NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

నందమూరి లక్ష్మీపార్వతి భీషణ శపథం .. ‘వచ్చే ఎన్నికల తర్వాత ఆ ముగ్గురిని రాజకీయాల్లో లేకుండా చేస్తా’

ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో దివంగత సీఎం, మహానటుడు నందమూరి తారక రామారావు శత జయంతి వేడుకల సందర్భంగా ఎన్టీఆర్ స్మారక వంద రూపాయల నాణెం విడుదల కార్యక్రమం సోమవారం జరిగింది. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నాణేన్ని విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబు, సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందరేశ్వరి తో పాటు ఇతర ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ భార్యనైన తనకు అహ్వానం అందలేదని నందమూరి లక్ష్మీపార్వతి ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై రాష్ట్రపతి, ప్రధాన మంత్రికి లేఖ రాసినా స్పందన రాలేదు. ఆహ్వానం లేకపోవడంతో ఆ కార్యక్రమానికి లక్ష్మీపార్వతి హజరు కాలేదు.

Nandamuri Lakshmi parvati sensational comments

 

ఈ నేపథ్యంలో లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, చంద్రబాబుపై ఘాటుగా స్పందిస్తూ సంచలన కామెంట్స్ చేశారు. ఎన్టీఆర్ భార్యనైన తనను ఈ కార్యక్రమానికి పిలవడకపోవడం అన్యాయమన్నారు. ఎన్టీఆర్ మరణానికి కారణమైన వాళ్లు ఆయన వారసులుగా చలామణి అవుతున్నారని సంచలన కామెంట్స్ చేశారు. ఎన్టీఆర్ భార్యగా ఆ నాణెం ను అందుకునే అర్హత తనకే ఉందని, వాళ్లకు లేదని అన్నారు. ఎన్టీఆర్ కుమారులు అమాయకులు అన్న లక్ష్మీపార్వతి.. కుతుళ్లు భువనేశ్వరి, పురందరేశ్వరి దుర్మార్ఘులని సంచలన కామెంట్స్ చేశారు. ఇకపై తన పోరాటం పురందరేశ్వరిపైనే అని అన్నారు. రాబోయే ఎన్నికల్లో పురందరేశ్వరి తిరిగిన ప్రతి నియోజకవర్గంలోనూ తాను తిరిగి ఒక్క సీటు కూడా రాకుండా ప్రచారం చేస్తానని సవాల్ చేశారు.  వారి గురించి ఎన్టీఆర్ ఏమన్నారో ప్రజలకు వివరిస్తానన్నారు.

రాజకీయాల్లోకి రావద్దు అని పురందరేశ్వరితో ఎన్టీఆర్ అన్నందుకే ఆయనపై కుట్ర చేసిందని సంచలన ఆరోపణ చేశారు లక్ష్మీపార్వతి. తండ్రిపై కోపంతోనే ఆమె కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిందని ఆరోపించారు. ఎన్టీఆర్ భార్యను అని తాము మెడలో బోర్డు పెట్టుకుని తిరగాలా అని ప్రశ్నించారు. ఎన్టీఆర్ తో పెళ్లి అయినట్లు ఫోటోలు, వార్తా కథనాలు సాక్ష్యాలుగా ఉన్నాయన్నారు. ఆయన ఎన్నో సార్లు బహిరంగంగా చెప్పారని గుర్తు చేశారు. కానీ తనపై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేశారని ఆరోపించారు. ఇక చంద్రబాబు, పురందరేశ్వరి, బాలకృష్ణ అందరినీ బయటకు లాగుతానని హెచ్చరిస్తూ వచ్చే ఎన్నికల తర్వాత వీళ్లు రాజకీయాల్లో లేకుండా చేస్తానని శపథం చేశారు.

Chandrayaan-3: ప్రజ్ఞాన్ రోవర్ కి తప్పిన పెను ప్రమాదం

Related posts

Video Viral: పోలింగ్ కేంద్రం వద్ద ఓటరు చెంప చెళ్లు మనిపించిన ఎమ్మెల్యే .. తిరిగి అదే రీతిలో ఎమ్మెల్యేపై .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

పోలింగ్ డే ట్విస్ట్‌: వైసీపీకి మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా.. ?

ఏపీ పోలింగ్ రోజు వైసీపీకి ఇన్‌డైరెక్టుగా మ‌ద్ద‌తు ఇచ్చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్ ?

Supreme Court: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో ఊరట

sharma somaraju

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

ప్రశాంత్ కిషోర్ సర్వే…. జగన్‌కు ఎన్ని సీట్లు అంటే.. ?

ఏంద‌య్యా ఇది…BRSకు మెజారిటీ సీట్లు… ప్రధానిగా కేసీఆర్… ?

పోలింగ్ ముందు రోజు పిఠాపురం వైసీపీలో ర‌చ్చ రచ్చ‌.. చేతులెత్తేసిన వంగా గీత‌..?

పవన్ కళ్యాణ్‌ను ఓడించేందుకు జగన్ కొత్త స్కెచ్.. రివీల్ అయ్యిందిగా..?

ఏపీ బీజేపీ ఆశ‌ల‌న్నీ వీళ్ల‌పైనే.. ఏం చేస్తారో…?

ఏపీలో ఈ జిల్లాలే డిసైడింగ్ ఫ్యాక్ట‌ర్‌.. ఇక్క‌డి జ‌నాలు తిన్న‌ది మ‌రిచిపోరు…!

PM Modi: రికార్డు స్థాయిలో ప్రజలు పోలింగ్ లో పాల్గొనాలి .. మోడీ

sharma somaraju

General Elections: కొనసాగుతున్న పోలింగ్ .. కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు

sharma somaraju