NewsOrbit
Entertainment News Telugu TV Serials

Nuvvu Nenu Prema: అందరి ముందు దోషిగా నిలబడిన విక్కీ..తండ్రి ప్రేమ తిరిగి పొందిన పద్మావతి..

Nuvvu Nenu Prema today episode 03 october 2023 episode 431  highlights

Nuvvu Nenu Prema: నిన్నటి ఎపిసోడ్ లో పద్మావతి ని కృష్ణ కావాలని జైలుకు పంపిస్తాడు. ఏ తప్పు చేయని పద్మావతి మీద డ్రగ్స్ కేసు అంట కట్టి పద్మావతిని పోలీస్ స్టేషన్ కి పంపిస్తాడు కృష్ణ. పద్మావతి కోసం విక్కీ చాలా ప్రయత్నించి చివరకు పద్మావతి ఉన్న ప్లేస్ కి వెళ్తాడు విక్కి. పోలీస్ స్టేషన్లో పద్మావతిని చూసి విక్కీ చాలా కంగారు పడతాడు. అక్కడ ఉన్న ఎస్ఐ మీద విక్రమాదిత్య అరిచి పద్మావతిని రిలీజ్ చేయమంటాడు. పద్మావతి రిలీజ్ అయ్యి బయటకు వస్తుండగా ఇంట్లో అందరూ స్టేషన్ ముందు ప్రత్యక్షమవుతారు. ఎక్కడ విదేశాలకు వెళ్లాల్సిన వాళ్లు స్టేషన్ లో నుండి బయటకు రావడం చూసి ఇంట్లో అందరూ షాక్ అవుతారు.

Nuvvu Nenu Prema today episode 03 october 2023 episode 431  highlights
Nuvvu Nenu Prema today episode 03 october 2023 episode 431  highlights

ఈరోజు431 వ ఎపిసోడ్ లో,పద్మావతి విక్కి ఇద్దరూ స్టేషన్లో నుంచి బయటికి వచ్చి ఇంట్లో అందరి ముందు విక్కీ దోషగా నిలబడతాడు. పద్మావతి వాళ్ళ నాన్న పద్మావతిని ఓదారుస్తూ, నీకు ఎంత కష్టం వచ్చింది తల్లి అని అంటాడు. ఈ కష్టానికి కారణం తన మెలో తాళి కట్టిన తన భర్త ఏ నండి అని అంటుంది పార్వతి. పార్వతి అన్న మాటలకు పద్మావతి షాక్ అవుతుంది. ఏం బాబు నేనేమైనా తప్పు మాట్లాడానా నేను అన్నది కరెక్టే కదా అని మళ్ళీ విక్రమాదిత్య వైపు తిరిగి మాట్లాడుతుంది పార్వతి. అసలు మీరు చేసింది మీకు న్యాయంగా ఉందా బాబు చెప్పండి అని అంటుంది పార్వతి. మేము ఉన్నంతలో గుట్టుగా బతికాము ఈరోజు నీ వల్ల నా బిడ్డ పోలీస్ స్టేషన్ కి రావాల్సి వచ్చింది అని అంటాడు భక్త. నీకోసం మమ్మల్ని అందరినీ కాదనుకొని వచ్చిన పద్మావతికి మీరు ఇచ్చేది ఇదేనా అని అంటాడు భక్త. అది కాదు నాయనా అని పద్మావతి ఏదో చెప్పబోతుండగా ఏం మాట్లాడకు అమ్మ, గుండెల్లో పెట్టుకొని చూసి నిన్ను ఇలాంటి పరిస్థితుల్లో చూడాల్సి వస్తుందని అనుకోలేదు అంటాడు భక్త.

Nuvvu Nenu Prema: పద్మావతి ని కాపాడిన విక్కీ.. అందరి ముందు అల్లుడిని నిలదీసిన పార్వతి..

Nuvvu Nenu Prema today episode 03 october 2023 episode 431  highlights
Nuvvu Nenu Prema today episode 03 october 2023 episode 431  highlights

విక్కీని కొట్టిన అరవింద..

ఇక అందరూ పద్మావతిని ఈ పరిస్థితుల్లోకి విక్కీనే తీసుకొచ్చాడు అనిమాట్లాడుతూ ఉంటారు.అను నా చెల్లెలు ఏ రోజు కూడా మీరు తప్ప వేరే ప్రపంచం తెలియకుండా బతికింది ఇప్పుడు మీరు ఇలా చేయడంమనసు చాలా బాధపడుతుంది బావగారు అని అంటుంది అను.అసలు హనీమూన్ కానీ బయలుదేరిన వాడివి సడన్ గా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నావు అని అడుగుతాడు ఆర్యా. పద్మావతి చెప్పబోతుండగా అందరూ పద్మావతిని మాట్లాడియ్యకుండా విక్కినే సమాధానం చెప్పాలి అని అంటారు. మా అందరికీ సమాధానం చెప్పకపోయినా పర్వాలేదు అక్క దగ్గరైనా సమాధానం చెప్పు అని అంటాడు ఆర్య. తను ఎంత టెన్షన్ పడుతుందో నీకు ఏమన్నా తెలుసా అని అంటాడు ఆర్య. వెంటనే విక్కీ అరవింద దగ్గరికి వచ్చి నిలబడతాడు. అక్కఅది నేను అని సమాధానం చెప్పబోతుండగా అరవింద విక్కీ ని అందరి ముందు చేయి చేసుకుంటుంది. కోపంతో చెంప మీద ఒకటిస్తుంది. ముందు పద్మావతిని తీసుకొని ఇంటికి పదా ఇక్కడ కాదు మాట్లాడాల్సింది అని కోపంగా వెళ్లి కారేకి కూర్చుంటుంది.

Krishna Mukunda Murari: ఆ మాటతో ముకుందకి చుక్కలు చూపించిన ప్రభాకర్.. భవానీ నిర్ణయం..?

Nuvvu Nenu Prema today episode 03 october 2023 episode 431  highlights
Nuvvu Nenu Prema today episode 03 october 2023 episode 431  highlights

ఇంట్లో అందరి ముందు సారీ చెప్పిన విక్కీ..

ఇక అందరూ ఇంటికి వస్తారు పద్మావతి వాళ్ళ అమ్మ వాళ్ళు అందరూ ఇంటికి వస్తారు.అందరూ పద్మావతి నీవిక్కి ని చూసి ఇంట్లో ఉన్న శాంతాదేవి ఆపుతుంది.వెంటనే శాంతాదేవి విక్కీ తో,అసలు నువ్వు ఏం చేసావో నీకు అర్థం అవుతుందా, అందరూ నువ్వు ఇంటికి పెద్ద అని నీ మాట గౌరవిస్తుంటే, నువ్వేమో మాకు చెప్పకుండా ఇలాంటి పనులు చేస్తావా అని అంటుంది శాంతాదేవి. నిన్ను అమ్మ లా పెంచిన నీ అక్కకు నువ్వు విలువ ఇవ్వలేదు ఇప్పుడు కనీసం పెద్ద వాళ్ళు ఇంట్లోనానం ఉంది తను అడిగేదానికైనా సమాధానం చెప్పాలి కదా నువ్వు చెప్పు విక్కీ అని అరవిందా విక్కీ నిలదీస్తుంది.అసలు ఎందుకు అబద్ధం చెప్పి విదేశాలకు వెళ్తున్నానని రిసార్ట్ కి వెళ్ళావా చెప్పు అని నిలదీస్తుంది అరవింద.ఇప్పటికైనా మించి పోయింది లేదు నిజం చెప్పు విక్కీ అని అంటుంది.ఎంత అడిగినా వీడు నిజం చెప్పడు ఎందుకంటే చెప్తే ఇద్దరి మధ్య తగాదాలు ఉన్నాయన్న విషయం బయటపడుతుంది.అని మనసులో అనుకుంటాడు కృష్ణ.

Brahmamudi అక్టోబర్ 2 ఎపిసోడ్ 216: స్వప్న ని కిడ్నాప్ చేయించిన రాహుల్ ని కావ్య కనిపెట్టేసిందా..? వినాయక చవితి రోజు ఏమి జరగబోతుందంటే!

Nuvvu Nenu Prema today episode 03 october 2023 episode 431  highlights
Nuvvu Nenu Prema today episode 03 october 2023 episode 431  highlights

తండ్రి ప్రేమ తిరిగి పొందిన పద్మావతి..

కావాలని నేను ఏ పని చేయలేడు అక్క అని అంటాడు విక్కీ కావాలని చేయకపోయినా నా కూతురు బలైపోయింది కదా బాబు అని అంటాడు భక్త.పాప నా బిడ్డ నువ్వే సర్వస్వం అనుకోని నిన్నే నమ్ముకొని మమ్మల్ని అందరినీ కాదనుకొని నీతో తాళి కట్టించుకుందే అలాంటి తనను అక్కడ వదిలేసి ఎలా వెళ్ళిపోయావు ఆ పరిస్థితుల్లో నువ్వే ఉంటే వాళ్ళు స్టేషన్ కి తీసుకెళ్లే వాళ్ళు కాదు కదా, మీ పెళ్లయినప్పటి నుంచి ఇప్పటివరకు నేను ఒక ప్రశ్న కూడా నేను అడగలేదు ఎందుకో తెలుసా మీరిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుని పెళ్లి చేసుకున్నారు కదా అని నాకు నేను సర్ది చెప్పుకున్నాను. కానీ నా బాధ నేను లోపలే పెట్టుకున్నాను ఇప్పుడు అడుగుతున్నాను ఇప్పుడైనా సమాధానం చెప్పు విక్కీ అని అంటాడు భక్త. నా కూతురు ఏ తప్పు చేసిందని, అందరి ముందు ఇలా నుంచో పెట్టాల్సి వచ్చింది. నలుగురిలో మేము లేని వాళ్ళం అయ్యుండొచ్చు కానీ పరువు మర్యాద కలిగిన వాళ్ళము, ఇలా నా కూతురు పోలీస్ స్టేషన్ ముందు నువ్వు తీసుకెళ్లావంటే ఏమనాలి బాబు నిన్ను ఎవరు లేరు అనుకుంటున్నావా అడగడానికి నేనున్నాను తన తండ్రిని బతికే ఉన్నాను అంటాడు. దానికి పద్మావతి చాలా సంతోషిస్తుంది ఇన్నాళ్లు దక్కని తండ్రి ప్రేమ మళ్ళీ తిరిగి దక్కినందుకు ఆనందపడుతుంది. అందరు సంతోషం కోసం నీలో నువ్వే ఇంత బాధని అనుభవిస్తున్నావని నాకు తెలియదు తల్లి అని అంటాడు. అమ్మ అరవిందా నా బిడ్డని నువ్వు ఆడపడుచులా కాకుండా అమ్మలా ఏ కష్టం రాకుండా చూసుకుంటావనే కదా, నేను నిన్ను నమ్మి నా పిల్లల్ని నీ దగ్గర వదిలి పెట్టాను ఇప్పుడు నీ తమ్ముడు వల్లే నా బిడ్డకు ఎంత కష్టం వచ్చిందో చూసావు కదా అని అంటుంది పార్వతి. అరవింద విన్నావుగా ఆవిడే మందు నిన్ను నమ్మి నేను మాట ఇచ్చినందుకు మాట తప్పిందాంట్లో అందరి ముందు నన్ను దోషిని చేసావ్ విక్కీ అని అంటుంది అరవింద.

Nuvvu Nenu Prema: పద్మావతి ని కాపాడిన విక్కీ.. అందరి ముందు అల్లుడిని నిలదీసిన పార్వతి..

Nuvvu Nenu Prema today episode 03 october 2023 episode 431  highlights
Nuvvu Nenu Prema today episode 03 october 2023 episode 431  highlights
అందరి ముందు విక్కీని సేవ్ చేసిన పద్మావతి..

అందరూ విక్కీని తల మాట అనేసరికి పద్మావతి మీ అందరికీ జరిగింది తెలియక ఆయన్ని అంటున్నారు అసలు ఈ జరిగిందాంట్లో ఆయనకే ప్రమేయం లేదు. నేనే మాల్దీవులు వద్దు నాకు విమానం అంటే భయం నేను విదేశాలకు రాను రిసార్ట్ కి వెళ్దాము అని చెప్పాను. నా మీద ఎంతో ప్రేమ ఉంది కాబట్టి నా మాటని కాదని లేక తన రిసార్ట్ కి తీసుకు వెళ్ళాడు. అక్కడ ఇలా జరుగుతుందని మేము ఊహించలేదు అనుకొని పరిస్థితుల్లో ఇలా జరిగింది. మా వారికి నేనంటే చాలా ప్రేమ అందుకే మీ అందరికీ ముందు నన్ను తల మాట అంటారని నిజం చెప్పకుండా నింద తన మీద వేసుకొని నిలబడ్డాడు. ఇప్పటికైనా మమ్మల్ని అర్థం చేసుకోండి మేము ఒకరికొకరం బానే ఉన్నాము అని ఇంట్లో అందరి ముందు పద్మావతి విక్కీ ని కాపాడుతుంది. విక్కీకి ఏమీ అర్థం కాదు అలానే చూస్తూ ఉండిపోతాడు. ఇక కృష్ణ నేను అనుకున్నది ఏంటి ఇక్కడ జరుగుతుంది ఏమిటి అని అనుకుంటాడు మనసులో,పద్మావతి వాళ్ల నాన్నతో నాన్న ఇంతకాలం నువ్వు నాతో మాట్లాడలేదు ఇప్పుడు దేవుడు మనిద్దరిని కలపడానికే ఇలాంటి పరిస్థితుల్ని పెట్టి ఉంటాడు నువ్వు ఇక మీద ఏ భయాలు పెట్టుకోకుండా అమ్మ నువ్వు సంతోషంగా ఉండండి మా గురించి ఆలోచించొద్దు నన్ను నా భర్త బాగా చూసుకుంటున్నాడు అని అంటుంది. ఇక పద్మావతిని కుశల నీవల్ల మా విక్కి అందరి ముందు దోషలా నిలబడాల్సి వచ్చింది నువ్వు చేసిన తప్పుకి మా విక్కని అంటున్నారు.అని అంటూ ఉండగా విక్కీ ఇంకా చాలు పిన్ని తనని కూడా మీరు ఏమీ అనొద్దు ఇక అందరం ఈ విషయాన్ని మర్చిపోదాం ఇక్కడితో వదిలేద్దాము అని అంటాడు ఇక భక్త పార్వతి అందరూ ఇంటికి వెళ్లి పోతారు. పద్మావతి అందరి ముందు విక్కీని సారీ అండి నావల్ల మీరు బాధపడ్డారు ఇకమీదట మిమ్మల్ని బాధ పెట్టే పని ఏది చేయను అని చెప్పి విక్కిని తీసుకొని రూమ్ లోకి వెళుతుంది.పద్మావతి చేసిన పనికి కృష్ణకి బాగా కోపం వస్తుంది అందరి ముందు నింద తన మీద వేసుకొని విక్కీని కాపాడింది. రూమ్ లోకి వచ్చి ఉన్న వస్తువులన్నీ కింద పడేసి, నేనెంత ప్లాన్ చేశాను ఈ పద్మావతి మొత్తం నాశనం చేసింది తనని వదిలేసి వెళ్లిన విక్కీ మీదకోపం పెంచుకోకుండా పోనీలే పాపం అని అందరి ముందు వెనకేసుకొచ్చింది. విక్కీ అంటే తనకసలు ఇష్టం లేదు కదా మరి ఎందుకు ఇలా చేసింది అని అనుకుంటూ ఉంటాడు కృష్ణ. నిజం ఎందుకు దాచింది అందరి ముందు ఎందుకు విక్కిని కాపాడింది. ఇదంతా చూస్తుంటే గొడవల వల్ల వాళ్ళిద్దరూ ఒకరికొకరుదగ్గరవుతున్నారేమో అనిపిస్తుంది అనుకుంటాడు కృష్ణ.లేదు ఎట్టి పరిస్థితిలో వాళ్లు కలవకూడదు. ఈసారి వేసే ప్లాను వర్కౌట్ అయ్యేలా చూడాలి. ఎలాగైనా వాళ్ళిద్దరిని విడదీయాలి అని అనుకొంటున్నాడు కృష్ణ.

Nuvvu Nenu Prema today episode 03 october 2023 episode 431  highlights
Nuvvu Nenu Prema today episode 03 october 2023 episode 431  highlights
పద్మావతిని అర్థం చేసుకున్న విక్కీ..

ఎందుకు అందరి ముందు నిజం చెప్పకుండా, నింద నీ మీద ఎందుకు వేసుకున్నావ్ పద్మావతి అని అడుగుతాడు విక్కీ. తప్పు చేసింది నేను దోషి లా నిలబడింది నువ్వు ఎందుకు అని అడుగుతాడు విక్కి. నిన్ను అక్కడ వదిలిపెట్టి వెళ్లడం నాదే కదా తప్పు నేనే తప్పు చేశాను పద్మావతి ఆ విషయం ఇంట్లో వాళ్లకి తెలియకుండా నువ్వు ఎందుకు అబద్ధం చెప్పావు అని అంటాడు. మీకోసమే సారు అని అంటుంది పద్మావతి. మీరు ఇంట్లో అందరూ ముందు దోషుల నిలబడడం నాకు ఇష్టం లేదు అందరూ మీకు ఇంట్లో ఒక గొప్ప స్థానాన్ని ఇచ్చారు. ఆ స్థానాన్ని నావల్ల పోగొట్టుకోవడం నాకు నచ్చలేదు. మీరు అందరి ముందు ఎప్పుడూ ఒక మెట్టు పైనే ఉండాలి సారు అని అంటుంది. పద్మావతి నిజంగా నేను చేసిన దానికి సారీ అని అంటాడు విక్కీ. ఎప్పుడూ మన మధ్య ఇలాంటివి రాకూడదు సారు మీరు నాకు సారీ చెప్పడం ఏంటి చెప్పాను కదా మీరే తప్పు చేయలేదు. విధిరాత ఇలా రాశాడు నాకు అంతే నేను ఏది కావాలనుకున్న అది నాకు దక్కదు అని పద్మావతి బాధపడుతూ ఉంటుంది. నా సంగతి పక్కన పెట్టండి చాలు మీరు మాత్రం ఎప్పుడు గౌరవంగానే ఉండాలి. ఎవరి ముందు తలదించడానికి వీల్లేదు నావల్ల అయితే అస్సలు జరగకూడదు అని అంటుంది పద్మావతి విక్కీ ఏం చెప్పాలో తెలీక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.పద్మావతి శ్రీనివాసా మా ఇద్దరినీ ఒకటి చేయి స్వామి మా మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోయి మేము బాగుండేలా దీవించు అని అనుకుంటుంది.

Nuvvu Nenu Prema today episode 03 october 2023 episode 431  highlights
Nuvvu Nenu Prema today episode 03 october 2023 episode 431  highlights

రేపటి ఎపిసోడ్లో కృష్ణ ఒక బొకె నీ ఆర్డర్ చేస్తాడు. పార్సిల్ ఇంటికి వస్తుంది. ఒకే అందుకని కృష్ణ ఇవి పద్మావతికి ఇవ్వాలి అని మనసులో అనుకుంటాడు. విక్కీ అదే టైం కి అక్కడికి వస్తాడు గతంలో పద్మావతి గులాబీ పూలను చూసి నాకు ఎర్రగుల్ అభి అంటే చాలా ఇష్టం అని చెప్పిన మాటలు విక్కీకి గుర్తు వస్తాయి ఇవి పద్మావతి కోసమే తెప్పించాడు అని విక్కి అర్థమవుతుంది వెంటనే కోపంతో విక్కీ కృష్ణ వైపు చూస్తాడు.

Related posts

Murari: మురారిలో హీరోయిన్ పాత్ర‌కు ఫ‌స్ట్ ఛాయిస్ సోనాలీ బింద్రే కాదా.. అస‌లు మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

OTT Actress: ఒక్క వెబ్ సిరీస్ కు రూ. 250 కోట్లు రెమ్యున‌రేష‌న్‌.. ఓటీటీల్లో హైయెస్ట్ పెయిడ్‌ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత భ‌ర్త గౌత‌మ్ కు కాజ‌ల్ చూపించిన ఫ‌స్ట్ మూవీ ఏదో తెలుసా..?

kavya N

NTR: హ్యాపీ బ‌ర్త్‌డే ఎన్టీఆర్‌.. యంగ్ టైగ‌ర్ గురించి ప్ర‌తి అభిమాని తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే!

kavya N

Karthika Deepam 2 May 20th 2024 Episode: కార్తీక్ పై నుప్పులు చిందిన దీప.. కాంచనని నిలదీసి కడిగేసిన జ్యోత్స్న..!

Saranya Koduri

Brahmamudi May 20 Episode 414: మాయ జోలికి వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చిన రాజ్.. భర్తకి సవాల్ చేసిన కావ్య.. సుభాష్ పశ్చాత్తాపం.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 20 Episode 628: కృష్ణ నిజస్వరూపం అరవింద కు చెప్పిన విక్కి.. విక్కీని అవమానించిన అరవింద..గుడిలో నిజం తెలుసుకున్న అరవింద ఏం చేయనుంది?

bharani jella

Krishna Mukunda Murari May 20 Episode 474: అబార్షన్ చేయించుకున్న ముకుంద.. కృష్ణ మురారిల కోపం.. ముకుందని కొట్టిన కృష్ణ.. ముకుంద బ్లాక్మెయిల్..

bharani jella

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N