జియం దేశాలకు వ్యాపించింది. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లుహెచ్ఒ) రీసెంట్ గా ఈ వేరియంట్ గురించి హెచ్చరికలు జారీ చేసింది. దీని వ్యాప్తిని నిరోధించే ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోతే అది డామినెంట్‌ వేరియంట్‌గా మారుతుందని చైనాకు చెందిన గ్లోబల్‌టైమ్స్‌ పత్రిక పేర్కొంది. అయితే.. చైనాలో కెేసులు పెరుగుతుండటం భారత్ ను ఆందోళనకు గురి చేస్తొంది. దేశ వ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాల్లో హైఅలర్ట్ ప్రకటించారు.

Ministry of health high level committee meeting

ఈ నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం .. కీలక సూచనలు జారీ చేసింది. రద్దీ ప్రదేశాల్లో ప్రజలు మాస్కులు ధరించాలని సూచించింది. చైనా, అమెరికా సహా పలు దేశాల్లో కోవిడ్ పరిస్థితులపై అంచనా వేసేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయ అధ్యక్షతన బుధవారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఇకపై దేశంలో కరోనా పరిస్థితులపై చర్చించి చర్యలు చేపట్టేందుకు గానూ ఈ ఉన్నత స్థాయి కమిటీ ప్రతి వారం సమావేశం కావాలని నిర్ణయించారు. ప్రపంచ దేశాల్లో పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో అధికారులు అంతా అప్రమత్తంగా ఉండాలని, పర్యవేక్షణ మరింత కట్టుదిట్టం చేయాలని కేంద్ర మంత్రి మాండవీయ ఆదేశించారు.

కరోనా ముప్పు ఇంకా తొలగిపోలేద. అప్రమత్తంగా ఉండాలి, పర్యవేక్షణ మరింత పటిష్టం చేయాలని అధికారులను ఆదేశించినట్లు కేంద్ర మంత్రి మాండవీయ ట్విట్టర్ వేదికగా తెలిపారు. దేశంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నామని పేర్కొన్నారు. దేశంలో ఇప్పటి వరకూ 28 శాతం మంది మాత్రమే బూస్టర్ డోస్ వేసుకున్నారనీ, వయోవృద్ధులు తప్పనిసరిగా బూస్టర్ డోస్ తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ ఉన్నత స్థాయి భేటీలో నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్, జాతీయ టీకా సాంకేతిక సలహా బృందం చైర్మన్ ఎన్ఎల్ ఆరోరా, ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ బహాల్, ఆరోగ్య శాఖ ఇతర ఉన్నతాధికారులు, ఆరోగ్య, ఆయుష్, ఔషద, బయోటెక్నాలజీ విభాగాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

ఇంటా, బయటా రద్దీ ప్రదేశాల్లో ప్రజలు మాస్క్ లు ధరించాలని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ సూచించారు. వృద్ధులు, ఆనారోగ్య సమస్యలు ఉన్న వారు సహా అందరూ మాస్క్ లు ధరించడం చాలా ముఖ్యమని ఆయన పేర్కొన్నారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju