NewsOrbit
Bigg Boss 7 Entertainment News

Bigg Boss 7: బిగ్ బాస్ లవర్స్ కి గుడ్ న్యూస్ సీజన్ సెవెన్ లో రెండు హౌస్ లు..?

Advertisements
Share

Bigg Boss 7: సెప్టెంబర్ మూడవ తారీకు నుంచి బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదలుకానున్న సంగతి తెలిసిందే. తెలుగులో ఇప్పటివరకు ఆరు సీజన్స్ కంప్లీట్ అయ్యాయి. వీటిలో కొన్ని ఆకట్టుకోగా మరికొన్ని సీజన్స్ అట్టర్ ప్లాప్ అయ్యాయి. పరిస్థితి ఇలా ఉంటే ఇప్పుడు ఏడో సీజన్ మొదలయ్యాక మధ్యలో వన్డే క్రికెట్ వరల్డ్ కప్ టోర్నీ ఇండియాలో జరగనుంది. దీంతో ఈ టోర్నీ ఎఫెక్ట్ షోపై పడే అవకాశం ఉండటంతో షో నిర్వాహకులు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో సీజన్ సెవెన్ గతానికి భిన్నంగా చాలా వెరైటీగా ప్లాన్ చేయడం జరిగిందంట. దీనిలో భాగంగా ఈసారి హౌస్ లో ఉండే కంటెస్టెంట్స్ కి రెండు హౌస్ లు ప్లాన్ చేయడం జరిగిందట.

Advertisements

Good news for Bigg Boss lovers are two houses in season seven

20 మంది కంటెస్టెంట్స్ కి పదిమందికి ఒకటి మరో పదిమందికి ఇంకో హౌస్ ఉండబోతున్నట్లు సమాచారం. అంతేకాదు ప్రతి వీకెండ్ లో రెండు ఎలిమినేషన్లు ఉండబోతున్నట్లు కూడా టాక్ వినిపిస్తోంది. రెండు హౌస్ లు నుండి ఇద్దరు కంటెస్టెంట్స్ ఎలిమినేషన్ ఉండే రీతిలో ప్లాన్ చేస్తున్నారట. అంతేకాదు కెప్టెన్ కి స్పెషల్ బెడ్ రూం కూడా ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఈసారి గత సీజన్లకు భిన్నంగా చాలా డిఫరెంట్ గా గేమ్స్ తో పాటు టాస్క్ లు ఉండబోతున్నాయట. సినిమా ఇండస్ట్రీకి చెందిన వారిని ఎక్కువగా తీసుకున్నట్లు సమాచారం. వాళ్లయితే అందరికీ తెలిసిన ముఖాలు కావటంతో.. షో నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.

Advertisements

Good news for Bigg Boss lovers are two houses in season seven

అంతేకాదు ప్రతి వీకెండ్ లో ఈసారి స్పెషల్ ప్రోగ్రామ్స్ చాలా వైవిధ్యంగా ప్లాన్ చేయడం జరిగిందట. ఇదే సమయంలో వైల్డ్ కార్డు ఎంట్రీలు కూడా ఎక్కువ ఉండబోతున్నట్లు సమాచారం. గత కొన్ని సీజన్ ల నుండి వైల్డ్ కార్డు ఇంటర్వ్యూలు పెద్దగా లేవు. కానీ సీజన్ సెవెన్ లో.. వైల్డ్ కార్డు ఎంట్రీలు ఎక్కువ ఉండబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చే ఆదివారం నుండి షో మొదలు కాబోతున్న నేపథ్యంలో ప్రస్తుతం కంటెస్టెంట్స్… డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారట.


Share
Advertisements

Related posts

RC15: రామ్ చరణ్ మూవీలో సూర్య..??

sekhar

Oscars 2023: RRR కీ ఆస్కార్ రావటంపై చిరంజీవి రియాక్షన్..!!

sekhar

Naga Chaitanya: తాత నాగేశ్వరరావు శత జయంతి విగ్రహావిష్కరణలో భావోద్వేగంతో మాట్లాడిన నాగ చైతన్య…ఎవరు ఉహించనట్లు అక్కినేని అభిమానులకు కృతజ్ఞతలు చెప్తూ ఇలా చేసాడు!

Deepak Rajula