Chandrayaan-3: చంద్రుడి ఉపరితలంపై చక్కర్లు కొడుతూ అక్కడి పరిస్థితులపై అధ్యయనం చేస్తున్న ప్రజ్ఞాన్ రోవర్ కి పెను ప్రమాదం తప్పింది. తాను ప్రయాణిస్తున్న మార్గంలో నాలుగు మీటర్ల వెడల్పు గల బిలాన్ని గుర్తించింది ప్రజ్ఞాన్ రోవర్. ఇది గమనించిన ఇస్రో శాస్త్రవేత్తలు వెంటనే అప్రమత్తమైయ్యారు. రోవర్ కు కీలక ఆదేశాలు జారీ చేశారు. తన మార్గాన్ని మళ్లించుకోవాలని సూచించారు. దీంతో రోవర్ తన మార్గాన్ని మళ్లించుకుంది. ప్రస్తుతం ప్రజ్ఞాన్ రోవర్ సురక్షిత మార్గంలో పయనిస్తున్నదని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. ‘ఈ బిలాన్ని ప్రజ్ఞాన్ రోవర్ ఆగస్టు 27న 3 కిలో మీటర్ల దూరంలోనే గుర్తించింది. దీంతో మార్గం మార్చుకోవాలని వెంటనే రోవర్ ని ఆదేశించాం. ఇప్పుడది సురక్షితంగా కొత్త మార్గంలో పయనిస్తొంది’ అని ఇస్రో ఇవేళ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది.
చంద్రయాన్ – 3 ప్రయోగంలో భాగంగా ఈ నెల 23వ తేదీన విక్రమ్ ల్యాండర్ చంద్రుడి ఉపరితలంపై అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అప్పటి నుండి చంద్రుడి ఉపరితలంపై ల్యాండర్ మాడ్యూల్ రికార్డు చేస్తున్న దృశ్యాలను ఇస్రో సోషల్ మీడియాలో పంచుకుంటోంది. తొలుత ల్యాండర్ నుండి ప్రజ్ఞాన్ రోవర్ జారుకుంటూ కిందకు దిగిన దృశ్యాన్ని ఇస్రో సోషల్ మీడియాలో షేర్ చేసింది. అనంతరం శివశక్తి పాయింట్ (విక్రమ్ ల్యాండర్ ల్యాండర్ సైట్) వద్ద రోవర్ చక్కర్లు కొట్టిన వీడియోని విడుదల చేసింది ఇస్రో. తదుపరి అందులోని ఛేస్ట్ పేలోడ్ చంద్రుడి ఉపరితలంలోని నేల ఉష్ణోగ్రతల తీరును కొలిచిన వివరాల్ని గ్రాఫ్ తో సహా ఇస్రో వెల్లడించింది.
చంద్రయాన్ – 3 ప్రయోగం విజయవంతం కావడంతో చంద్రుడి ఉపరితలంపై కాలుమోపిన నాలుగో దేశంగా భారత్ నిలిచింది. అంతే కాకుండా దక్షిణ దృవంపై కాలు మోపిన తొలి దేశంగా భారత్ సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ ప్రాజెక్టు విజయవంతం అయిన ఉత్సాహంతో … ఇస్రో సెప్టెంబర్ 2వ తేదీన ఆదిత్య ఎల్ 1 అనే సోలార్ మిషన్ లాంచ్ చేసేందుకు సమాయత్తమవుతోంది. సూర్యుడి పుట్టుక, అక్కడి వాతావరణ పరిస్థితులు, సౌర ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరగడానికి గల కారణాలను విశ్లేషించేందుకు ఈ ప్రయోగాన్ని చేపడుతున్నారు.
ఢిల్లీ సాక్షిగా కుట్రలు చేయడం మీ మరిది గారికి అలవాటే చిన్నమ్మా..! – విజయసాయి రెడ్డి
Chandrayaan-3 Mission:
On August 27, 2023, the Rover came across a 4-meter diameter crater positioned 3 meters ahead of its location.
The Rover was commanded to retrace the path.It's now safely heading on a new path.#Chandrayaan_3#Ch3 pic.twitter.com/QfOmqDYvSF
— ISRO (@isro) August 28, 2023