NewsOrbit
Entertainment News Telugu TV Serials

Nuvvu Nenu Prema: పద్మావతి కి ఐ లవ్ యు చెప్పిన విక్కీ.. విక్కీ ప్లాన్ కనిపెట్టిన కృష్ణ…

Nuvvu Nenu Prema today episode 29 september 2023 episode 429  highlights
Share

Nuvvu Nenu Prema: నిన్నటి ఎపిసోడ్ లో, పద్మావతి కోసం అరవింద మాల్దీవులు వెళ్లడానికి ఫ్లైట్ టికెట్లు బుక్ చేయిస్తుంది కృష్ణ చేత, విక్కీకి ఇష్టం లేకపోయినా అరవింద కోసం సరే అని చెప్తాడు. పద్మావతి విదేశాలకు వెళ్తున్న అందుకు చాలా సంతోషపడుతుంది. తన ఫ్రెండ్స్ కి వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి విదేశాలకు వెళ్తున్నాను మా వారితో అని చెబుతుంది. కానీ విక్కీ పద్మావతి ని విదేశాలకు తీసుకెళ్లడు తనప్లాన్ ప్రకారం ఒక రిసార్ట్ కి తీసుకెళ్తాడు.

Nuvvu Nenu Prema today episode 29 september 2023 episode 429  highlights
Nuvvu Nenu Prema today episode 29 september 2023 episode 429 highlights

Nuvvu Nenu Prema: పద్మావతి సంతోషం కోసం అరవింద ప్లాన్.. విక్కీ ఏం చేయనున్నాడు?

ఈరోజు ఎపిసోడ్ లో, విక్కీ పద్మావతులు రిసార్ట్ కి వెళ్తారు. పద్మావతి ఇష్టం లేకపోయినా విక్కీ ఎలా చెప్తే అలానే వింటాను అని చెప్తుంది. అక్కడ రిసెప్షన్లో మీ పేరుతో పాటు మీతో వచ్చిన వాళ్ల పేరు కూడా రాయాలి అని అంటుంది. కానీ విక్కీ తన పేరు మాత్రమే రాస్తాడు. వెంటనే పద్మావతి మా ఆయనకి సిగ్గు ఎక్కువ అందుకనే నా పేరు రాయలేదు నేను రాస్తాను ఇటు ఇవ్వండి అని బుక్ లోవిక్కీ పేరు పక్కన తన పేరు కూడా రాసి నేను తన భార్యని అని చెబుతుంది.మీరు ఎన్ని రోజులు ఉందామనుకుంటున్నారు అని అడిగితే విక్కీ నాలుగు రోజులు అంటాడు పద్మావతి కాదు వారం రోజులు ఉందాం అని అంటుంది. విక్కీ ఒకసారి కోపంగా చూస్తాడు వెంటనే మా ఆయన పేరు చెప్తే అదేనండి నాలుగు రోజులే అని అంటుంది. విక్కీ కోపంగా పక్కకు వస్తుంటే పద్మావతి పిలుస్తుంది ఎందుకో నువ్వు ఎక్కువగా బిల్డప్ ఇస్తున్నావు అందరి ముందు అని అంటాడు విక్కీ. మీరే కదా అందరిలో ఉన్నప్పుడు భార్యగా నటించమన్నారు నేను అదే చేస్తున్నాను అని అంటుంది పద్మావతి. మీకీ కోపంగా రూమ్ కి బయలుదేరుతాడు.పద్మావతి కూడా విక్కీని అనుసరిస్తూ తన వెనకాలే వెళ్తూ ఉంటుంది బ్యాక్ గ్రౌండ్లో సాంగ్ ప్లే అవుతూ ఉంటుంది.

Krishna Mukunda Murari: మధు చెప్పింది కృష్ణ పాటిస్తుందా.!? ముకుంద కి ఝలక్ ఇచ్చిందా.!?

Nuvvu Nenu Prema today episode 29 september 2023 episode 429  highlights
Nuvvu Nenu Prema today episode 29 september 2023 episode 429 highlights

ఆర్య అల్లరి కుచల కోపం..

ఆర్యబయటికి వెళ్లి పూలు తీసుకొని వస్తాడు.ఎవరు చూడకుండా అనుకి ఇద్దామని అను అని పిలుస్తూ ఉంటాడు అప్పుడే అక్కడికి అరవింద వస్తుంది.ఏంట్రా ఈ టైంలో బయటికి వెళ్లి వస్తున్నావు అని అడుగుతుంది అరవింద కనిపించకుండా విక్కీ పులని అని షర్ట్లో పెట్టుకుంటాడు. ఏం లేదు అక్క ఆఫీస్ పని మీద బయటకు వెళ్లి వస్తున్నానని అబద్ధం చెప్తాడు. అరవింద పూలనీ షర్ట్లో దాచుకోవడం గమనిస్తుంది వెంటనే ఆట పట్టిద్దామనిఆర్యా ఇప్పుడు నీకు ఎన్నో నెలరా అని అంటుంది.అప్పుడే అక్కడికి కుచల లో కూడా వస్తుంది.ఏంటి అరవింద అలా అడుగుతున్నావు ఆర్య అని అంటుంది.వెంటనే అరవిందా ఎలాగైనా కుచల నుండి వీళ్ళని తప్పించాలి లేదంటే ఇప్పుడు ఇదంతా బయటపడితే కుచల కోప్పడుతుంది అని మనసులో అనుకొని ఏం లేదు పిన్ని ఊరికే అంటున్నాను అని అంటుంది.కానీ కుచల మాత్రం వదిలిపెట్టకుండా ఏంటి మీరంతా ఇక్కడేం మాట్లాడుకుంటున్నారు అని అంటుంది.వెంటనే ఆర్య అరవింద్ కు సరిగా చేస్తాడు ఎలాగైనా ఇక్కడి నుంచి కాపాడు అమ్మని పంపించేసేయని,వెంటనే అరవిందా అను ఆర్య కి నిద్ర వస్తున్నట్లుంది. మీరు వెళ్లి పడుకోండి అని అంటుంది వెంటనే కుచ్చుల అరే ఆగు ఎక్కడికి వెళ్ళేది ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియాలి అయినా నువ్వేంటి ఏందో తేడాగా కనిపిస్తున్నావు అని అంటుంది. అయినా నీకేంటి పొట్ట వచ్చింది అని అంటుంది కచల, ఆర్య ఇంటి భోజనం చేస్తున్నాను కదమ్మా అందుకని అని అంటాడు కాదు ఏదో ఉంది నువ్వేదో దాచి పెడుతున్నావ్ బయటికి తీముందది అని అంటుంది వెంటనే ఇక చేసేదేం లేక ఆర్య పూల ని బయటకు తీసి చూపిస్తాడు దానికి కుచలకి చాలా కోపం వస్తుంది. అక్క చెల్లెలు ఇద్దరు మా పిల్లల్ని బానే బొట్లు వేసుకున్నారు చీ మీరు ఎప్పటికీ మారండి మిమ్మల్ని ఎలా మార్చాలో కూడా నాకు అర్థం కావట్లేదు అని కోపంగా ఆర్యవైపు అణువైపు చూసి వెళ్ళిపోతుంది అరవింద పిన్ని మాటలు మీరేం పట్టించుకోకండి. మీరు సంతోషంగా గడపండి అని చెప్పేసి వెళ్ళిపోతుంది ఆర్య అనుకి పూలని ఇస్తాడు.

Nuvvu Nenu Prema: పద్మావతి సంతోషం కోసం అరవింద ప్లాన్.. విక్కీ ఏం చేయనున్నాడు?

Nuvvu Nenu Prema today episode 29 september 2023 episode 429  highlights
Nuvvu Nenu Prema today episode 29 september 2023 episode 429 highlights

కృష్ణ అనుమానం..

కృష్ణ కి ఫోన్ వస్తుంది.మీరు మాల్దీవులు వెళ్లడానికి రెండు టికెట్లు బుక్ చేశారు కదా విక్రమ్ ఆదిత్య పద్మావతి పేర్లమీద అని అడుగుతాడు ఫోన్లో,కృష్ణ అవునండి ఏమైంది ఇప్పుడు అని అంటాడు.వాళ్ళిద్దరూ ఇంతవరకు ఎయిర్పోర్ట్ కి రీచ్ అవ్వలేదు సార్ అని అంటాడు.కృష్ణ ఏంటి మీరు మాట్లాడేది అని అంటాడు అవును సార్ మీరు బుక్ చేసిన టికెట్లు వాళ్ళు ఇంత బడికి వాళ్లు ఎయిర్పోర్ట్ కి రీచ్ అవ్వలేదని మా వాళ్ళు ఫోన్లో చెప్పారు మీరు ఏమైందో కనుక్కుందాము అని చేశాను వస్తున్నారా సార్ వాళ్లు అని అంటాడు.కృష్ణ వెంటనే నాకు తెలియదండి నేను కనుక్కొని చెప్తాను అని అంటాడు సరే అంటారు.కృష్ణకి అనుమానం వస్తుంది విక్కీ ఏదో చేసి ఉంటాడు అంటే వీళ్ళు విదేశాలకు వెళ్లలేదన్నమాట ఇక్కడే ఎక్కడో ఉన్నారు వీళ్ళు ఎక్కడున్నారో నేనిప్పుడే కనిపెట్టేయాలి అనుకొని కారులో బయలుదేరుతాడు కృష్ణ.

Nuvvu Nenu Prema today episode 29 september 2023 episode 429  highlights
Nuvvu Nenu Prema today episode 29 september 2023 episode 429 highlights

కృష్ణ కొత్త ప్లాన్..

పద్మావతి వాళ్లను రిసార్ట్లో కింద మీల్స్ కి రమ్మనమని చెబుతారు. మేం రెడీ అయి వస్తాం మీరు వెళ్ళండి అంటారు విక్కి. పద్మావతి రెడీ అవుతుంది. పద్మావతి రెడీ అయ్యేటప్పుడు గతంలో విక్కీ తనకిచ్చిన గాజులను చూసుకొని నేనంటే మీకు చాలా ఇష్టం ఉంది సారు అప్పట్లో మీరు నా మీద చూపించిన ప్రేమ ఇప్పటికీ మీ కళ్ళల్లో కనిపిస్తుంది కానీ మనసులో ఉన్నది బయటికి రావట్లేదు నేను ఈ నాలుగు రోజుల్లో మీ మీద నా ప్రేమని చెప్పి నా మీద మీ ప్రేమని కూడా బయట పెట్టిస్తాను అని అనుకుంటుంది. అప్పటికే విక్కీ రెడీ అయిపోయి కిందకి వెళ్తాడు. పద్మావతి ఎక్కడ అని అక్కడ వాళ్ళు అడుగుతారు నేను ఎలా వదిలించుకోవాలి అనుకుంటుంటే మీరు తగిలిస్తారు ఏమిటి అని మనసులో అనుకొని తను రూమ్ లోనే ఉంది అని చెప్పబోతుండగా పద్మావతి సారు నేను వచ్చేసాను అని అంటుంది. పద్మావతిని మెరిసిపోయే డ్రెస్ లో వస్తుంది. పద్మావతిని చూసి విక్కీ షాక్ అవుతాడు ఇంత అందంగా ఉంది ఏంటి అని మనసులో అనుకుంటాడు. పద్మావతి ఏంటి సారు అలానే చూస్తున్నారు అని అంటుంది నేనేం చూడలేదు నార్మల్గానే చూశాను అంటాడు విక్కీ. ఇక ఇద్దరు డిన్నర్ కి కూర్చుంటారు. అప్పుడే కృష్ణ అక్కడికి వచ్చి వీళ్ళిద్దరిని చూస్తాడు మీరిద్దరూ ఇక్కడ ఉన్నారా ఈ విషయం నేను ఎలా బయటపెడతానో చూడండి మీరు నేను ఇచ్చే జలక్కి ఫేస్ చేయడానికి రెడీగా ఉండండి అని కృష్ణ మనసులో అనుకోని పద్మావతి వికీల దగ్గరికి వచ్చి కూర్చుంటాడు. గుర్తు పెట్టకుండా ఉండడానికి క్యాప్ పెట్టుకొని మాస్క్ పెట్టుకొని వస్తాడు దూరంగా కూర్చుని వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు.

Nuvvu Nenu Prema today episode 29 september 2023 episode 429  highlights
Nuvvu Nenu Prema today episode 29 september 2023 episode 429 highlights

రేపటి ఎపిసోడ్లో పద్మావతికి అక్కడ ఉన్న బేరర్ రింగ్ ఇచ్చి ఇది విక్కీ సార్ కి పెట్టండి అని అంటాడు. వికీ కూడా రింగ్ ఇచ్చి ఇది పద్మావతికి పెట్టండి అని ఇద్దరు ప్రపోజ్ చేసుకోమని చెప్తాడు అలాగే చేస్తారు పద్మావతికి విక్కీ ప్రేమగా చేయి తీసుకొని రింగు పెట్టి ఐ లవ్ యు అని చెప్తాడు. పద్మావతి చాలా సంతోషపడుతుంది కానీ విక్కీ బేరర్ వెళ్లిపోయిన తర్వాత నేను నీకు నిజంగా చెప్పాలనుకుంటున్నావా కాదు ఇదంతా నటనే, నువ్వు కూడా బానే నటిస్తున్నావు అని అంటాడు ఏంటి సారు మీరు మాట్లాడేది నేను నటించడం ఏంటి నేను నిజంగానే మిమ్మల్ని ప్రేమిస్తున్నాను నేనేం నటించట్లేదు అని అంటుంది చాలు పద్మావతి నీ నటన నా గురించి నాకు తెలుసు నువ్వు జీవించాలని ప్రయత్నించకు అని అంటాడు విక్కీ


Share

Related posts

Hero Ram-Balakrishna: బాల‌య్య‌ను వాడేసుకోబోతున్న రామ్‌.. అదే నిజ‌మైతే ఫ్యాన్స్‌కి పూన‌కాలే!

kavya N

బిగ్ బాస్ సీజన్ సిక్స్ లేటెస్ట్ అప్ డేట్ ఇచ్చిన నాగార్జున..!!

sekhar

సినిమా ఇండస్ట్రీపై తాప్సి కాంట్రవర్సీ కామెంట్స్..!!

sekhar