NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

పట్టు నిలుపుకున్న కాకర్ల వెంకట్రామిరెడ్డి .. అప్స ఎన్నికల్లో కాకర్ల ప్యానల్ ఘన విజయం

ఏపి సెక్రటేరియట్ లో సచివాలయ ఉద్యోగుల సంఘం ఎన్నికల్లో కాకర్ల వెంకట్రామిరెడ్డి వర్గం విజయం సాధించింది. ఇటీవల జరిగిన సెక్రటేరియట్ సెక్షన్ ఆఫీసర్స్ ఎన్నికల్లో వెంకట్రామిరెడ్డి ప్యానల్ ఓటమి పాలవ్వడంతో ఈ ఎన్నికలు ఉత్కంఠ గా మారాయి. ఇంతకు ముందు కాకర్ల వెంకట్రామిరెడ్డి ప్యానల్ ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. వెంకట్రామిరెడ్డికి ప్రభుత్వంలోని పెద్దలు, వైసీపీ నేతల ఆశీస్సులు, మద్దతు ఉండటంతో ఉద్యోగులు తమ సమస్యలు పరిష్కారం అవుతాయని భావించి గతంలో ఏకగ్రీవంగా ఎన్నికున్నారు. అయితే వెంకట్రామిరెడ్డి అధ్యక్షుడుగా ఎన్నికైన తర్వాత ఉద్యోగులు ఆశించిన విధంగా తమ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయలేదన్న భావనతో ఈ సారి ఆయనను ఏకగ్రీవం చేసేందుకు ఉద్యోగులు అంగీకరించలేదు.

kakarla venkata rami reddy

 

సచివాలయ ఉద్యోగుల గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఈ సారి వెంకట్రామిరెడ్డికి పోటీగా రామకృష్ణ బరిలో నిలిచారు. దీంతో ఈ సారి పోటీ అనివార్యమైంది. వివిధ పదవులకు 30 మంది బరిలో నిలిచారు. బుధవారం పోలింగ్ రసవత్తరంగా సాగింది.మొత్తం 1225 ఓట్లు ఉండగా, 1162 మంది ఉద్యోగులు పోలింగ్ లో పాల్గొన్నారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకూ పోలింగ్ కొనసాగగా, కౌంటింగ్ అర్ధరాత్రి వరకూ జరిగింది. కార్యవర్గంలో వెంకట్రామిరెడ్డి మద్దతుదారులు అత్యధికులు విజయం సాధించారు.

అధ్యక్షుడుగా వెంకట్రామిరెడ్డి 280 ఓట్ల మెజార్టీతో రామకృష్ణపై విజయం సాధించారు. వెంకట్రామిరెడ్డికి 720 ఓట్లు రాగా, ప్రత్యర్ధి రామకృష్ణకు 432 ఓట్లు వచ్చాయి. మహిళా వైస్ ప్రెసిడెంట్ గా సత్య సులోచన, ప్రధాన కార్యదర్శిగా కృష్ణ, వైస్ ప్రెసిడెంట్ గా ఎర్రన్న యాదవ్, అడిషనల్ సెక్రటరీగా గోపి కృష్ణ, మహిళా జాయింట్ సెక్రటరీగా ఆర్ రమాదేవి, జాయింట్ సెక్రటరీ (ఆర్గనైజేషన్) మనోహర్, స్పోర్ట్స్ సెక్రటరీగా సాయి, కోశాధికారిగా కే వెంకటరావు లు విజయం సాధించారు. విజయం సాధించిన వెంకట్రామిరెడ్డి ప్యానల్ ను ఉద్యోగులు అభినందించారు. సెక్రటేరియట్ అఫీసర్స్ ఎన్నికల్లో వెంకట్రామిరెడ్డి ప్యానల్ ఓటమి పాలైనా ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఆయన తో పాటు ఆయన ప్యానల్ ఘన విజయం సాధించడంతో సచివాలయ ఉద్యోగుల్లో పట్టు నిలుపుకున్నట్లు అయ్యింది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N