NewsOrbit
Politics ఆంధ్ర‌ప్ర‌దేశ్‌

Chandrayaan-3: చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం కావడంతో అభినందనలు తెలియజేసిన ఏపీ సీఎం జగన్..!!

Chandrayaan-3: చంద్రాయన్-3 విజయవంతం కావడంతో ప్రపంచవ్యాప్తంగా భారత్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇతర దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు ఇస్రో శాస్త్రవేత్తలను అభినందిస్తున్నారు. ప్రపంచ దేశాలకు చెందిన సెలబ్రిటీలు ఇంకా రాజకీయ నాయకులు భారత్ చేపట్టిన చంద్రాయన్-3 ప్రయోగం విజయవంతం కావడం పట్ల శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. చంద్రయాన్- 3 ప్రయోగం సక్సెస్ కావటం పై సోషల్ మీడియాలో ఈశ్వర శాస్త్రవేత్తలను అభినందిస్తూ పోస్ట్ పెట్టారు. “ఇది భారత్ కు ప్రత్యేకమైన విజయం. చంద్రునిపై చంద్రాయన్-3 విజయవంతంగా ల్యాండ్ అయినందుకు నాతో సహా దేశంలో ప్రతి పౌరుడు గర్వంగా ఫీల్ అవుతున్నారు.

AP CM Jagan congratulated on the success of Chandrayaan-3

ఇస్రో బృందానికి నా శుభాకాంక్షలు మరియు అభినందనలు. “ఈ అపురూపమైన ఘట్టాన్ని శ్రీహరి కోటనుంచే సాధించాం. ఇది ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకం” అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు. మొన్నటి వరకు చంద్రుడి ఉపరితలంపై ల్యాండ్ అయిన దేశాల లిస్టులో అమెరికా, యుఎస్ఎస్ఆర్, చైనా దేశాలు మాత్రమే ఉండగా ఇప్పుడు నాలుగో దేశంగా భారత్.. రికార్డు సృష్టించింది. ఇక ఇదే సమయంలో చంద్రుడి దక్షిణ ధ్రువం పై ల్యాండ్ అయిన దేశంగా భారత్ మొదటి స్థానంలో నిలిచి చరిత్ర సృష్టించింది. ప్రధాని మోదీ కూడా ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. చంద్రాయన్-3 ప్రయోగం విజయవంతం కావడంతో నా జీవితం ధన్యమైందని అన్నారు.

AP CM Jagan congratulated on the success of Chandrayaan-3

యావత్ దేశం గర్వించేలా శాస్త్రవేత్తలు విజయం సాధించారని కొనియాడారు. ఇది నవభారత విజయమని.. శుభాకాంక్షలు తెలియజేశారు. జోహన్స్ బర్గ్ నుండి వర్చువల్ గా పాల్గొని ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సంతోషం వ్యక్తం చేశారు. చంద్రుని దక్షిణ ధ్రువం మీదకు ల్యాండర్ నీ చేర్చిన మొట్టమొదటి దేశంగా, ప్రపంచ అంతరిక్ష పరిశోధన రంగంలో భారతదేశం సరికొత్త అధ్యాయాన్ని లిఖించిందని ప్రశంసించారు. ఈ సందర్భంగా ఈశ్వర శాస్త్రవేత్తలకు అభినందనలు తెలియజేశారు. ఇంక దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన రాహుల్ గాంధీ రాష్ట్రపతి ముర్ము.. పలువురు రాజకీయ నాయకులు సెలబ్రిటీలు ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. దేశం గర్వపడేలా చేశారని పేర్కొన్నారు.

Related posts

SIT: విచారణ ప్రారంభించిన సిట్ ..రాజకీయ నేతలు, అధికారుల్లో గుబులు

sharma somaraju

EC: పల్నాడు కలెక్టర్, మూడు జిల్లాలకు ఎస్పీలను నియమించిన ఈసీ

sharma somaraju

Road Accident: పెళ్లి వేడుకలకు సిద్ధమవుతున్న వేళ ఘోర విషాదం .. వరుడు సహా అయిదుగురు దుర్మరణం

sharma somaraju

వైసీపీ Vs టీడీపీ: ఈ ఐదే ఓట‌ర్ల‌ను తిక‌మ‌క పెట్టాయా ?

ఏపీ వార్‌: ఈ విధ్వంసం వెన‌క ఎక్క‌డ .. ఏం జ‌రిగింది ?

లోకేష్ కోసం.. మ‌రో ఐదేళ్లు వెయిట్ చేయాల్సిందేనా..!

ద‌ర్శి : చివ‌రి ఓటు కౌంటింగ్ వ‌ర‌కు గెలిచేది ల‌క్ష్మా… శివ‌ప్ర‌సాదో తెలియ‌నంత ఉత్కంఠ‌..?

 జిందాల్ పరిశ్రమ లేఆఫ్ .. కార్మికుల ఆందోళన

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో వైఎస్ షర్మిల, సునీతకు భారీ ఊరట .. కడప కోర్టు ఉత్తర్వులపై స్టే

sharma somaraju

YSRCP: అజ్ఞాతంలోకి ఆ వైసీపీ ఎమ్మెల్యే సోదరులు

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఈ కొత్త సెంటిమెంట్లు మీరు గ‌మ‌నించారా ?

ఎన్టీఆర్, వైఎస్సార్ త‌ర్వాత జ‌గ‌న్‌దే ఆ రికార్డ్‌..?

ఏపీ పోలింగ్‌పై అంతు చిక్క‌ట్లేదా… గెలుపుపై ఎవ‌రి లెక్క‌లు వారివే..?

ఏపీ ఎన్నిక‌లు – రివ‌ర్స్ అయిన వ్యూహాలు..?

Chintamaneni: టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని పై మరో కేసు నమోదు

sharma somaraju