NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Sharmila: సోనియా ది తప్పు కాదు అన్న వైఎస్ షర్మిలకి జన్మలో తలెత్తుకోలేని సమాధానం చెప్పిన సజ్జల!

YS Sharmila: తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకువస్తానంటూ వైఎస్ఆర్ టీపీ పేరుతో రాజకీయ పార్టీ పెట్టిన దివంగత సీఎం వైఎస్ఆర్ తనయ వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరికకు దాదాపు రూట్ క్లీయర్ అయిన సంగతి తెలిసిందే. వైఎస్ఆర్ టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి షర్మిల కాంగ్రెస్ కండువా కప్పుకోవడమే మిగిలింది. అటు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుండి ఇటు షర్మిల నుండి అధికారిక ప్రకటన అయితే ఇంత వరకూ విడుదల కాలేదు కానీ త్వరలో కాంగ్రెస్ పార్టీలోకి చేరికకు మూహూర్తం కుదరనున్నది. అయితే వైఎస్ఆర్ కుటుంబాన్ని అవమానించి ఇబ్బందుల పాలు చేసిన కాంగ్రెస్ పార్టీ గూటికే ఆయన తనయ వైఎస్ షర్మిల చేరుతుండటం పట్ల కొందరు వైఎస్ఆర్ టీపీ నేతలు, వైఎస్ఆర్ అభిమానుల నుండి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.

 

ఇప్పటికే వైఎస్ఆర్ టీపీ ముఖ్య నేత, వైఎస్ఆర్ వీరాభిమాని కొండ రాజేశ్వరరావు షర్మిల పార్టీకి గుడ్ బై చెప్పారు. ఓ టీవీ డిబెట్ లోనే తన రాజీనామా ప్రకటన చేసిన ఆయన షర్మిల తీసుకుంటున్న స్టెప్ ను తప్పుబట్టారు. అయితే తాజాగా వైఎస్ షర్మిల చేసిన కామెంట్స్ చూస్తే ఆమె ఇక కాంగ్రెస్ పార్టీ మనిషి అయినట్లుగానే ఉన్నాయి. తన తండ్రి దివంగత నేత వైఎస్ఆర్ 14వ వర్థంతి సందర్భంగా ఇడుపులపాయకు చేరుకుని ఆయన ఘాట్ వద్ద నివాళులర్పించిన వైఎస్ షర్మిల.. తన తండ్రిని తలుచుకుని భావోద్వేగానికి గురైయ్యారు.  అనంతరం మీడియాతో మాట్లాడిన షర్మిల తన పార్టీ ని కాంగ్రెస్ లో విలీనం చేసే విషయం మీద క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తో చర్చలు ఫలవంతంగా సాగాయనీ, అవి తుది దశకు చేరుకున్నాయని చెబుతునే .. విమర్శకుల కామెంట్స్ కు వివరణ ఇచ్చారు.

దివంగత వైఎస్ఆర్ అంటే కాంగ్రెస్ పార్టీ లోని అధినాయకులు అందరికీ అపారమైన గౌరవం ఉందన్నారు. వైఎస్ఆర్ ను అవమానించే వాళ్ల వద్ద తాను ఒక్క క్షణం కూడా ఉండనని అన్నారు. తన పార్టీ వాళ్లే దీనిపై ప్రశ్నిస్తున్నందున తాను సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో మాట్లాడిన మాటలను వివరిస్తున్నానన్నారు. సీబీఐ ఎఫ్ఐఆర్ లో వైఎస్ఆర్ పేరును చేర్చడంలో కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వకంగా చేసిన తప్పు కాదని షర్మిల స్పష్టం చేశారు. వైఎస్ఆర్ మరణించి పద్నాలుగు సంవత్సరాలు గడిచినా కూడా ఆయనను తాము మరచిపోలేదని వారు అన్నారన్నారు. ఆయన లేని లోటు ఈ రోజుకీ తెలుస్తొందని రాహుల్, సోనియా అన్నారని చెప్పారు. అవతలి వారు అంతగా చెప్పినతర్వాత వారిలో రియలైజేషన్ వచ్చిన తర్వాత వారిని అర్ధం చేసుకుని మిందుకు నడవడం మంచి విషయమే కదా అని అన్నారు. తాను అర్ధం చేసుకున్నట్లుగానే వైఎస్ఆర్ అభిమానులు కూడా ఈ విషయాన్ని అర్ధం చేసుకుంటారని భావిస్తున్నానన్నారు.

YS Sharmila

 

కాంగ్రెస్ పార్టీలో చేరిపోవడానికి డిసైడ్ అయినందున షర్మిల .. ఆ పార్టీ అధినేతలను వెనుకేసుకొస్తొందని అనే వాళ్లు ఉన్నారు. అయితే షర్మిలకు కాంగ్రెస్ పార్టీ ఎటువంటి హామీలు ఇచ్చింది.. షర్మిల తెలంగాణ, ఏపీలలో ఏ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సేవలు అందిస్తారు అనేది దానిపై ఇంత వరకూ క్లారిటీ రాలేదు. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం దాదాపు ఖాయమైన నేపథ్యంలో ఏపీలోని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు స్వాగతిస్తుండగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఏ విధంగానూ స్పందించలేదు. వైఎస్ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఈ అంశంపై బాహాటంగా అయితే స్పందించలేదు కానీ సన్నిహితుల వద్ద ఘాటుగానే స్పందించారని అంటున్నారు.

దివంగత నేత వైఎస్ఆర్ తనయుడు జగన్ పై అక్రమ కేసులు బనాయించడంతో పాటు 16 నెలల పాటు జైలు జీవితం గడిపేందుకు కారణమైన కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరుతుందని తాము ఊహించలేదన్నారుట. వైఎస్ఆర్ కుటుంబాన్ని తీవ్ర ఇబ్బందుల పాలు చేసిన కాంగ్రెస్ పార్టీలో ఆమె చేరడం వ్యక్తిగతమైనా వైఎస్ఆర్ అభిమానులు మాత్రం గతంలో జరిగిన విషాయలను మరచిపోలేదని అన్నారుట. రాష్ట్రానికి, వైఎస్ఆర్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ చేసిన అన్యాయం కారణంగానే ఆ పార్టీ ఏపీలో ఓటింగ్ శాతం పూర్తిగా కోల్పోయింది అన్న విషయం అందరికీ తెలిసిందే.

Jamili Elections: ‘నేను సిద్ధం , కానివ్వండి’ లండన్ నుంచే జమిలీ ఎన్నికలకి మోడీ తో జగన్ గ్రీన్ సిగ్నల్ !!

Related posts

Rahul Gandhi: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా – రాహుల్ గాంధీ

sharma somaraju

AP Elections 2024: పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి ఈసీ గుడ్ న్యూస్

sharma somaraju

Allu Arjun: అల్లు అర్జున్ పై నంద్యాలలో కేసు నమోదు .. ఎందుకంటే..?

sharma somaraju

YS Vijayamma: కుమారుడు జగన్ కు దీవెనలు .. కుమార్తె షర్మిలకు మద్దతుగా తల్లి విజయమ్మ ప్రకటన

sharma somaraju

జగన్ కోసం ప్రచారం చేయనున్న అల్లు అర్జున్ …!

ష‌ర్మిల‌ను అర్ధం చేసుకోలేనంత పిచ్చోళ్లా జ‌నాలు!

అవినాష్ విష‌యం.. జ‌గ‌న్ ఈక్వేష‌న్ స‌రైంద‌నేనా..?

రేవంత్‌ను జ‌గ‌న్ అన‌వ‌స‌రంగా కెలికారా?

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

Allu Arjun: ఎన్నికల వేళ అల్లు అర్జున్ బిగ్ ట్విస్ట్ .. వైసీపీ అభ్యర్ధి మద్దతుగా..

sharma somaraju

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Janasena: ఎట్టకేలకు కాకినాడలో పవన్ పర్యటనకు అనుమతి.. నేడు పిఠాపురంలో రామ్ చరణ్ ప్రచారం

sharma somaraju