Nuvvu nenu Prema: నిన్నటి ఎపిసోడ్ లో,మాల్దీవులు కి తీసుకెళ్తానని విక్కీ పద్మావతిని దగ్గరలో ఉన్నది సార్ కి తీసుకొస్తాడు. కానీ ఇంట్లో అందరితో విదేశాల్లో ఉన్నట్టు చెప్పమని పద్మావతికి చెప్తాడు. పద్మావతి విదేశాలకు వెళ్తున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కానీ విక్కీ చేసిన పనికి చాలా బాధపడుతుంది. ఇక చేసేదేం లేక పద్మావతి ఇక్కడ రిసార్ట్ లో నుంచి వెళ్లే లోపు విక్కీ మనసు గెలుచుకోవాలి అని అనుకుంటుంది. దానికోసం తన ప్రయత్నాలన్నీ మొదలు పెడుతుంది.

ఈరోజు ఎపిసోడ్ లో పద్మావతి వికీ ఇద్దరు రిసార్ట్ లో డిన్నర్ కి వస్తారు అప్పుడు అక్కడ ఉన్న బేరర్ పద్మావతి వికీలకు రింగ్స్ ఇచ్చి వాళ్ళని ఒకరికి ఒకరు రింగ్స్ తోడగమని చెప్తాడు. బేరర్ తో విక్కి ఏంటి ఇదంతా అని కోపంగా అంటాడు. మా రిసార్ట్ లోకి వచ్చిన వాళ్లందరికీ ఇది స్పెషల్ గా ఇస్తాం సార్ అని అంటాడు బేరర్.పద్మావతి ఇదే మంచి సమయం నా మనసులో మాటని విక్కీ చెప్పేయాలి అని అనుకుంటుంది.

పద్మావతి కల..
ఇక పద్మావతి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఆ రింగ్స్ ని తీసుకొని, విక్కీని చేయి పట్టుకొని పక్కకు తీసుకువచ్చి అందరి ముందు విక్కీతో ఇలా అంటూ ఉంటుంది. మీరంటే నాకు చాలా ఇష్టం సారు నా మనసులో ఉన్న ప్రేమని మీకు చెప్పాలని అనుకుంటున్నాను. ప్రేమంటే ఇద్దరు వ్యక్తులు దూరంగా ఉన్నంత మాత్రాన లేకుండా ఉండదు వాళ్ళ మనసులు ఎప్పుడూ దగ్గరగానే ఉంటాయి. తపన పడే వారి కోసం నీ ప్రేమ కోసం నేను ఎంత కాలమైనా ఎదురు చూస్తూ ఉంటాను. మీ ప్రేమ కోసం నేను ఒకసారి కాదు వందసార్లు అయినా చావడానికి సిద్ధంగా ఉన్నాను.నా ఊపిరి మీరు నా సర్వస్వం మీరు మీరు లేని క్షణం నేను లేను. మీరు అంటూ లేకపోతే నేను కూడా లేను.మీరు నాతో కోపంగా మాట్లాడే అంత ద్వేషం మీకుంటే ఆ కోపాన్ని కూడా భరించే అంత ప్రేమ నాకున్నది. ఎందుకంటే నా ప్రేమ ఆకాశం ఎంత స్వచ్ఛమైంది. మన మధ్య ఈ బంధం ఎంతో బలమైంది. ఏడేడు జన్మలకు మనం ఇలానే కలిసి ఉండాలని నా మనసులో మాటను మీకు చెప్తున్నాను.ఐ లవ్ యు సారు ఐ లవ్ యు సో మచ్ అని పద్మావతి వికీ ప్రపోజ్ చేస్తుంది. రింగుని పద్మావతి విక్కీ చేతికి పెడుతుంది విక్కీ పద్మావతిని చాలా ప్రేమగా దగ్గరికి తీసుకుంటాడు. మీ మీద నాకు ఎంత ప్రేమ ఉందో ఆకాశాన్ని చూడండి తెలుస్తుంది అని పద్మావతి ఆకాశంలో ఐ లవ్ యు అని లైటింగ్ వేయిస్తుంది. అది చూసి విక్కీ చాలా సంతోషపడతాడు ఇద్దరూ ఒకరినొకరు హగ్ చేసుకుంటారు.విక్కీ కూడా పద్మావతిని నేను కూడా నిన్ను ఇష్టపడుతున్నాను ఐ లవ్ యు టూ అంటూ రింగు తీసి పద్మావతి ఫింగర్ కి పెడతాడు. పద్మావతి చాలా సంతోషపడుతూ ఉంటుంది.అప్పుడే బేరర్ మేడం మేడం అని పిలుస్తాడు. పద్మావతి కలలో నుంచి బయటికి వస్తుంది అంటే ఇప్పుడు దాకా జరిగిందంతా కల.
Krishna Mukunda Murari: మధు చెప్పింది కృష్ణ పాటిస్తుందా.!? ముకుంద కి ఝలక్ ఇచ్చిందా.!?

పద్మావతి విక్కి లను చూసిన కృష్ణ..
ఇక బేరర్ మేడం ఇదిగోండి రింగ్స్ అని ఇస్తాడు అప్పుడే పద్మావతి ఇప్పటిదాకా కలగన్న నేను అని అనుకోని ఇదంతా నిజమైతే ఎంత బాగుందో అనుకుంటూ ఉంటుంది అప్పుడే అక్కడికి కృష్ణ వస్తాడు పద్మావతి విక్కి లను చూసి మీరిద్దరూ ఎక్కడ ఉన్నారా? ఇక్కడ దాక్కుంటే నేను కనుక్కోలేను అనుకున్నారా విక్కీ ఇప్పుడు నేను మిమ్మల్ని చూశాను ఇక నేను చేయాల్సింది నేను చేస్తాను నేను చేసే పని మీరు ఊహించి ఉండరు ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉండండి అని మనసులో అనుకుంటూ పద్మావతి విక్కి ల టేబుల్ పక్కన ఉన్న టేబుల్ దగ్గర మాస్క్ టోపీ పెట్టుకుని వాళ్లకు తెలియకుండా వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు.

పద్మావతి ఆనందం..విక్కీ కోపం..
ఇక బేరర్ పద్మావతి వికీలను రింగ్స్ తోడుక్కోమని చెప్తాడు ఇక వ్యక్తి అందరి ముందు నేను ఇప్పుడు రింగ్ తనకి ఇవ్వకపోతే ఇక్కడున్న వాళ్లంతా ఏమైనా అనుకుంటారేమో అని సరే అని పద్మావతికి రింగ్ రింగు పెడుతూ ఐ లవ్ యు అని చెప్తాడు పద్మావతి మాత్రం నిజంగా చెప్పాడేమో అనుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది.మనిషిని బ్రతికించే శక్తి ప్రాణానికే కాదు సార్ ప్రేమ కూడా ఉంటుంది. నా పైన మీకు చాలా ప్రేమ ఉన్నది. ఇంకా ప్రేమ నేను వదులుకోవాలి అనుకోవట్లేదు. అందుకే ఇప్పుడు నా మనసులో మాటని మీకు చెప్పాలనుకుంటున్నాను. ఐ లవ్ యు సారు. ఐ లవ్ యు సో మచ్ అని విక్కీకి ప్రపోస్ చేసి రింగ్ తోడుకుతుంది పద్మావతి. ఇదంతా కృష్ణ దూరం నుంచి గమనిస్తూ ఉంటాడు. ఇక అక్కడి వాళ్లంతా పద్మావతి విక్కి లను చూసి క్లాప్స్ కొడతారు.ఇక బేరర్ మీరు కూర్చోండి సార్ నేను వెళ్లి డిన్నర్ తీసుకువస్తాను అంటాడు. పద్మావతి వికీ తిరుగు కూర్చుంటారు ఇక విక్కీ పద్మావతి తో ఏంటి నేను ఇప్పుడు చేసిందంతా నిజం అనుకుంటున్నావా నీకు అంత సీన్ లేదు.ఏదో ఇక్కడ అందరూ ఉన్నారని వాళ్ళ ముందు బాగోదని నేను నీకు రింగు తోడిగాను అంతేకానీ నిజంగానే నేను నా భార్యగా ఒప్పుకున్నట్టు కాదు. ఇక్కడున్న వాళ్లు అనుమానించకూడదు కదా మనల్ని అందుకనే రింగ్తోడిగాను అంటాడు. నువ్వంటే నాకెప్పటికీ ప్రేమ పుట్టదు. వెంటనే పద్మావతి చాలా బాధగా అనుమానం వస్తుందని పెట్టారా కానీ నేను మాత్రం అలా పెట్టలేదు సార్. నేను నిజంగానే మిమ్మల్ని ప్రేమిస్తున్నాను ఇంతకాలం మీ ప్రేమను దూరం చేసుకున్నాను ఇకమీద చేసుకోవాలి అనుకోవట్లేదు ఇది నిజం సార్ అని అంటుంది. పద్మావతి ఇప్పటిదాకా నటించినది చాలు జీవించాలి అనుకోకు అంటాడు విక్కీ.ఏం మాట్లాడుతున్నారు సారు నాకు మీరంటే చాలా ఇష్టం ఉంది ఆ విషయం నేను చెప్పకుండా ఇన్నాళ్లు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను కానీ ఇప్పుడు అలా చేయాలనుకోవట్లేదు, మీక్కూడా నేను ఎంత ప్రేమిస్తుంది తెలియాలని చెప్పాను ఇందులో నేనేం మాయ చేయడం లేదు. విక్కీ మాత్రం కోపంగా నువ్వు ఎన్ని మాయమాటలు చెప్పినా, నీపై నాకు ఎప్పటికీ ప్రేమ పుట్టదు పుట్టదు అని చెప్పేస్తాడు కోపంగా, దట్స్ ఇట్ అని అక్కడి నుంచి పద్మావతి చెప్పేది కూడా వినకుండా లేస్తాడు. వెంటనే పద్మావతి ఎక్కడికి సారు అని అంటుంది నీతో పాటు కలిసి కూర్చొని అన్నం తినాలన్నా నాకు నచ్చట్లేదు అంటాడు. నా మీద ఉన్న కోపాన్ని అన్నం మీద చూపిస్తారా, డిన్నర్ వచ్చేస్తుంది కదా తినేసి వెళ్దాం కూర్చోండి అని అంటుంది. నాకు ఇప్పుడు తినాలని లేదు అని అక్కడి నుంచి పద్మావతిని వదిలిపెట్టి బయటికి వెళ్లిపోతాడు.
Nuvvu Nenu Prema: ఎప్పుడూ చూపించని తన ఫ్రెండుని చూపించిన పద్మావతి.

కృష్ణ ప్లాన్ అమలు.. పోలీస్ స్టేషన్ కి పద్మావతి..
ఇక పద్మావతి విక్కి వెళ్లిపోగానే బాధపడుతూ నేను ఎంత చెప్పినా ఈయనకి అర్థం కావట్లేదు నేనేం చెప్పి మిమ్మల్ని మార్చాలి సారు అని అనుకుంటూ ఉంటుంది మనసులో, శ్రీనివాస ఈ బాధను భరించేదెలాగు, అని మనసులో బాధపడుతూ ఉంటుంది. ఇది ఎంతసేపైనా విక్కీ రూమ్ కి రాడు పద్మావతి ఒక్కతే బయటికి వచ్చి కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. విక్కీ తనకి తాళి కట్టడం, కోపంతో ఇంట్లో వాళ్ళ మీద అరవడం. పెళ్లి చేసుకోలేదు చేసుకోలేదు అని ఇప్పటిదాకా ఎగబడ్డారు ఇప్పుడు చేసుకుని ఇంటికి వస్తే మీకు నచ్చట్లేదు ఎందుకు అని అరవింద్ మీదవిక్కీ అరవడం పద్మావతి గుర్తు చేసుకుంటుంది. అలాగే పద్మావతిని కాపాడేటప్పుడు నీకు మా బావకి ఎంగేజ్మెంట్ అయింది కదా అని విక్కీ నిలదీయడానికి కూడా పద్మావతి గుర్తు చేసుకుంటుంది. ఇక పద్మావతి విక్కీతో జరిగిన గొడవలను గుర్తుచేసుకొని బాధపడుతూ అక్కడే ఏడుస్తూ ఉంటుంది.ఇక కృష్ణ కూడా పద్మావతి ఎనక వైపే ఉంటాడు కానీ పద్మావతి కృష్ణుని చూసుకోదు. కృష్ణ కూడా పద్మావతి అన్నమాటలని గుర్తు చేసుకుంటూ రగిలిపోతూ ఉంటాడు. నువ్వు నమ్మకద్రోహం చేశావు అరవింద గారిని మోసం చేస్తున్నావు అందుకే నాకు నువ్వంటే అసహ్యం అని పద్మావతి అనడం మరియు పద్మావతి తాళిబొట్టు చూపించి నాకు మా ఆయనకి అగ్నిసాక్షిగా పెళ్లయింది. అందుకనే మేము ఎంత కొట్టుకున్నా కలిసే ఉంటాము ఈ తాలిబంధం విడదీయడం నీవల్ల కాదు అని అనడం అన్ని కృష్ణ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇక పద్మావతి నీ ఎలాగైనా దెబ్బ కొట్టాలని పక్కనే డ్రగ్స్ తీసుకుంటూ కొంతమంది పిల్లలు ఉంటారు అది పద్మావతి గమనించుకోదు. కృష్ణ అదే అదును భావించి పోలీసులకి ఫోన్ చేసి ఇక్కడ దూరంగా వున్నా రీసార్ట్ కొంతమంది డ్రగ్స్ తీసుకుంటున్నారు మీరు వెంటనే వస్తే పట్టుకోవచ్చు అని పోలీసులకి చెప్తాడు. వెంటనే పోలీసులు ఇప్పుడే వస్తున్నాము అని బయలుదేరుతారు ఇక పద్మావతి మాత్రం అక్కడే కూర్చుని ఉంటుంది కృష్ణ కావాలని పక్కన పిల్లల దగ్గర ఒక డ్రగ్స్ ప్యాకెట్ తీసుకొని పద్మావతి దగ్గర పెట్టేసి ఏమీ తెలియనట్టు వెళ్తాడు ఇక పోలీసులు వచ్చి పద్మావతిని పద పోలీస్ స్టేషన్ కి అని అంటారు నాకేం తెలియదండి అని అంటుంది పద్మావతి తెలియదంటే ఊరుకుంటామా, డ్రెస్ తీసుకున్నది కాక ఇంకా తెలియదు అని చెప్తున్నావా పదా అంటారు పోలీసులు పద్మావతి మాత్రం నాకేం తెలియదు నన్ను వదిలిపెట్టండి అని బతిమిలాడుతుంది అయినా వినకుండా పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్తారు.

నిజం తెలుసుకున్న విక్కీ..
ఇక పద్మావతి పోలీస్ స్టేషన్లో నేను ఒకసారి మా వారికి ఫోన్ చేసుకుంటాను. అని అంటుంది దొరికిన వాళ్లంతా ఎలాంటి కబుర్లే చెప్తారు నువ్వు సైలెంట్ గా ఉండు లేకపోతే మేము వేరే మార్గంలో నిన్ను ఇబ్బంది పెట్టాల్సి వస్తుంది అని సిఏ హెచ్చరిస్తూ ఉంటుంది పద్మావతిని అయినా పద్మావతి వినదు మా వారు అక్కడ నా కోసం ఎదురుచూస్తున్నారు నేను లేకపోతే నాకోసం ఆందోళన పడతారు ఒక్క యొక్క ఫోన్ చేసుకుంటాను మా వారికి అని అంటుంది కానీ పోలీసుల వినకుండా పద్మావతి నీ లాకప్ లో వేస్తారు. పద్మావతి ఏడుస్తూ ఉంటుంది ఇక విక్కీ రిసార్ట్ కి తిరిగి వస్తాడు అప్పుడే అక్కడ ఉన్న మేనేజర్ విక్కీ అని పిలిచి జరిగింది చెప్తాడు. ఇక్కడ డ్రగ్స్ దొరుకుతున్నాయని పోలీసులకు ఇన్ఫర్మేషన్ వచ్చింది వాళ్ళు రైడ్ చేస్తే అందులో పద్మావతిని కూడా తీసుకువెళ్లారు సార్ అని చెప్తాడు ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు అని విక్కీ కాలర్ పట్టుకుంటాడు మేనేజర్ ది అయినా కానీ మేనేజర్ నేనేం చేయలేకపోయాను సార్ అని అంటాడు నా భార్య నువ్వు చెప్పాలి కదా అని అంటాడు చెప్పినా వాళ్ళు వినలేదు సార్ తీసుకెళ్లిపోయారు అని అంటాడు.

రేపటి ఎపిసోడ్లో విక్కీ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తాడు. లోపలికి వెళ్లి తను ఎవరనుకొని లోపల పెట్టారు నా భార్య అని అరుస్తాడు. నేను అగ్నిసాక్షిగా పెళ్లాడిన నా భార్య అని అంటాడు దానికి పద్మావతి లాక్ అప్లో చాలా సంతోషపడుతుంది వెంటనే పద్మావతిని విడిపిస్తారు. పద్మావతి విక్కీని హగ్ చేసుకుంటుంది విక్కీ పద్మావతిని ఓదారుస్తాడు.