Krishna Mukunda Murari: మురారి కృష్ణ తల తుడుస్తాడు. అలా తలతుడస్తుండగా కృష్ణ హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే కృష్ణ ఎ సి పి సార్ మీరు ఎవరైనా ప్రేమిస్తున్నారా అని అడిగితే ప్రేమిస్తున్నాను అని ఇన్ డైరెక్టుగా కృష్ణ పై తన మీద ఉన్న ప్రేమని బయటకు వ్యక్తపరుస్తాడు. అది తననే అని చెప్పకపోవడంతో కృష్ణ సైలెంట్ అవుతుంది. నిన్నే అంతగా ప్రేమిస్తున్నానని చెబితే నువ్వు ఎలా ఫీలవుతావోనని భయంగా ఉంది అని మురారి మనసులో అనుకుంటాడు. అదేంటి నన్ను ప్రేమిస్తున్నారని అత్తయ్య చెప్పింది కదా.. మరి ఆ ప్రేమను నాతోనే చెప్పొచ్చు కదా అని కృష్ణ మనసులో అనుకుంటుంది.

ముకుందా హ్యాపీగా సెల్ఫీ తీసుకుంటూ ఉండాలి. ఎంత హ్యాపీగా ఉన్నావు అని అడుగుతుంది. కొంపతీసి మీ విషయం కృష్ణకు తెలిసిపోయిందా అని అంటే ఎన్ని రోజుల నుంచి మనం కృష్ణకి నిజం తెలియలేదు అని అనుకున్నాం కానీ, కృష్ణకు నిజం తెలిసిపోయిందని నిన్న కృష్ణ ముకుందా మధ్య జరిగిన సన్నివేశాన్ని పూసగుచ్చినట్టు అలేఖ్యకు వివరిస్తుంది. ముకుందా అయితే ఇప్పుడు వార్ ఇద్దరి మధ్య మొదలైంది అని అలేఖ్య అంటుంది. కాదు ఈ వార్ లో నేను మాత్రమే గెలుస్తాను అని ముకుందా అంటుంది. అలేఖ్య ఇప్పటివరకు నువ్వు నాకు తోడుగా ఉన్నావు. మురారిని నేను సొంతం చేసుకునే వరకు నువ్వు నాకు తోడుగా ఉండాలి అని ముకుందా అంటుంది. సరే ఉంటాను అని అలేఖ్య అంటుంది.

మురారి వాళ్ళ అమ్మ దగ్గరకు వెళ్లి కృష్ణను నేను ప్రేమిస్తున్నాను అన్న విషయం తనకి చెప్పవా లేదా అని అడుగుతాడు. చెప్పాను అని రేవతి అంటుంది. అయితే ఇంకా కృష్ణ ఎందుకు నన్ను దూరంగా వచ్చింది అని అంటుంది. ఈ సమస్యకు ఒకటే పరిష్కారం మురారి నువ్వు తనని ప్రేమిస్తున్న సంగతి తనకి సాధ్యమైనంత త్వరగా చెప్పే అలాగే ముకుంద ముందు ఇంకా ఎక్కువగా కృష్ణతో క్లోజ్ గా ఉండు, అప్పుడు అదే నీ ప్రేమను అర్థం చేసుకుంటుంది. త్వరగా నీ మనసులో ఉన్న మాటని కృష్ణకు చెప్పేమని సలహా ఇస్తుంది రేవతి. సరే అంటాడు మురారి.

మురారి ఎలాగైనా సరే తన ప్రేమ విషయాన్ని కృష్ణ తో చెప్పేయాలని అనుకుంటాడు అప్పుడే కృష్ణ కి ఏదో ఫోన్ వస్తే ఆ ఫోన్ తీసుకురమ్మని చెబుతుంది హంతకి అని పేరు ఉంటుంది ఇక కృష్ణ తనతో మాట్లాడిన తర్వాత హంతకి గురించి చెబుతుంది ఆ స్టోరీ అచ్చం ముకుందా మురారి కృష్ణకులాగానే ఉంటుంది అంతకి తన భర్త జోలికి వచ్చిన అమ్మాయిని చంపేసి మూడేళ్లు జైలుకు వెళ్ళింది అని కృష్ణ చెబుతుంది ఆ స్టోరీ విన్న మురారి తన ప్రయత్నాన్ని విరమించుకుంటాడు.

మధు ఏదో ఆలోచిస్తూ ఉండగా కృష్ణ అక్కడికి వస్తుంది. ఏంటి కృష్ణ అంత సంతోషంగా ఉన్నావు. ముకుంద విషయం నీకు తెలిసిందని తనకి తెలిసిపోయిందా అని మధు అడుగుతాడు. నిన్న అసలు ఏం జరిగిందంటే అని కృష్ణ ముకుంద తన మధ్య జరిగిన విషయాన్ని పూస గుచ్చినట్టు మధుకి చెబుతుంది. అంటే ఇప్పుడు ఇద్దరూ వార్ స్టార్ట్ చేశారా అని మధు అడుగుతాడు. అవును అని కృష్ణ అంటుంది. వామ్మో ఈ విషయం పెద్దది తెలిస్తే ఎలా ఉంటుందో అని భయంగా ఉంది అని కృష్ణ అంటుంది నిజమే ఈ గొడవ ప్రతి ఇంట్లోది జరిగేది అయితే కామన్ అనుకోవచ్చు కానీ అలా జరగదు కదా అని మధు అంటాడు. కృష్ణ ముకుందా చాలా స్పీడ్ తనకి పొగరు ఎక్కువ. ఈగో ఎక్కువ. నాకు ఒకటి చెప్పనా.. నువ్వు మురారి ఇద్దరూ మా అందరి ముందు ఫ్రెండ్లీగా చాలా క్లోజ్ గా ఉంటారు కదా అలా ఉండకండి అని మధు కృష్ణ కి సలహా ఇస్తాడు. ఆ మాటకి కృష్ణ మాడిపోతుంది.

ఇక రెపటి ఎపిసోడ్ లో ముకుంద మీ కాపురం మూడున్నళ్ళ ముచ్చటే అని అంటుంది. కృష్ణ ముకుంద ఇద్దరు వారి వారి మనసులోని మాటను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు. కృష్ణ కాన్ఫిడెంట్ గా పరాయి భర్తని ఎలా కోరుకుంటున్నావని ముకుంద కి చివాట్లు పెడుతుంది. ఆదర్శ్ తో నీ లైఫ్ ఊహించుకుంటూ ఉండు బాగుంటుంది అని సలహా ఇస్తుంది. అది ఎప్పటికీ జరగదు అని ముకుందా అంటుంది. అది జరిపించేది నేనే అని అంటుంది కృష్ణ.