Nuvvu Nenu Prema: నిన్నటి ఎపిసోడ్ లో పద్మావతి ఇంటికి వచ్చినందుకు విక్కీ కోప్పడం, పద్మావతి ఎలాగైనా విక్కీని మార్చుకోవాలి అనుకోవడం, జరుగుతుంది. పద్మావతి కుచలకి బుద్ధి చెబుతుంది. పద్మావతి విక్కీ మనసు గెలుచుకోవడానికి చేసే ప్రయత్నంలో విక్కీ కోప్పడతాడు అదంతా అరవింద చూస్తుంది.

ఈరోజు ఎపిసోడ్ లో, అరవింద రూమ్లో బాధపడుతూ ఉండగా కృష్ణ అక్కడికి వస్తాడు. నువ్వు ఎప్పుడూ ఇలానే ఆలోచిస్తూ ఉంటావా నేను చెప్పేది మీకు అసలు అర్థం కాదు వాళ్ళిద్దరూ అందరి ముందు నటిస్తున్నారు అని విక్కీ పద్మావతి ల గురించి కృష్ణ అరవింద తో చెప్తాడు అది కాదండి నా బాధంతా పద్మావతి విక్కీ చేస్తున్న పనులకి చాలా బాధపడుతుంది నేను చెప్తున్నాను కదరానమ్మ వాళ్లు ఒకరంటే ఒకరికి ఇష్టం లేదు మీరే వాళ్ళని కలపాలనుకుంటున్నారు వాళ్ళని వదిలేస్తే ఎవరి దారి వాళ్లు హ్యాపీగా ఉంటారు అని అంటాడు. అరవింద అలా మాట్లాడతారు ఏంటండీ అని అంటుంది.
Nuvvu Nenu Prema: విక్కీ ని ప్రేమిస్తున్న పద్మావతి..అరవింద మనసులో అనుమానం..

అరవింద ప్లాన్..
నిజం చెప్తున్నాను రానమ్మ నువ్వు నా మాట నమ్మట్లేదు నేను మొదటి నుంచి చెప్తున్నది ఇదే కదా మీకు ఇంట్లో ఎవరికీ నేను చెప్పే మాటలు నచ్చట్లేదు.ఇప్పుడు మీకళ్ళతో మీరే చూశారుగా విక్కీ పద్మావతిని ఎలా కోప్పడ్డాడు అని చెప్పి వాళ్ళిద్దరూ హనీమూన్ కి వెళ్లినా కూడా కలిసి ఉండరు అని అంటాడు. వెంటనే అరవింద్ కి ఐడియా వస్తుంది. ఏమన్నారు మళ్ళీ ఇంకోసారి అనండి అని అంటుంది. అదే రాణమ్మ వాళ్ళిద్దరూ హనీమూన్ కి పంపించినా కూడా కలిసి ఉండరు వాళ్ళ మధ్య అంత కోపం ఉంది అని అంటున్నాను అంటాడు. ఇప్పుడే నాకు ఐడియా వచ్చిందండి వాళ్ళిద్దరినీ నిజంగా మీరు అన్నట్టు హనీమున్ కి పంపిస్తాను అని అంటుంది. కృష్ణ షాక్ అవుతాడు. అది కాదురా అమ్మ నేను చెప్పేది ఒకసారి విను అని అంటాడు.మీరు ఇంకేం చెప్పొద్దు నాకు మంచి ఐడియా వచ్చింది. మీకు తెలిసిన ట్రావెల్స్ వాళ్లకి మీరే ఫోన్ చేసి రెండు టికెట్స్ బుక్ చేయండి. అంటే వాళ్ళని ఒకసారి అడుగుదాం రానమ్మ అని అంటాడు ఏం అవసరం లేదు నేను వెళ్లి వాళ్లకి చెప్తాను మీరు టికెట్స్ బుక్ చేయండి ముందు అని బలవంతంగా కృష్ణ చేత విక్కీ పద్మావతుల హనీమూన్ టికెట్స్ బుక్ చేయిస్తుంది. కృష్ణ మనసులో నేను ఏ ప్లాన్ ఇద్దామనుకున్నా అరవిందధాన్ని తిప్పి కొడుతోంది నేను చేయాలనుకున్నదేంటి జరుగుతోంది ఏంటి ఎలాగైనా వీళ్ళు హనీమూన్ కి వెళ్ళకూడదు అని అనుకుంటూ ఉంటాడు మనసులో, అయినా అరవింద్ చెప్పిందని టికెట్స్ బుక్ చేస్తాడు బుక్ చేశాను రానమ్మ అని చెప్తాడు. చాలా థాంక్స్ అండి నాకన్నా మీరే ఎక్కువ పద్మావతి వికీల గురించి ఆలోచిస్తున్నారు వాళ్ళు సంతోషంగా ఉండాలని మీరు కోరుకుంటున్నారు తప్పకుండా అదే జరుగుతుంది అని అక్కడ నుంచి అరవింద వెళ్ళిపోతుంది.
Krishna Mukunda Murari: భవానీ దేవికి నిజం చెప్పాలని డిసైడ్ అయిన ముకుంద.. కృష్ణ ఏం చేయనుంది?

పద్మావతి గొప్పలు చెప్పడం..
ఇక అరవింద విక్కీ పద్మావతిని ఒప్పిస్తుంది. పద్మావతి బట్టలు సర్దుకుంటూ ఉంటుంది. వికీతో సారు ఎవరైనా హనీమూన్ అంటే ఇలా డల్ గా ఉంటారా మనకి పెళ్లయి ఇన్ని రోజులకి హనీమూన్ వెళ్తున్నాము. అంటే మీరు ఎంత సంతోషంగా ఉండాలి ఏంటి ఇలా ఉన్నారు అని అంటుంది. నువ్వంటేనే నాకు ఇష్టం ఉండదు అలాంటిది నీతో కలిసి హనీమూన్ కంటే నా మొహం లో సంతోషం అలా కనిపిస్తుంది. మా అక్క బాధ పడకూడదని నేను ఒప్పుకున్నాను లేదంటే నీ మీద ఇష్టంతో కాదు నువ్వంటేనే నాకు అసహ్యం అని అంటాడు. పద్మావతి మీరు ఎన్నైనా అనండి నేను మాత్రం మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాను అని అనుకుంటుంది. ఇది పద్మావతి వాళ్ళ ఫ్రెండ్ కి ఫోన్ చేసి నేను మా ఆయన హనీమూన్ కి వెళ్తున్నాము ఎక్కడికి పో తెలుసా మాల్దీవులకి అని అంటుంది. ఇప్పుడు నేను మా ఆయన ఫ్లైట్ ఎక్కబోతున్నాము. అక్కడ చాలా షాపింగ్ సినిమాలు షికారులు అన్నీ చేస్తాము అని అంటుంది. విక్కీ ఎందుకు అందరితో అలా చెప్తావు మన వెళుతున్న విషయం ఇప్పుడు ప్రపంచం మొత్తం తెలియాల ఏంటి అని అంటాడు. మీ ఊరు మా ఊరు తప్ప నాకు ఇంకో ప్రపంచమే తెలియదు అలాంటిది ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కి విదేశాలకు పోతుంటే ఆ విషయాన్ని మా ఫ్రెండ్స్ కి పంచుకున్నాను తప్పేముంది అని అంటుంది. నువ్వు బాగా ఎక్కువగా ఊహించుకుంటున్నట్టున్నావు అంత ఊహించుకోకు తర్వాత నువ్వే బాధపడాల్సి వస్తుంది అని అంటాడు విక్కి. ఏం పర్లేదు ఈ మాత్రం ఉండాల్సిందే అని మనసులో అనుకుంటుంది పద్మావతి.

విక్కీ పద్మావతి ప్రయాణం..
ఇక అరవింద విక్కీకి ఫోన్ చేసి ఫ్లైట్ టైం అవుతుంది తొందరగా కిందకి రండి అని అంటుంది. పద్మావతి మీరు ఫ్రెష్ చేయండి నేను రెండు లకేజీలు సర్దేస్తాను అని అంటుంది. విక్కీ వచ్చేసరికి పద్మావతి పెద్ద పెద్ద బ్యాగులకి బట్టలు సర్దుతుంది. ఏంటి మనం ఎన్ని రోజులు అక్కడ ఉందామని నీకు ఆలోచన ఇంత పెద్ద బ్యాగులు సద్దాం ఏంటి అని అంటాడు. అంటే అరవింద్ గారి నాలుగు రోజులన్నారు కానీ మనం పది రోజులైనా ఉందామండి అన్ని చూసుకొని నిదానంగా వద్దాము ఇక్కడికి వచ్చి మాత్రం చేసే పని ఉంది అని అంటుంది. నీకు పని లేకపోవచ్చు నాకు చాలా పనులు ఉన్నాయి అని అంటాడు విక్కి.ఏం పర్లేదు ఆ పనిలోని చూసుకోవడానికి ఇంకా చాలామంది ఉన్నారు మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే నేను చేస్తాను మీరు అక్కడే ఉండి పని చేసుకోవచ్చు మనం ఎట్లాగైనా పది రోజులైనా ఉండాలి కదా అని అంటుంది. నారాయణ హాల్లో కుటుంబ సభ్యులతో కలిసి ఎదురు చూస్తూ ఉంటాడు విక్కీ పద్మావతి కోసం, అప్పుడే విక్కీ పద్మావతి ఇద్దరూ కిందకి వస్తారు. శాంతాదేవి మీరిద్దరూ సంతోషంగా గడపడానికే అక్కడికి వెళ్తున్నారు అక్కడికి వెళ్లిన తర్వాత ఏ గొడవలు పడకండి అని అంటుంది. అరవింద నేను చెప్పినవన్నీ గుర్తున్నాయి కదా మీరు సంతోషంగా ఉండాలి అక్కడ నేనేం చేసినా మీకోసమే చేస్తున్నాను అది అర్థం చేసుకోండి విక్కీ మీ పద్మావతి మీద కోప్పడకు తనని బాధ పెట్టాలని చూడకు అక్కడ మీరు సంతోషంగా ఉండండి అని అంటుంది. ఆర్య పద్మావతి తో ఏంటి ఇంత పెద్ద బ్యాగ్స్ అద్దుకొని వెళ్తున్నారు రూమ్లో బట్టలు అన్ని బ్యాగులకు సద్దేసినట్టున్నారుగా అని అంటాడు.అవును బావగారు మీరు నాలుగు రోజులు అన్నారు మేం పది రోజులు ఉందాం అనుకుంటున్నాము మా ఆయనే నాలుగు రోజులు ఏం సరిపోతాయి మనం కనీసం 10 రోజులైనా ఉండాలి అని అన్నాడు అంటుంది.. అందరూ నవ్వుకుంటారు. ఆర్యా విక్కి తో నువ్వు హడావిడి పడి ఇక్కడ పనులు ఉన్నాయని రావద్దు అన్ని పనులు నేను చూసుకుంటాను పద్మావతి సంతోషంగా ఉండు అని అంటాడు. కుచల నీ సొమ్మేం పోయింది పది రోజులు కాదు నెల రోజులైనా ఉందామనుకుంటావు. నువ్వు కాదు కదా ఖర్చు పెట్టేది అని అంటుంది. వెంటనే నారాయణ నువ్వు కాస్త ఆపుతావా నీ సొమ్ము కూడా ఏమి పోవట్లేదులే వాళ్ళని సంతోషంగా వెళ్లనివ్వు అంటాడు. కుశల మేకప్ కిట్ అడుగుతుంది విక్కీని మాల్దీవుల నుంచి తీసుకు రమ్మని, విక్కీ సరే అంటాడు. ఫ్లైట్ టైం అయింది బయల్దేరండి అని అంటాడు నారాయణ. విక్కీ సరే అని బయలుదేరుతాడు పద్మావతి అరవింద హగ్ చేసుకుని చాలా థాంక్స్ అని చెప్తుంది. పిచ్చి పిల్ల నేనే చేసినా కానీ నీ సంతోషం కోసమే చేస్తాను మీరు హ్యాపీగా ఉండండి నాకు అంతే చాలు అని అంటుంది.కృష్ణ మాత్రం మనసులో ఎలాగైనా సరే వీళ్ళిద్దరూ హనీమూన్ కి వెళ్లడానికి వీల్లేదు అని ఫోన్ తీసుకొని బయటికి వెళ్తాడు.

ప్లాన్ రివర్స్ చేసిన విక్కి..
ఇక పద్మావతి విక్కి కారులో బయలుదేరి వెళుతూ ఉంటారు. పద్మావతి చాలా సంతోషంగా, చాలా ఎక్సైట్మెంట్ గా ఉంటుంది మొదటిసారి ఫ్లైట్ ఎక్కబోతున్నాము అని, విక్కీ మాత్రం చాలా కోపంగా ఉంటాడు. పద్మావతి వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి నీకు ఒక సంతోషకరమైన విషయం చెబుదాం అనుకుంటున్నాను అమ్మ అని అంటుంది. పార్వతి ఏంటో చెప్పమ్మా అని అంటుంది. నేను మీ అల్లుడు కలిసి మాల్దీవులకి అంటే విదేశాలకి పోతున్నాం అమ్మ అని అంటుంది పద్మావతి దానికి పార్వతి చాలా సంతోషపడుతుంది. విక్కీ ఎందుకు అందరికీ అలా చెప్తున్నావు అని అంటాడు. మా అమ్మ సంతోష పడుతుందండి మనం బాగున్నాము అని తెలిస్తే అని పద్మావతి అంటుంది. పద్మావతి దేవుడికి దండం పెట్టుకుంటూ ఎలాగైనా సరే మేము అక్కడికి వెళ్లిన తర్వాత తన మనసు మార్చి తన నా మీద చూపిస్తున్న ప్రేమ నీ బయటికి తీసుకురావాలి అంతకుముందు ఎలా ఉన్నారు ఇప్పుడు అలానే ఉండేలాగా నేను ఆయన్ని మార్చుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది. విక్కి చూసి ఏంటి అని అంటాడు. ఏం లేదండి మనం మొదటిసారి ఫ్లైట్ ఎక్కబోతున్నాం కదా అందుకని దేవుడికి దండం పెట్టుకుంటున్నాను మీకు కూడా ఏమైనా కోరికలు ఉంటే చెప్పండి నేను చెప్పేస్తాను అని అంటాడు నాకున్నది ఒకటే కోరిక అని అంటాడు. ఏంటో చెప్పండి మా శ్రీనివాసుడు వెంటనే తీరుస్తాడు అని అంటుంది. నీ నోరు మూతపడాలని అంటాడు. అది జరగని పనిలే పోనివ్వండి అని అంటుంది. ఇక విక్కి ఎయిర్ పోర్ట్ వైపు కాకుండా వేరే రూట్లోకి పోనిస్తాడు. పద్మావతి ఏంటి సారు ఎయిర్పోర్ట్ అటువైపు అయితే మీరు ఇటు తిప్పారు అటు పోదాం పదండి అని అంటుంది. నువ్వు కాస్త నోరు మూస్తావా నాకు తెలుసు మనం ఇప్పుడు మాల్దీవులకి వెళ్లట్లేదు అని అంటాడు. పద్మావతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి సార్ మీరు మాట్లాడేది అయితే ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అని అంటుంది. ఇంటి దగ్గరే చెప్పాను కదా నీకు నువ్వు ఎక్కువ ఊహించుకోకు బాధపడాల్సి వస్తుంది అని, మనం ఇప్పుడు ఇక్కడ దగ్గరలో ఉన్న ఒక రిసార్ట్ కి వెళ్తున్నాము. అక్కడే ఒక నాలుగు రోజులు ఉండి ఇంటికి వెళ్తాము ఇంట్లో అందరికీ మనం మాల్దీవులకు వెళ్ళామని అనుకుంటారు. నువ్వు పిచ్చిపిచ్చి ఆలోచనలు మానేసి అరవకొండ కూర్చో అని అంటాడు. పద్మావతి చాలా బాధపడుతుంది ఎంతో సంతోష పడింది విదేశాలకు వెళ్ళాలి అని కానీ విక్కీ తన ప్లాన్ ని రివర్స్ చేసేస్తాడు. ఇక హోటల్ లో దిగుతారు అక్కడ పద్మావతి పది రోజులైనా ఉందామండీ అని అంటుంది విక్కీ కోపడి నాలుగు రోజులు సరిపోతాయిలే అని అంటాడు.

రేపటి ఎపిసోడ్ లో, పద్మావతి తో విక్కీ నువ్వు ఎందుకు ఓవర్గా యాక్టింగ్ చేస్తున్నావ్ అని అంటాడు. మీరే కదండీ బయట ఉన్నప్పుడు మనిద్దరం భార్యాభర్తల్లా గా ఉండాలి అని అన్నారు అందుకే అలానే ఉంటున్నాను అని అంటుంది. విక్కీ నియమికి చెప్పాను చూడు నన్ను అనుకోవాలి అని కోపంగా రూమ్ కి బయలుదేరుతాడు. పద్మావతి కూడా విక్కీ వెనకాలే అతని అడుగు లో అడుగులు వేస్తూ వెళ్తుంది.